#OneInABillion: ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు, శిక్షకుడు, కిరాణా భాగస్వామి – నోవా రొజారియో అజేయుడు

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | ગુજરાતી | मराठी

నోవా ఆగస్టైన్ రొజారియో అనే వ్యక్తి చాలా ప్రతిభ కలిగిన వ్యక్తి. అతనొక స్టోర్ యజమాని, టైలర్, సెక్యూరిటీ సూపర్‌వైజర్, ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ మరియు శిక్షకుడు కూడా. నోవా ఒక్కడే ఇవన్నీ చేసేవాడు. కానీ అతని వరకు మాత్రం అతనేంటో, అతని పని ఎంత వరకు భిన్నమైనదో అని మాత్రమే లెక్క. అతను తన జీవితంలో ఇన్ని మైలురాళ్లను ఎలా అందుకున్నారో తెలియాలంటే ఈ ప్రేరణాత్మకమైన కథ చదవండి.

I అంగఛేదనం కారణంగా నా కాలు దాదాపు కోల్పోయా
నా 6 ఏళ్ల వయసులోనే ఫుట్‌బాల్ ఆడడం మొదలుపెట్టా. అది ఒక హాబీ అనే కంటే నా ప్యాషన్ అని చెప్పచ్చు. గతంలో నేను చాలా పోటీల్లో మన దేశం మరియు తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించాను. ప్రస్తుతం నేను ఒక ఫుట్‌బాల్ కోచ్‌ని. రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పోటీలకు రెండు జట్లకు శిక్షణ ఇస్తున్నాను.

అయితే ఈ కెరీర్‌లోకి నేను అడుగుపెట్టేందుకు చేసిన ప్రయాణం అంత సులువుగా ఏమీ జరగలేదు.
అండర్ – 16 విభాగంలో మంచి స్కోర్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ నన్ను సెలక్ట్ చేయలేదు. ఆ సమయంలో నన్ను మా నాన్న ఆటకు బదులుగా వేరే పని ఏమైనా చూసుకోమని అన్నారు. అలా అయితేనే నాకంటూ ఓ పని ఉండి; నన్ను నేను పోషించుకోగలనన్నది ఆయన భావన. అలా SSLC పూర్తి చేయగానే వెంటనే ఒక మెకానిక్‌గా పని చేయడం మొదలుపెట్టా. ఇతర ఉద్యోగాలు చేస్తున్న సమయంలోనూ ఓ వైపు నా స్నేహితులతో ఆడుతూ ఫుట్‌బాల్ కొనసాగిస్తూనే వచ్చా. ఆ తర్వాత నేను టైలరింగ్, ఫ్యాబ్రికేషన్ వర్క్, సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా కూడా పని చేశా. అనంతరం ఫుట్‌బాల్ క్రీడలోకి ప్రొఫెషనల్‌గా అడుగు పెట్టడం సాధ్యమైంది.
భారతదేశంలో ఆఫ్ సీజన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ప్రధాన లీగ్‌కు చెందిన టీమ్ కెప్టెన్ నన్ను గుర్తించారు. అప్పటికి నా వయసు 27 సంవత్సరాలు. ఆయన నన్ను తన టీంలో చేరమని అడిగినప్పటికీ నాకు ఉన్న జాబ్ కారణంగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నాది. అయితే జాబ్ చేస్తూనే ఆటలో రాణించేలా ఆయన నన్ను ప్రోత్సహించారు. ఈ విధంగా నేను నా జాబ్ మరియు ప్యాషన్ రెండిటినీ బ్యాలన్స్ చేస్తూ నైపుణ్యం పెంపొందించుకున్నా. నా కంటూ కొన్ని లక్ష్యాలు పెట్టుకుని వాటి గురించి చాలా పారదర్శకంగా నా టీం కెప్టెన్ మరియు నా పై ఉద్యోగితో చర్చించేవాడిని.
అలా ప్రొఫెషనల్‌గా ఫుట్‌బాల్ ఆడుతున్న సమయంలోనే నాకు ఒక ప్రమాదం జరిగింది. ప్రత్యర్థి జట్టులోని ఒక వ్యక్తి నా వైపుగా పరిగెత్తుకొచ్చి నా కాలిని గాయపరిచాడు. ఒకవేళ నేను సరైన చికిత్స తీసుకోకపోయి ఉంటే; ఆ తర్వాత పరిస్థితులు దారుణంగా మారిపోయేవి. కానీ అదృష్టవశాత్తు నా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా. అయితే కోచ్‌గా నా కెరీర్ మొదలుపెట్టక ముందు దీర్ఘకాలంపాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

