2030 నాటికి 100% ఎలక్ట్రిక్ మొబిలిటీ —EV100తో సుస్థిరత వైపు నడుస్తున్న ఫ్లిప్‌కార్ట్

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | ગુજરાતી | मराठी

క్లైమేట్ గ్రూప్ యొక్క గ్లోబల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇనిషియేటివ్ EV100లో మెంబర్‌గా, ఫ్లిప్‌కార్ట్ తన 100% చివరి-మైల్ డెలివరీ ఫ్లీట్‌ వరకు 2030 నాటికి ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మార్చడానికి కట్టుబడి ఉంది. 2030 కల్లా భారతదేశంలో 1400+ లాస్ట్-మైల్ హబ్‌లకు సమీపంలో స్టాఫ్ ఛార్జింగ్‌ను ఇన్‌స్టాల్ చేసేలా సర్వీస్ ప్రొవైడర్లను ప్రభావితం చేయడమే ఎలక్ట్రిక్ మొబిలటీ లక్ష్యం. 2019లో భారతీయ నగరాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌ల వలె ప్రారంభమైన ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ డ్రైవ్ ఇప్పుడు భారతదేశానికి ఒక ప్రధాన సుస్థిరమైన చొరవ మరియు మార్గదర్శకమైన అడుగు అని చెప్పచ్చు. స్థిరమైన, సమానమైన మరియు సమ్మిళిత ఇ-కామర్స్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో మా నిబద్ధతలో మేము ఎంత దూరం వచ్చామో తెలుసుకోవడానికి మరింత చదవండి.

Flipkart Electric Mobility EV 100

2020లో అంటే తన చివరి మైలు కార్యకలాపాలలో ఎలక్ట్రిక్ వాహనాల సముదాయాన్ని విస్తరిస్తామని చెప్పిన ఒక సంవత్సరం తర్వాత ఫ్లిప్‌కార్ట్ 2030 నాటికి దాని లాజిస్టిక్ ప్లీట్‌లో 100% ఎలక్ట్రిక్ వాహనాలకు మారుస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగానే తన ఇ-కామర్స్ వాల్యూ చెయిన్ అంతటా దీర్ఘకాలిక స్థిరత్వానికి నిబద్ధతతో వ్యవహరిస్తుంది. ఈ నిర్ణయం ఫ్లిప్‌కార్ట్‌ను భారతదేశంలో డెలివరీల కోసం ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఇ-కామర్స్ సంస్థగా మార్చింది. భారతదేశంలో క్లైమేట్ గ్రూప్ యొక్క EV100 చొరవలో చేరిన మొదటి ఇ-కామర్స్ మార్కెట్‌ప్లేస్‌గా నిలిచింది. EV100, ది క్లైమేట్ గ్రూప్ ద్వారా గ్లోబల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇనిషియేటివ్, ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) పరివర్తనను వేగవంతం చేయడానికి కట్టుబడి ఉంటూ; 2030 నాటికి ఎలక్ట్రిక్ మొబిలిటీని యథాతథ స్థితికి తీసుకురావడానికి ఎదురుచూస్తున్న సంస్థలను ఒకచోట చేర్చింది.


కథ నచ్చిందా? అయితే దానికి సంబంధించిన పాడ్‌క్యాస్ట్‌ ఇక్కడ వినండి;


