#భారత కళారూపాలు: ఎదుగుదల కోరుకునే హస్త కళాకారులను ఫ్లిప్‌కార్ట్ సమర్థ్-‘ఎన్‌యూఎల్ఎం’ ద్వారా కలుసు

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | ગુજરાતી | मराठी

ఫ్లిప్‌కార్ట్ సమర్థ్-‘ఎన్‌యూఎల్‌ఎం’ భాగస్వామ్యం కింద దేశంలోని అనేకమంది హస్తకళాకారులు, చేతివృత్తుల నిపుణులు తమ ఉత్పత్తుల ప్రదర్శనతోపాటు నైపుణ్యానికి తగిన అమ్మకాల దిశగా ‘బిగ్ బిలియన్ డేస్’ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి స్వస్థలాలను వర్చువల్‌గా సందర్శించి, ఆ చేతివృత్తుల వారినుంచి మీరెంచుకునే #భారత కళారూపాల (ArtFormsOfIndia) ఉత్పత్తుల గురించి తెలుసుకోండి.. ఈ పండుగల సమయంలో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా వారికి తప్పక మద్దతివ్వండి.

artisans

తెలంగాణలోని వరంగల్‌ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌లోని కుల్లూ వరకూ లక్షలాది కళాకారులు భారతదేశపు శతాబ్దాల నాటి సమ్మిళిత, సంక్లిష్ట కళారూపాల సృష్టి, పరిరక్షణకు తరతరాలుగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనదయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ పట్టణ జీవనోపాధి కార్యక్రమం (డే-ఎన్‌యూఎల్‌ఎం) ద్వారా ఈ హస్తకళాకారులు, పట్టణ పేద మహిళలకు వర్ధమాన మార్కెట్ అవకాశాల అందుబాటులో తోడ్పాటునివ్వాలని సంకల్పించింది. ఈ మేరకు 2020 జనవరిలోఫ్లిప్‌కార్ట్‌తో ఎన్‌యూఎల్‌ఎం చేయి కలిపింది.నిపుణులైన కార్మికులు, కళాకారులను ఇ-కామర్స్ రంగంలోకి తేవడం ద్వారా వారికి మరింత సాధికారత కల్పించడం దీని లక్ష్యం.

కాగా, 2019లో ప్రారంభమైనఫ్లిప్‌కార్ట్‌ సమర్థ్‌ భారతీయ హస్తకళాకారులు, చేనేత కార్మికులు, సూక్ష్మ సంస్థలను అక్కున చేర్చుకుని వారి సముద్ధరణకు సంకల్పించింది. ఈ మేరకు వారిని ఇ-కామర్స్‌ రంగంలోకి తీసుకువచ్చి, జాతీయస్థాయిలో వినియోగదారుల సమూహాన్ని చేరువ చేయాలని తలపెట్టింది. ఈ కార్యక్రమం కింద కేటలాగ్ మద్దతు, శిక్షణ తరగతులు, ప్రకటన వెసులుబాట్లు వగైరా సానుకూలతలను కల్పిస్తుంది. ఈ విధంగా అణగారిన వర్గాలను ప్రధాన స్రవంతిలో చేర్చడంతోపాటు సమాన అవకాశాలు అందేలా చేస్తుంది.

దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లో విస్తరించిన ఎన్‌యూఎల్‌ఎం-ఫ్లిప్‌కార్ట్ సమర్థ్ భాగస్వామ్యం అక్కడి ప్రత్యేక, సంప్రదాయ ఉత్పత్తులను ఉమ్మడి వేదికపైకి తేవడంలో భాగంగా ప్రతి రాష్ట్రం నుంచీ కళాకారులను ప్రోత్సహిస్తుంది. మీరెంచుకునే ఉత్పత్తి ఎక్కడి నుంచి వచ్చింది… అదెలా తయారు చేయబడింది.. వాటిని అంత నైపుణ్యంతో రూపొందించిన వ్యక్తులెవరు? వంటి సమాచారం కోసం ఇందులో భాగస్వాములైన కొందరు కళాకారులను చూడండి.. వారి హస్తకళా నైపుణ్యంతో తయారైన, ప్రామాణిక ఉత్పత్తులను పరిశీలించండి.


