వజ్రంలా ప్రకాశించండి: పాతికేళ్లుగా వ్యాపార రంగంలో ఉన్న ఫ్లిప్‌కార్ట్ విక్రేత కమలేష్ సెలాదియా విజయగాథ

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | ગુજરાતી | मराठी

కమలేష్ సెలాదియా వంటి ఫ్లిప్‌కార్ట్ విక్రేతలకు ‘ది బిగ్ బిలియన్ డేస్ సేల్’ వంటి కార్యక్రమాలు ఫ్లిప్‌కార్ట్‌లో ఇ-కామర్స్‌ను అత్యంత సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పిస్తాయి. అలాగే దేశంలోని ప్రతి మూలకూ అపరిమిత స్థాయిలో ఉత్పత్తులు చేరువవుతాయి. ఈ నేపథ్యంలో అతనెలా మొదలుపెట్టాడో... ఆన్‌లైన్‌ స్థాయికి తన వ్యాపారాన్ని ఎలా తీసుకెళ్లాడో... ఇవాళ అందులో విజయపథంలో ఎలా పయనిస్తున్నాడో ఇది చదివి తెలుసుకోండి.

Big Billion Days

నకు ముందున్న అనేకమంది తరహాలోనేకమలేష్‌ సెలాదియాఫ్లిప్‌కార్ట్‌లో తన అవకాశాన్ని కూడా చూసుకోగలిగాడు. అలాగే ఫ్లిప్‌కార్ట్, ‘ది బిగ్ బిలియన్ డేస్ సేల్’ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల సామర్థ్యాన్ని వాటిలో అవకాశాలనూ గ్రహించాడు. ఆఫ్‌లైన్ ఆభరణాల వ్యాపారంలోగల దాదాపు 25 ఏళ్ల అనుభవంతో కమలేష్ ఆన్‌లైన్ మార్కెట్‌ వేదికకు మారడం ఫ్లిప్‌కార్ట్‌తో సులువైంది.

ఫ్లిప్‌కార్ట్ కొన్నేళ్లుగా విక్రేత సమూహాలకు వారు నిర్వహించే పరిశ్రమతో నిమిత్తం లేకుండా సాధికారత కల్పన దిశగా చురుగ్గా కృషిచేసింది. ఫ్లిప్‌కార్ట్ విక్రేత కమలేష్ సెలాదియా, అతని ధరమ్ జ్యువెల్స్ వ్యాపార సంస్థకు ఈ వేదిక వృద్ధి గరిష్ట పరిధిని ఫ్లిప్‌కార్ట్‌ పెంచింది.

“కొత్తగా ఏదైనా ప్రారంభించడం సదా ఉత్తేజకరమే… అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అన్నింటికీ మించి మీ పనిని బట్టి మీకు ఫలితాలు సిద్ధిస్తాయి. నేను 2019లో తిరిగి ఫ్లిప్‌కార్ట్‌లో చేరిన క్షణంలోనే ఈ సత్యాన్ని గ్రహించాను. నా శ్రమకు, నైపుణ్యానికి అవకాశం కల్పించిన ఫ్లిప్‌కార్ట్ వేదికకు నా విజయాన్ని, నా ప్రగతి పయనాన్ని అంకితం చేస్తున్నాను.”

ఇవాళ ధరమ్ జ్యువెల్స్ ఆన్‌లైన్ మార్కెట్‌లో స్థిరంగా ముందడుగు వేసింది. వివిధ పిన్ కోడ్‌ల పరిధిలో ఖాతాదారులను ఆకర్షిస్తోంది. కమలేష్ ఇప్పటికే దక్షిణ భారతదేశంలో నమ్మకమైన ఖాతాదారు సమూహాన్ని సముపార్జించుకున్నాడు. ఆ మేరకు తన వ్యాపార ముద్ర విస్తరణకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘ది బిగ్ బిలియన్ డేస్-2022’ కలసివచ్చింది. దీంతో కొత్త లక్ష్యాలపై దృష్టి మళ్లించి, పండుగ వేళ తన వ్యాపారం పెంచుకోవడానికి ఎదురు చూస్తున్నాడు.

