ఆధునిక భారతదేశంలో స్వేచ్ఛ: వ్యాపారవేత్త బిట్టూ దత్తా కథనం

Read this article in বাংলা | English | தமிழ் | ಕನ್ನಡ | ગુજરાતી | मराठी | हिन्दी

భారతదేశంలో బిట్టూ దత్తా వంటి వ్యాపారవేత్తలు సమాజానికి మూలస్తంభాలు మాత్రమేగాక వేగుచుక్కలు. పాఠశాల విద్య పూర్తికాగానే బిట్టూ తమ కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టారు. అటుపైన చేనేత నూలు చీరలు, సిల్కుచీరలు, సంప్రదాయ దుస్తులు విక్రయించే ఆ వ్యాపారాన్ని ఫ్లిప్‌కార్ట్‌లో 300కుపైగా వస్తువుల జాబితా స్థాయికి చేర్చారు. ప్రస్తుత ఉజ్వల దశకు ముందు విజయపథంలో ఆయన పయనం ఎంత సాదాసీదాగా మొదలైందో తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి!

India

భారతదేశం అంతటా విస్తరించిన చేనేత సమాజాలు, హస్త కళాకారులు తరతరాల వారసత్వాన్ని శతాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. తాతముత్తాతలు, తల్లిదండ్రుల నుంచి ఈ నైపుణ్యాన్ని పుణికి పుచ్చుకునే ప్రతిభావంతులైన ఈ వ్యక్తులు, వారి కుటుంబాలు జీవనోపాధి కోసం తమ హస్తకళా నైపుణ్యంపైనే ఆధారపడతారు. భారతదేశం విషయానికొస్తే- ఈ సంస్కృతి, వారసత్వం అనాదిగా సంరక్షించబడుతూ తర్వాతి తరానికి బదిలీ చేయబడుతోంది. భారతదేశంలోని హస్త కళాకారులు ఇలా నిరంతరం తమ బాధ్యతను నిర్వర్తించడమేగాక ఈ నైపుణ్యాన్ని గర్వకారణంగా పరిగణిస్తారు. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలోగల ఇటువంటి ప్రతిభావంతులైన కొద్దిమందిలో బిట్టూ దత్తా కూడా ఒకరు. చేనేత, మరమగ్గాలపై నూలు చీరల తయారీలో నిపుణుడైన ఆయన, నేడు తన కుటుంబ వ్యాపార పగ్గాలను చేపట్టబోయే తదుపరి తరం వ్యవస్థాపకుడు.

తండ్రి నుంచి 2013లో వ్యాపార బాధ్యతలు చేపట్టిన ఆయన, తన సామర్థ్యమేమిటో కొద్ది కాలంలోనే గుర్తించారు. అటుపైన అందివచ్చిన అవకాశాలను సత్వరం సద్వినియోగం చేసుకున్నారు. ఆ క్రమంలో తన ఎదుగుదల వేగం పుంజుకునే దిశగా ‘ఫ్లిప్‌కార్ట్ సమర్థ్’ కార్యక్రమంలో భాగస్వామిగా మారారు. తద్వారా ఇవాళ ఆన్‌లైన్‌లో దత్తా శారీ ఘర్ను ఏర్పరచుకున్నారు. బిట్టూ దత్తావంటి వ్యాపార యజమానులకు ‘సమర్థ్‌’ పేరిట ఫ్లిప్‌కార్ట్‌ 2019లో ప్రారంభించిన కార్యక్రమం వినూత్న మార్పు దిశగా అందివచ్చింది.

భారతదేశంలోని ఇలాంటి వ్యాపారాలు తమ కార్యకలాపాలను మరింత విస్తరించుకోవడానికి ఈ కార్యక్రమం ఒక అవకాశం కల్పించింది. హస్త కళాకారులు, నేత కార్మికులు తదితరులతో కూడిన స్థానిక శ్రామికశక్తికి సాధికారత కల్పించింది. దాంతోపాటు ఎలక్ట్రానిక్‌ వాణిజ్యాన్ని (ఇ-కామర్స్‌) గరిష్ఠంగా అందుకునే వెసులుబాటు ఇచ్చింది. ఈ కార్యక్రమం ఆరంభమయ్యాక నేటికి ఐదు రెట్లు పెరిగి, భారతదేశంలోని 1.5 మిలియన్ల కుటుంబాలపై ప్రభావం చూపుతోంది. సమర్థ్ భాగస్వాములను వినియోగదారుల ముందుంచే ‘క్రాఫ్టెడ్ బై భారత్’ ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బిట్టూ దత్తా మరో విస్తృత విక్రయ సీజన్‌కు స్వాగతం పలకడం కోసం సిద్ధమయ్యారు.

బిట్టూ తన కుటుంబ వ్యాపారంలో దూసుకుపోవడమగాక దాన్ని సమున్నత శిఖరాలకు చేర్చిన తీరు గురించి తెలియాలంటే ఇంకా చదవండి:

స్వేచ్ఛదిశగా ఒక వ్యక్తి ఎంచుకున్న మార్గం: వ్యాపార నిర్వహణ

వ్యాపార నిర్వహణంటే- విభిన్న వ్యక్తులకు వేర్వేరు విధాలుగా అనిపిస్తుంది. కానీ, బిట్టూ దత్తా విషయంలో మాత్రం అది ఎనలేని స్వేచ్ఛ. పాఠశాల చదువు ప్రారంభించిన నాటినుంచే వ్యాపార నిర్వహణ శక్తి ఎలాంటిదో ఆయన చక్కగా అర్థం చేసుకున్నారు. ఒక వ్యాపారవేత్తగా తనదైన వ్యాపారం నిర్వహించడాన్ని మించిన స్వేచ్ఛ మరొకటి లేదని ఆయనకు గట్టి నమ్మకం. తానెంచుకున్న మార్గంపైగల అదుపు, స్వీయ ప్రతిభతో ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కొనసాగిస్తున్న తీరు ఆయన నమ్మకంలోని ఔచిత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి.