కుల్లూ టోపీలు, మఫ్లర్లు

కుల్లూ, హిమాచల్‌ ప్రదేశ్‌

artisans

కుల్లూ వాసులు గర్వించే, ఎంతో ఆనందంగా ధరించే ‘కుల్లూ టోపీ’ హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక సంప్రదాయక ఉత్పత్తి. గుండ్రని ఈ టోపీ పైన చదునుగా ఉండి, దానిపై రంగురంగుల ఎంబ్రాయిడరీ పనితనం ద్వారా సులువుగా గుర్తించబడుతుంది. వీటిలో నిపుణతతో చేసిన అనేక నమూనాలుంటాయి. దీన్ని సాధారణంగా స్థానిక ఊలు దారంతో ఒక చిన్నఖడ్డీపైఅల్లుతారు. తయారీకి వాడే దారంసహా ఈ టోపీ 100 శాతం చేతితో తయారైనదే. కుల్లూ లోయలో చాలామంది హిమాచల్ చలికాలంలో వెచ్చదనం కోసం ఈ టోపీలను ధరిస్తారు. పెళ్లిళ్లు, పండుగల నుంచి ధార్మిక-స్థానిక కార్యక్రమాలు, సభలు, సమావేశాల దాకా ప్రత్యేక సందర్భాల సంప్రదాయ కుల్లూ వస్త్రధారణలో ఇదొక విడదీయలేని భాగం.

తయారీదారులను కలుసుకోండి

ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యమయ్యే ప్రసిద్ధ హస్తకళా ఊలు వస్త్రాలను హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లూ హిమాలయ లోయలోగల 20కిపైగా మహిళా స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జి) చేతితో తయారు చేస్తాయి. చాలాది మహిళలు తమ ఇళ్లలో లేదా గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలనుంచి నేరుగా వీటిని తయారుచేస్తారు. తమ నైపుణ్యంతో ఇ-కామర్స్ వేదికగా వారు ఎన్నో విజయాలు సాధించడం చూసి మరింత మంది మహిళలు ఈ ఉత్పత్తుల తయారీలో వారితో చేయి కలిపారు.

వారిపై కథనం కోసం ఈ వీడియో చూడండి:

YouTube player

Click here to directly support these artisans on Flipkart


వరంగల్‌ ధుర్రీ

వరంగల్‌, తెలంగాణ

artisan

రంగల్‌ ధుర్రీల తయారీ కళ చాలా సంక్లిష్టమైనది. గుంట మగ్గం, సాలెమగ్గంపై ఏళ్ల తరబడి శ్రమిస్తేగానీ వివిధ రంగుదారాలతో అద్భుత రూపం సృష్టించే ఈ కళా నైపుణ్యం అబ్బదు. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో వందలాది కళాకారులు ఈ ధుర్రీలను అబ్బురపరిచే నైపుణ్యంతో తయారు చేస్తారు. తెలంగాణ చేనేత సంప్రదాయాలకు వారు గర్వకారణం. ధుర్రీల సాదాసీదా జిగ్-జాగ్ డిజైన్లు, మన్నికతోపాటు కళాకారుల బహుముఖ ప్రజ్ఞ వల్లనే అవి ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. ఈ కళా నైపుణ్యానికి ఇటీవలే భౌగోళిక గుర్తింపు (జీఐ) ధ్రువీకరణ లభించింది.

తయారీదారులను కలుసుకోండి

artisan

చిరకాల మన్నికగల ఉపయోగకర ధుర్రీలను వరంగల్‌ నేత కార్మికులు 100 శాతం పత్తి దారంతో తయారు చేస్తారు. ఈ జిల్లాలోని శ్రీ సాయి స్వయం సహాయక బృందం ఫ్లిప్‌కార్ట్ సమర్థ్-ఎన్‌యుఎల్‌ఎం భాగస్వామ్యం కింద ఈ ఉత్పత్తులను తయారుచేస్తోంది.

Click here to directly support these artisans on Flipkart


గుర్రపు డెక్క బుట్టలు

నాగావ్‌, అస్సాం

artisan

ప్ర పంచంలోనే అత్యంత వేగంగా పెరిగే మొక్కలలో గుర్రపు డెక్క ఒకటి. నిగనిగలాడే వెడల్పాటి ఆకులతో నీటిపై తేలియాడే ఈ మొక్క అన్ని రుతువులలోనూ పెరుగుతుంది. అస్సాంలోని నాగావ్‌లో ‘ఎన్‌యూఎల్‌ఎం’తో ముడిపడిన ఒక స్వయం సహాయక బృందం (ఎస్‌హెచ్‌జి) బుట్టల అల్లకంలో ఈ మొక్కను సృజనాత్మకంగా వినియోగించే మార్గాన్ని కనుగొంది. ఈ బృందం సభ్యులు తమ ఆవాసం సమీపాన పెద్దగా ప్రవాహంలేని కోలాంగ్‌ నది నుంచి ఈ మొక్కను సేకరిస్తారు. పొడవైన ఈ గుర్రపు డెక్క మొక్క సేకరణ తర్వాత వాటి వేళ్లు, ఆకులను తొలగించి, కాండపు తీగను 5 నుంచి 7 రోజులు ఎండబెడతారు. అటుపైన వాటిని కట్టలుగా కట్టి, పొడి ప్రదేశంలో నిల్వచేస్తారు. చివరగా, నేత లేదా అల్లకం పద్ధతిలో సంచులు, బుట్టలు తయారుచేస్తారు.