Kirana Partnerఅప్పట్లో నేను బెంగళూర్‌లోని ఒక స్కూల్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద కోచ్‌గా పని చేస్తుండేవాడిని. లాక్‌డౌన్ పెట్టక ముందు వరకు అంతా బాగానే ఉంది. కానీ లాక్‌డౌన్ కారణంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ జీతాల్లో భారీ కోతను అనుభవించాల్సి వచ్చేది. ఫలితంగా మా ఖర్చులను మ్యానేజ్ చేసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే నేను నా ఫ్రెండ్ ఒకరితో మాట్లాడడం జరిగింది. అతను ఇక్కడే ఒక హబ్ దగ్గర ఫ్లిప్‌కార్ట్కిరాణా భాగస్వామిగా పని చేసేవారు. నాకు ఒక చిన్న స్టేషనరీ స్టోర్ ఉండేది. కాబట్టి ఆ ప్రొగ్రామ్‌కి నన్ను కూడా లిస్ట్‌లో చేర్చడం జరిగింది. ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ అంతా చాలా స్మూత్‌గా జరిగింది. అలా సులభంగా నేను ఒక సరైన మార్గంలోకి వచ్చేశా.
ఇప్పుడు స్కూల్స్ తిరిగి ప్రారంభం అయినా, నా కోచింగ్ సెషన్స్ మరింత బలపడుతున్నా కూడా నా కిరాణా పనిని నేను వెనకబడనీయాలని అనుకోవడం లేదు. ఎందుకంటే నాకు సహకారం అవసరం అయినప్పుడు ఫ్లిప్‌కార్ట్ నాకు తోడు నిలిచింది. అందుకే ఇప్పుడు నేను ఫ్లిప్‌కార్ట్‌కి తోడుగా నిలవాలని అనుకుంటున్నాను.
ప్రస్తుతం నా షెడ్యూల్ ఎలా ఉంటుందంటే; ఉదయాన్నే మా స్కూల్‌కి చెందిన ఒక టీంకి శిక్షణ ఇవ్వడంతో నా రోజు మొదలు అవుతుంది. ఇది 8.30 గంటలకు ముగుస్తుంది. అలా 9 అయ్యేసరికి నేను ఫ్లిప్‌కార్ట్ హబ్‌కి చేరుకుని ఆ రోజుకి వచ్చిన ఫ్యాకేజీలను కలెక్ట్ చేసుకుంటా. ఆ తర్వాత నేను నా స్టోర్‌కి చేరకుంటా. అప్పటికి సమయం దాదాపు 9.45 అవుతుంది. అనంతరం నేను ఆ ప్యాకేజెస్ అన్నింటినీ విభజించుకొని, డెలివరీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటా. వాస్తవికంగా నేను ఎన్ని డెలివరీలు ఇవ్వగలనో నాకు బాగా తెలుసు. నేనెప్పుడూ ఆ సంఖ్యనే అనుసరిస్తాను. అలా మధ్యాహ్నం 2.30 గంటల సమయం అయ్యే సరికి నా టార్గెట్స్ నేను పూర్తి చేసుకునేలా జాగ్రత్త పడతాను. అనంతరం సాయంత్రం కోచింగ్ సెషన్ నిమిత్తం స్కూల్‌కి వెళ్తాను.
నేను కిరాణా భాగస్వామిగా పని చేయడం మొదలుపెట్టిన్నప్పుడు నన్ను వెనక్కి లాగాలని నా కుటుంబంలోనే చాలామంది ప్రయత్నించారు. కానీ ఇప్పుడు వారిలో చాలామంది దీనికి అప్లై చేసేందుకు మార్గాల కోసం నన్ను అడుగుతూ ఉంటారు.