చిన్నతనం నుంచీ తాను ఆకాంక్షించిన స్వేచ్ఛ కుటుంబ వ్యాపార నిర్వహణతో తనకు దక్కిందని ఇవాళ ఆయన గ్రహించారు. అయితే బిట్టూకి ఇది ఆరంభం మాత్రమే… 2013లో బాధ్యతలు చేపట్టిన నాటినుంచీ దీర్ఘకాలంలో మరింత వృద్ధి సాధించడమే ఇప్పుడు ఆయన లక్ష్యం. ఆ దిశగా ఇవాళ ఆయన 300కుపైగా వస్తువుల జాబితాతో ‘ఫ్లిప్‌కార్ట్ సమర్థ్’ భాగస్వామిగా కొనసాగుతున్నారు.

వినియోగదారులకు ఆయన అందించే ఉత్పత్తులు- హస్త నైపుణ్యంతో నేసిన సున్నితమైన నూలు-పట్టు చీరల నుంచి దేశవ్యాప్తంగా దుకాణదారుల డిమాండ్‌ తీర్చగల స్థాయిలో ఉత్పత్తి చేయబడిన ఇతర సంప్రదాయ దుస్తులదాకా విస్తృత శ్రేణిలో ఉంటాయి. బిట్టూ స్థానిక సమాజం నుంచి దాదాపు 25 మంది చేనేత కార్మికులను ఎంపిక చేసుకుని, అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు అందించగలిగేలా వారికి శిక్షణ ఇప్పించారు. అదే సమయంలో ఉత్తమ వ్యాపారవేత్తగానేగాక తన బృందానికి సమర్థంగా మార్గనిర్దేశం చేయగల నిపుణుడు కూడా కావడం ఆయన ప్రత్యేకత.

’సమర్థ్‌’తో భాగస్వామ్యం: జీవితాన్నే మార్చేసిన పయనం

బిట్టూ వంటి వ్యాపారవేత్తలు తమ కలలను సాకారం చేసుకోవడానికే కాకుండా చేతివృత్తులను సజీవంగా ఉంచుతూ హస్త కళాకారులకు వారు జీవనోపాధి కల్పించే విధంగా ఫ్లిప్‌కార్ట్ సమర్థ్ కార్యక్రమం ఆరంభం నుంచీ అవకాశమిచ్చింది. అలాగే సమర్థ్ కార్యక్రమం వ్యాపారవేత్తలకూ చేయూతనిస్తోంది. “ఫ్లిప్‌కార్ట్ వల్ల ఎలక్ట్రానిక్‌ వాణిజ్యం రంగంలో నా ప్రయాణం సాఫీగా సాగింది” అని బిట్టూ చిరునవ్వుతో చెప్పారు.
ఆన్‌లైన్‌లో వ్యాపారం ప్రారంభించినపుడు తాను కొంత ఆందోళన చెందానని బిట్టూ గుర్తుచేసుకున్నారు. అయితే, తన ఫ్లిప్‌కార్ట్ ఖాతా మేనేజర్లు, ఇతర సహాయక సిబ్బంది చేయూత లభించడంతో ఆందోళన కాస్తా ఆనందం, ఆత్మవిశ్వాసంగా మారిందని తెలిపారు. ఈ రోజున ఆయన ఫ్లిప్‌కార్ట్‌లో 300కుపైగా వస్తువులను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో తనకు అన్నివిధాలా మద్దతు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఫ్లిప్‌కార్ట్‌ తనకు సదా వెన్నుదన్నుగా నిలుస్తుందన్న విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ విశ్వాసమే రానున్న ‘క్రాఫ్టెడ్ బై భారత్’ విక్రయాల దిశగా ఆయనను ప్రోత్సహిస్తోంది. తదనుగుణంగా కొన్ని వారాలనుంచీ ఏర్పాట్లు చేసుకుంటూ తగు పరిమాణంలో వస్తు నిల్వలతో క్షణాల్లో రవాణాకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకు ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ సమయంలో ఎంత ఉత్సాహంతో ఉన్నానో ‘ఫ్లిప్‌కార్ట్ సమర్థ్’ కార్యక్రమ విక్రయాలకూ అంతే ఉత్సాహంతో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

బిట్టూ దత్తా వంటి వ్యాపారవేత్తలు కేవలం తమ విజయాలద్వారా మాత్రమేగాక భారతదేశంలో తమ సమాజంపైగల ప్రభావం నుంచీ స్ఫూర్తి పొందారు. నాడియాలోని కళాకారులకు బిట్టూ దత్తా నేడొక ఆశాకిరణం. ఎదుగుదలపై ఆయన అంకితభావం వారి జీవనోపాధికి భరోసా ఇస్తుండగా, ఫ్లిప్‌కార్ట్‌ అండతో అత్యత్తమ నాణ్యతకు ఆయన ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు.

భారతదేశంలోని మరిన్ని విజయగాథలు చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Enjoy shopping on Flipkart