తయారీదారులను కలుసుకోండి

artisans
ఎస్‌హెచ్‌జి సభ్యులైన చాలామంది మహిళలు గుర్రపు డెక్క ఉత్పత్తుల తయారీలో పాల్గొంటారు. నాగావ్‌ పట్టణంలోని లఖ్యజ్యోతి స్వయం సహాయక బృందం సభ్యులు మహిళల హ్యాండ్‌ బ్యాగులు, చిన్న పర్సులు, బకెట్ల వంటివి తయారు చేస్తుంటారు.

Click here to directly support these artisans on Flipkart


చంబా ఇత్తడి పళ్లాలు

చంబా జిల్లా, హిమాచల్‌ ప్రదేశ్‌

artisans

హిమాచల్‌ ప్రదేశ్‌లోని చంబా జిల్లా లోహపు పోత వస్తువుల తయారీ వారసత్వానికి ప్రసిద్ధి. ఈ చంబ్యాలీ పళ్లాలతయారీ పని చంబా రాజ సంస్థానం కాలంనాటిది. చంబా, భార్మౌర్‌ సహా ఈ ప్రాంతంలోని అనేక ఆలయాల్లో లోహంతో మలచిన ఈ పాత్రలు కనిపిస్తాయి.

వివిధ నమూనాల్లోని ఈ లోహపు పళ్లాలు రకరకాల అంచులతో చూడముచ్చటగా ఉంటాయి. ‘రిపౌస్’ అనే ప్రాచీన పద్ధతిలో సుత్తులు తదితర పరికరాలతో వాటిపై డిజైన్లను తీర్చిదిద్దుతారు. సంప్రదాయ చంబా పౌరాణిక దేవతలు, స్థానిక ఆలయాల్లోని శిల్పాల ప్రతిరూపాలు లేదాపహరిసూక్ష్మ చిత్రాలు వంటి ఇతివృత్తాలతో ఈ డిజైన్లు రూపొందిస్తారు.

తయారీదారులను కలుసుకోండి

artisan

ఫ్లిప్‌కార్ట్‌లో లభించే చంబా లోహపు పళ్లాల ఉత్పత్తులను పదేళ్లుగా ఈ కళలో ఆరితేరిన కళాకృతి స్వయం సహాయక బృందంలోని 5 మంది సభ్యులు తయారు చేస్తారు.

Click here to directly support these artisans on Flipkart


భైరవ్‌గఢ్‌ ప్రింట్లు

ఉజ్జయిని, మధ్యప్రదేశ్‌

artisans

జ్జయిని నగరంలో ఆవిర్భవించిన భైరవ్‌గఢ్‌ ప్రింట్‌ విధానాన్ని దాదాపు 200 ఏళ్లకుపైగా కొనసాగుతున్న ప్రాచీన కళగా చెబుతారు.

ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. భైరవ్‌గఢ్‌ ప్రింట్‌ ఉత్పత్తులపై కనిపించే సంక్లిష్ట ప్రాచీన గాథల మూలాంశాలను కరిగించిన మైనంతో సృష్టిస్తారు. గ్యాస్‌ మంటమీద మైనాన్ని నెమ్మదిగా కరిగిస్తూ అదొక ఇసుకతో కప్పబడిన బల్లమీదకు జారేలా చేస్తారు. దానిపై లోహంతో కప్పబడిన వస్త్రంపై కొబ్బరి పీచు చుట్టిన లోహపు కడ్డీతో మైనపు డిజైన్‌ నమూనాను గీస్తారు. ఇలా పోసిన మైనం ఆరిన తర్వాత వస్త్రం మీద డిజైన్‌కు కావలసిన రంగులు వేస్తారు.

తయారీదారులను కలుసుకోండి

artisans

ఉజ్జయినిలోని మాడ్ని స్వయం సహాయక బృందం సభ్యులు తరతరాలుగా సంక్రమిస్తున్న ఈ కళా నైపుణ్యాన్ని తమ కుటుంబాలతో కలసి జీవనోపాధిగా మార్చుకున్నారు.