నేను నా కుటుంబంతో బెంగళూరులో నివసిస్తుంటాను. నా భార్య ఒక ఐటీ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పని చేస్తుంది. తనకు వీలైనప్పుడల్లా ఆమె కూడా నా స్టోర్‌తో నాకు సహాయం చేస్తూ ఉంటుంది. నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దమ్మాయి UAEలో పని చేస్తుంది. చిన్నమ్మాయి స్కూల్లో చదువుకుంటోంది. నా పెద్దకూతురు రాష్ట్ర స్థాయి త్రోబాల్ ప్లేయర్ కూడా. నా చిన్న కూతురు కూడా. కాకపోతే తను కాస్త ఫుడీ!
మా ప్రాంతంలోనే నేను డెలివర్ చేస్తూ ఉంటాను. కాబట్టి నా వినియోగదారులు చాలా వరకు నాకు పరిచయస్తులే. కొన్ని సంవత్సరాలుగా వారు నాకు తెలుసు. నేను డెలివరీస్ చేసేందుకు ఇది నాకు బాగా తోడ్పడింది. అయితే కొన్ని సందర్భాల్లో వినియోగదారులు వారి వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో ఉండలేకపోవచ్చు. అటువంటప్పుడు నా వర్క్ ఫ్లో అనేది కాస్త ప్రభావితం అవుతుంది. కానీ ఇలా పెండింగ్ ఉండిపోయే డెలివరీలను కూడా నేను మేనేజ్ చేసుకుంటూ జాగ్రత్త పడతాను.
ది బిగ్ బిలియన్ డేస్ సేల్ చాలా అద్భుతం అని చెప్పాలి. నేను చేయగలిగినన్ని ప్యాకేజెస్ ఈ సమయంలో డెలివర్ చేశాను. మా హబ్ వద్ద ప్రతి ఒక్కరూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మాకు చాలా చక్కని శిక్షణ ఇవ్వడమే కాదు.. ఇలాంటి సమయాల్లో మాతోపాటు కొత్తగా విధుల్లోకి చేరినవారు కూడా ఉంటారు. ఇక్కడ పని వాతావరణం ఎలా ఉంటుందంటే మా సొంత అనుభవాల నుంచి మేం నేర్చుకున్నవాటిని మా జూనియర్లతో మేం పంచుకుంటాం. తద్వారా వారు కూడా వీటి గురించి తెలుసుకొని తగిన జాగ్రత్తలతో సాధ్యమైనంత మేరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా తమ పని చేసుకునే అవకాశం ఉంటుంది.
నా వరకు వస్తే నేను చేస్తున్న ఉద్యోగాల పేర్లు కంటే; ఈ క్షణం నేను ఎవరు? నా జీవితానికి నేను చేసే పని ఎలాంటి విలువని యాడ్ చేస్తుంది?? అనేదే నాకు ముఖ్యం. అందుకే ప్రస్తుతం కోచ్‌గా, కిరాణా పార్ట్‌నర్‌గా రెండు ప్రొఫెషన్స్‌లోనూ నేను రాణిస్తున్నాను. ఇప్పుడు ఉన్న స్థాయిలో నన్ను తీర్చిదిద్దినవి అవే అని నేను భావిస్తాను. వాటికి నేను రుణపడి ఉంటా కూడా.


ఇదీ చదవండి; #OneInABillion: చిరకాల కలలకు ఫ్లిప్‌కార్ట్‌తో పునరుజ్జీవం పోస్తున్న రంజన్‌కుమార్.

Enjoy shopping on Flipkart