భూమి పై దీర్ఘకాలిక స్థిరత్వం కోసం ఈ నిబద్ధతను అమలు చేయడానికి, ఫ్లిప్‌కార్ట్ తన ఫ్లీట్‌లో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాల ఏకీకరణను కొనసాగిస్తోంది. ప్రతి 1400+ లాస్ట్-మైల్ హబ్‌ల వద్ద సిబ్బంది ఛార్జింగ్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి సర్వీస్ ప్రొవైడర్లను ప్రభావితం చేయడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మరియు డెలివరీని ప్రోత్సహించడం, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ఎలక్ట్రిక్ వాహనాలను ఒక ఆచరణీయ మొబిలిటీ పరిష్కారంగా ఉపయోగించేలా చేయడం.. వంటివి చేయనుంది.
ఇలా అనుకున్న రెండు సంవత్సరాలలోనే ఫ్లిప్‌కార్ట్ 100% ఎలక్ట్రిక్ వాహనాలకు (భారతదేశం యొక్క ధ్యేయమైన 2030 ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యం) పరివర్తన చెందాలనే లక్ష్యంలో దాదాపు గమ్యస్థానానికి చేరువలోకి వచ్చింది. 2022 నాటికి ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఫ్లీట్‌లో 3600+ ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. 2021తో పోల్చి చూస్తే 40% పెరుగుదల నమోదైంది. ఇది ఇంకా పెరుగుతూనే ఉంది కూడా.

ఈ రోజు ఫ్లిప్‌కార్ట్ అవుట్సోర్స్ చేసే డెలివరీ హబ్స్ కూడా దాదాపు 85% ఎలక్ట్రిక్ వాహనాలతోనే పని చేస్తున్నాయి. మా గ్రోసరీ సప్లై చెయిన్ కూడా సుమారు 1000 ఎలక్ట్రిక్ వాహనాలు కలిగి ఉంది. వాటిని ఉపయోగిస్తూనే దేశవ్యాప్తంగా మా వినియోగదారులకు సంతోషాలను స్థిరంగా డెలివర్ చేస్తున్నాం. 2022లో పండగల సమయంలో 1 లక్ష మంది వినియోగదారుల ఆర్డర్స్‌లో 2000 వరకు ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహనాలను దేశవ్యాప్తంగా డెలివర్ చేశాం. డెలివరీ రేటు అంతర్గత దహన యంత్రం (ICE) వాహనాలతో సమానంగా ఉన్నందున ఇది చిన్న ఫీట్ కాదు. దేశవ్యాప్తంగా ఉన్న ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ మరియు దాని వ్యవస్థ అంతా ఈ పురోగతిని నిర్మించడానికి మరియు స్థిరమైన, సమానమైన మరియు సమ్మిళిత ఇ-కామర్స్ పర్యావరణ వ్యవస్థను నిర్ధారించడానికి కట్టుబడి ఉంది.

మేము ఇప్పటివరకు సాధించిన పురోగతిని ఇక్కడ చూడండి:

electric mobility

ఫ్లిప్ కార్ట్ భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ ట్రెండ్ సెట్టర్

.

2018లో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ ఎలక్ట్రిక్ వాహనాలకు పరివర్తన చెందే ప్రక్రియను మొదలుపెట్టింది. ఫ్లీట్ లాజిస్టిక్స్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు విస్తృతమైన డిమాండ్‌ సృష్టించడంలో కీలకపాత్ర పోషించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని ముందుగా స్వీకరించిన సంస్థగా, ఈ ప్రయాణాన్ని ప్రారంభించిన పరిశ్రమలలో ఫ్లిప్‌కార్ట్ మొదటిది. eBikes‌తో ప్రారంభించి, 2019లో eVans తర్వాత, EV పైలట్ ప్రోగ్రామ్‌ల సమయంలో అద్భుతమైన పనితీరు ఫలితాలను సాధించింది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్ మరియు భువనేశ్వర్‌లలో EVలను విస్తరించింది. అలాగే పూణే, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా మరియు లక్నోలలో EV పైలట్‌లను విస్తరింపజేస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ఎంచుకున్న హబ్‌లలో EVలను పెద్ద ఎత్తున అమలు చేయడానికి మరియు ఎలాంటి అవాంతరాలు లేకుండా తన కార్యకలాపాలను నిర్వర్తించడానికి అవసరమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను సైతం ఏర్పాటు చేసింది.