Click here to directly support these artisans on Flipkart


వెండి నగిషీ పని

కరీంనగర్‌, తెలంగాణ

artisans

తెలంగాణలోని కరీంనగర్ ప్రాంతం సూక్ష్మ, సున్నిత నగిషీ ఉత్పత్తులు సృష్టించే అద్భుత నైపుణ్యంగల కళాకారులకు నిలయం. సున్నితమైన వెండి పోగులు జిగ్-జాగ్ నమూనాలో ఉచ్చు తరహాలో వంకీలు తిరిగి ఉంటాయి. ఇది వాటికి స్పష్టమైన జలతారు వంటి రూపాన్నిస్తుంది. ఈ వంకీలను, సన్నని వెండిని అతుకుతూ కళాత్మక మూలాంశాలకు జీవం పోస్తారు.

కరీంనగర్ వెండి నగిషీ కళకు 2007లో మేధో సంపత్తి హక్కుల రక్షణ లేదా భౌగోళిక గుర్తింపు (జిఐ) హోదా కూడా లభించింది. కాగా, ఈ కళ మూలాలు 17 నుంచి 19 శతాబ్దాల మధ్య ఇటలీ, ఫ్రాన్స్‌ లోహపు పనిలోనూ కనిపించడం ఆసక్తికరం.

తయారీదారులను కలుసుకోండి

ఈ వెండి నగిషీ అలంకరణ వస్తువులను తెలంగాణలోని కరీంనగర్‌లో చిలుకూరి బాలాజీ స్వయం సహాయక బృందం సభ్యులు, వారి కుటుంబాలు తయారు చేస్తాయి. కొన్నేళ్లుగా ఈ ఉత్పత్తుల తయారీలో నిమగ్నమైన వీరు ఈ కళ మరుగున పడకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. తరతరాలుగా సంక్రమిస్తూన్న ఈ కళ తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కళా-సాంస్కృతిక ప్రతిష్టకు ప్రతిబింబం. చక్కని వెండి నగిషీ కళ అత్యంత నిపుణులకే సాధ్యం.. కాబట్టే ఈ సంప్రదాయంలో చేయి తిరిగిన హస్తకళాకారులు మాత్రమే నిపుణులుగా పరిగణించబడుతున్నారు.


అంకోడి

అహ్మదాబాద్‌, గుజరాత్‌

artisans

’అంకోడి’ని గుంథన్‌ కళగానూ పిలుస్తారు. ఇది గుజరాత్‌కు ప్రత్యేకమైన అల్లిక కళారూపమేగాక బంగారు తీగలు వాడే విశిష్ట కళ. పూర్తి హస్తకళా నైపుణ్యంతో పర్సుల నుంచి వాలెట్లదాకా రకరకాల ఉత్పత్తుల తయారీకి ఒకేఒక రకం అల్లకపు సూదిని వాడటం విశేషం.

తయారీదారులను కలుసుకోండి

అహ్మదాబాద్‌లో స్వయం సహాయక బృందాలతో ముడిపడిన అత్యంత నైపుణ్యంగల మహిళా హస్తకళాకారులు 2001 నుంచి ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఉత్పత్తుల అమ్మకం వారి హస్తకళకు విజయంతోపాటు విస్తృత ప్రాచుర్యం కూడా తెచ్చిపెట్టింది. అంతేకాకుండా కళాకారులకు మంచి ఆదాయం ఆర్జించి పెట్టింది. ఆ మేరకు తమ చిన్న వ్యాపారాలను మరింత విస్తరించుకునేలా వారిలో ఉత్సాహం నింపింది.

భారతి శారద, మాస్టర్‌ డిజైనర్‌

artisans

నేను నా పనిని ఎంతో ప్రేమిస్తాను. ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్‌’లో భాగం కావడం నాకెంతో సంతోషంగా ఉంది. మీరు నా ఉత్పత్తులు కొనడం ద్వారా చిన్న స్థానిక వ్యాపారాలకు మద్దతిస్తారని, దాన్ని తదుపరి స్థాయికి చేర్చడంలో మాకు తోడ్పడతారని, మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తారని నేను నమ్ముతున్నాను. ప్రజలు మా ఉత్పత్తులు కొన్నపుడు, ఫ్లిప్‌కార్ట్ వంటి పెద్ద వేదికలలో వాటిని చూసినప్పుడు మా అమ్మకాల పరిధితోపాటు ఆదాయమూ తప్పక పెరుగుతాయి.