ఏ అవకాశాన్నీ వదల్లేదు

కమలేష్‌ సెలాదియా అనుకరణ నగల మార్కెట్లోకి రాకముందు అతను వజ్రాల పరిశ్రమలో పనిచేశాడు. ఆ తర్వాత నెక్లెస్‌ల నుంచి చైన్‌ల దాకా అందమైన ఉత్పత్తులు తయారుచేస్తూ అనుకరణ కళకు బాటలు వేసుకున్నాడు. తానెందుకిలా దారిమళ్లాననే అంశంపై ఇష్టంగా జ్ఞాపకాలను తలచుకుంటూ కమలేష్ ఇలా అన్నాడు. “ఇది వ్యాపారంతో నాకున్న అనుబంధం. ఇందులో చాలా అవకాశం ఉంది.. నేను వజ్రాల వ్యాపారినే కాకుండా వాణిజ్యం కూడా చేస్తుంటాను. ఈ పనిని సుమారు 25 ఏళ్లకిందట ప్రారంభించాను. అయితే, ఇదేమంత సులభసాధ్యం కాదు. అయినప్పటికీ తయారీ కార్యకలాపాలు కొనసాగించాను. నా పనిలో భాగంగా అమ్మకందారులతో, టోకు వ్యాపారాలతో లావాదేవీలు నిర్వహించేలా చేసింది. వారు నా ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు.”

ఈ సమయంలో కమలేష్ అనుభవ సంపదను సమీకరించుకుని, మార్కెట్ ధోరణులపై ప్రత్యక్ష అవగాహన పెంచుకున్నారు. నిజమైన అవకాశం ఇదేనని తెలుసుకుని, ఖాతాదారుతో నేరుగా లావాదేవీలు నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైందనే నిశ్చయానికి వచ్చాడు. కోవిడ్-19 మహమ్మారి బారినపడి వ్యాపారం మందగించిన నేపథ్యంలో ఆన్‌లైన్‌పై కమలేష్ నిర్ణయం సరైనదేనని స్పష్టమైంది.

“నాకు ఉత్పత్తుల అమ్మకందారులు ఆన్‌లైన్‌ విక్రయాలు చేస్తుంటే నేను మాత్రం ఎందుకు చేయలేను? అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. అందుకే నేను చిల్లర వ్యాపారంలో ప్రవేశించాలని నిశ్చయించుకుని, ధరమ్ జ్యువెల్స్‌ను ఆన్‌లైన్‌ చేయడానికి ఫ్లిప్‌కార్ట్‌ను వేదికగా ఎంచుకున్నాను. ఆ విధంగా 2019లో ఫ్లిప్‌కార్ట్‌తో చేయికలిపాను… ఫ్లిప్‌కార్ట్ పేరు అందరికీ తెలుసు కాబట్టి ఇది సరైన నిర్ణయమేనని నాతోపాటు మా పిల్లలు కూడా భావించారు.!”

ప్రణాళికల రూపకల్పన, వాటి అమలులో తోడ్పాటుకు తన సతీమణి ముందుకు రావడంతో ఇది సరైన నిర్ణయమేనని కమలేష్ సెలదియా గ్రహించాడు. అప్పటికే తయారీ సదుపాయం అతని చేతిలో ఉంది… అవకాశం అందివచ్చింది… ఇక ప్రారంభం మాత్రమే మిగిలింది. ఇందుకు కావాల్సిందల్లా ఫ్లిప్‌కార్ట్ నుంచి కొంత సాయం, కొందరు శ్రేయోభిలాషులు మద్దతు మాత్రమే.

అడుగడుగునా మద్దతివ్వండి

 

big billion days

కమలేష్, ఆయన సతీమణి నేడు ‘ధరమ్ జ్యువెల్స్’ ఆన్‌లైన్ కార్యకలాపాల నిర్వహణలో ప్రావీణ్యం సాధించినా వారికి ఆరంభ చేయూత అవసరమైంది. ఈ సమయంలో ఒక బంధువు ముందుకొచ్చి, ఫ్లిప్‌కార్ట్ ఖాతా ఏర్పరచుకోవడంలో ఆ దంపతులకు మార్గనిర్దేశంతోపాటు సాయం కూడా చేశారు. ఆ తర్వాత వ్యాపారం ఆరంభమైది. ఇదెంతో సజావుగా సాగిపోవడం ఒక మంచి అనుభవం.

“నా ఫ్లిప్‌కార్ట్ ఖాతా మేనేజర్ ప్రతి విషయంలోనూ నాకు చేయూతనివ్వడంతో వ్యాపారారంభం చాలా సులువైంది. నా సందేహాలన్నిటికీ వారివద్ద జవాబులు ఉండటమేగాక మార్పును సులభం చేయడంలో తోడ్పాటు లభించింది” అని కమలేష్ వెల్లడించారు.

అన్నీ సవ్యంగా కలసిరావడంతో కమలేష్ తన వ్యాపారాన్ని ఆన్‌లైన్‌కు తీసుకెళ్లాడు. కానీ, అక్కడ తాను అనుకున్న వేగం అందుకోకపోగా తొలి నెలల్లో అమ్మకాలు నెమ్మదిగానే సాగాయి. కొన్నిసార్లు రోజుకు ఒకేఒక ఆర్డర్‌ వచ్చిన సందర్భాలను గుర్తుచేసుకున్నాడు. అయితే, ఇవాళ రోజుకు దాదాపు 100-125 ఆర్డర్లు వస్తుండగా నెలవారీ ఆదాయం రూ.15 లక్షలకు దూసుకెళ్లింది.

“నేను తొలిసారి ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం ప్రారంభించినప్పుడు నా వద్ద కొన్ని ఉత్పత్తులుండేవి. కాలం గడిచేకొద్దీ మేం ఆ జాబితాకు మరికొన్నిటిని జోడించాం. దీంతో ఇవాళ మా ఉత్పత్తుల సంఖ్య 1,200 దాకా పెరిగింది. దీంతో సహజంగానే మా అమ్మకాలు కూడా బాగా పెరిగాయి! మనవంతు కృషి చేస్తే ఫలితాలు తప్పక లభిస్తాయని నేనెప్పుడూ చెబుతుంటాను. అయితే, నా శక్తిసామర్థ్యాల పరిధి మేరకు వ్యాపారాన్ని పెంచుకోవాలన్నది నా ప్రణాళిక. ఇందుకోసం ఎంత శ్రమించడానికైనా నేను సిద్ధం. ఫ్లిప్‌కార్ట్ మా తపనను అర్థం చేసుకుని మా విజయంలో అడుగడుగునా కీలక పాత్ర పోషించింది.”

ఇప్పుడు #స్వీయ ప్రతిభతో ఎదిగిన వ్యాపారవేత్త కమలేష్ ఆన్‌లైన్ చిల్లర వ్యాపార రంగంపై తన దృష్టి మళ్లించాడు. ఆయన సతీమణి వారి సంస్థ ఉత్పత్తుల బాధ్యతను చూసుకుంటున్న నేపథ్యంలో వారు సమష్టిగా శ్రమిస్తున్నారు. అంతేకాకుండా తమ ఉత్పత్తుల ఖాతాదారులను సంతృప్తి పరిచేలా ఉండేవిధంగా వారు అత్యంత శ్రద్ధ చూపుతారు.

‘ఫ్లాగ్‌షిప్’ కార్యక్రమంలో తన విక్రయాల్లో 40 శాతం పెరుగుదలను గమనించిన కమలేష్ ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ అమ్మకాల కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాడు. ఈ మేరకు తన లక్ష్యాలను చేరుకునే సీజన్ కోసం ఆశాభావంతో ఉన్నాడు. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఆన్‌లైన్‌ రంగంలో దూసుకుపోవాలని ఆకాంక్షిస్తున్న ఔత్సాహిక వ్యాపారులకుsellerకమలేష్ సెలాదియా ఒక స్ఫూర్తిదాయక విక్రేత.


ఇదీ చదవండి: మేక్‌ ఇన్‌ ఇండియా: ఫ్లిప్‌కార్ట్‌ విక్రేత ఆశిష్‌ కుక్రేజా వేగవంతమైన విజయగాథ!

Enjoy shopping on Flipkart