మేమంతా ‘బిగ్ బిలియన్ డేస్’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అంతేకాకుండా నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి శ్రమిస్తున్నాం. మాకు ఇదో గొప్ప అవకాశం.. ఫ్లిప్‌కార్ట్ సమర్థ్‌ ద్వారా మా ఉత్పత్తుల భారీ అమ్మకాలుసహా వాటికి మరింత ప్రాచుర్యం లభిస్తుందని ఆశిస్తున్నాం.

కవితా బెన్‌, హస్తకళాకారిణి

మేం తయారుచేసే ఉత్పత్తులను సమీపంలోని స్థానిక మార్కెట్లలో అమ్ముతుంటాం. అయితే, ఇప్పుడు వాటిని ఫ్లిప్‌కార్ట్‌ వేదిపై విక్రయిస్తూ, ఎదగడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు మా కళ, ప్రతిభ గురించి మరింత ఎక్కువ మందికి తెలుస్తుంది. ఆ విధంగా మా ఉత్పత్తులపై అవగాహన పెరిగి, మాకు మెరుగైన ఆదాయ వనరులు లభిస్తాయి.

మా చిన్న ఉత్పత్తులు ఫ్లిప్‌కార్ట్‌ వేదికపై అందుబాటులోకి రావడంపై మేమెంతో సంతోషిస్తున్నాం. మా వ్యాపారం మరింత వృద్ధి చెందేవిధంగా అమ్మకాలు భారీగా జరుగుతాయని మేం ఆశిస్తున్నాం.

షీతల్‌ బెన్‌, హస్తకళాకారిణి

మేము చాలా అట్టడుగు స్థాయిలోగల చిన్న మహిళా పారిశ్రామికవేత్తలం. ఫ్లిప్‌కార్ట్ సమర్థ్‌తో మా వ్యాపారంతోపాటు మేము కూడా ఎదుగుతూ మా ఆదాయం పెంచుకుంటున్నాం. మేము చిన్నతరహా కార్మికులుగా రోజువారీ సంపాదన చేస్తుంటాం. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో మా ప్రతిభను, మా హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శించే మంచి అవకాశం మాకు దొరికింది. మేం ఎదగడానికి, మరింత సంపాదించడానికి ‘బిగ్ బిలియన్ డేస్’ ఒక మంచి సందర్భం మాత్రమేగాక చాలా మంచి అవకాశమని మేం భావిస్తున్నాం.

Click here to directly support these artisans on Flipkart


భద్రకాళి పూల ఉత్పత్తులు – సాంబ్రాణి వత్తులు

వరంగల్‌, తెలంగాణ

artisans

భద్రకాళి ధూప ఉత్పత్తులను గులాబీ రేకుల పొడి, దేవదారు ఆయుర్వేద పదార్థంతో తయారుచేస్తారు. ఈ సేంద్రియ సాంబ్రాణి వత్తులను వివిధ మతపరమైన కార్యక్రమాలతోపాటు ధ్యానంలో ఉపయోగిస్తారు.

తయారీదారులను కలుసుకోండి
ఈ ఉత్పత్తులను ఆదర్శ సిటీ లెవల్‌ ఫెడరేషన్‌ తయారుచేస్తుంది. స్వయం సహాయక బృందాల సభ్యులైన 10 మందికిపైగా మహిళలు తమ జీవనోపాధి కోసం ఇక్కడ పనిచేస్తుంటారు.


శశి మస్తానీ నవూవారీ పాటల్‌ (లుగడా)

నాగ్‌పూర్‌, మహారాష్ట్ర

artisan

వూవారీ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన 9 గజాల చీర. ఈ వస్త్ర విశేషం పొడవు కారణంగానే దానికి ఆ పేరు వచ్చింది. శతాబ్దాల చరిత్రగల ఈ వస్త్రధారణకుగల ప్రత్యేక శైలి దీని విశిష్ట లక్షణాలలో ఒకటి.

తయారీదారులను కలుసుకోండి

ఈ నవూవారీ చీరలను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో ‘స్నేహల్ మహిళా బచత్ గట్‌’కు చెందిన మహిళలు రూపొందించారు. వీరిలో చాలామంది ‘ఎన్‌యూఎల్‌ఎం’ ద్వారా తమ వ్యాపార ప్రారంభానికి మూలధన మద్దతు పొందారు. ఇప్పుడీ మహిళలు చాలామందికి ఈ కళను నేర్పుతున్నారు.


ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్ సమర్థ్‌తో మహమ్మారి అనంతర వ్యాపార పునరుద్ధరణపై పంజాబ్‌ మహిళా హస్తకళాకారుల ఆశాభావం.

Enjoy shopping on Flipkart