‘‘ఒక స్వదేశీ సంస్థగా ఈ-కామర్స్‌ని కలుపుకుంటూ మా వాటాదారులందరినీ ప్రగతిశీలంగా, ప్రభావవంతంగా చేస్తున్నందుకు మేం ఎప్పుడూ గర్విస్తాం. ఇందులో కమ్యూనిటీలు మరియు ఈ గ్రహం కూడా భాగమే’’ అంటారు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి. క్లైమేట్ గ్రూప్ యొక్క EV100 ఇనీషియేటివ్ పట్ల మా నిబద్ధత పర్యావరణ స్థిరత్వం అనేవి ఈ పెద్ద దృష్టితోనే ముడిపడి ఉన్నాయి. అలాగే EV100 పర్యావరణ వ్యవస్థలో భాగంగా అత్యంత ముందుకు-ఆలోచించే ప్రపంచ దృక్కోణాల నుండి నేర్చుకునేందుకు మమ్మల్ని మేము ఎప్పుడూ సంసిద్ధంగా ఉంచుకుంటాం. మా స్కేల్ మరియు రీచ్‌తో, ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగంగా ట్రాక్ చేయడమే కాకుండా పర్యావరణ వ్యవస్థలోని కీలక వాటాదారులతో కలిసి పని చేయడం ద్వారా క్లీన్ మొబిలిటీని మెయిన్ స్ట్రీమ్‌గా మార్చడంలో కూడా మేము ముఖ్యమైన పాత్ర పోషిస్తామని నమ్ముతున్నాము.

 

లాజిస్టిక్స్ ఫ్లీట్ యొక్క విద్యుదీకరణ అనేది ఫ్లిప్‌కార్ట్‌లోని అత్యంత సుస్థిరత లక్ష్యంలో కీలక భాగం. అలాగే EV100 నిబద్ధత ప్రకారం లాజిస్టిక్స్ ఫ్లీట్‌ను నిర్మించే ప్రయత్నాలకు అనుగుణంగా, పర్యావరణసహితంగా ఉంటుంది.
“భారతదేశం యొక్క ఆశయంలో కీలక పాత్ర పోషించే ఇ-కామర్స్ రంగం మరింత స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఒక స్థిరమైన, ఇన్‌క్లూజివ్ మరియు సమానమైన పర్యావరణ వ్యవస్థ వైపు మళ్ళించటానికి ప్రత్యేకమైన స్థానంలో ఉంది” అని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి రజనీష్ కుమార్ అన్నారు. “లాస్ట్ మైల్ డెలివరీల కోసం ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం, చివరికి మొదటి మరియు మధ్య మైలు కూడా ఆ దిశలోనే అగుడులు వేయడం జరుగుతుంది. భారతదేశంలో EV పరివర్తనకు మేము నాయకత్వం వహిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిఒక్కరికీ భాగస్వామ్య విలువను సృష్టించడానికి EV పర్యావరణ వ్యవస్థలోని అందరు వాటాదారులను కలిసి వారందరినీ ఒకే తాటిపైకి తీసుకురాగలిగాం.”
ఛార్జింగ్ ప్రొవైడర్స్, రెగ్యులేటర్స్, పాలసీ తయారీదారులు, నైపుణ్య అభివృద్ధి ఏజెన్సీలు, అగ్రిగేటర్స్ మరియు OEMలు వంటి వివిధ విభాగాల్లో పని చేసేందుకు గత రెండేళ్లుగా విస్తృతమైన నెట్వర్క్ సృష్టించుకుంటూ ఫ్లిప్‌కార్ట్ పని చేస్తోంది. EVల డిజైనింగ్ మరియు తయారీ కూడా ఇందులో భాగమే. ప్రధానమైన మొబిలిటీ సొల్యూషన్‌గా ఉద్భవించడానికి EVల కోసం మార్కెట్ డిమాండ్‌కు మద్దతునిస్తూ ఇ-కామర్స్ కోసం ఆప్టిమైజ్ చేయబడింది.

క్లైమేట్ గ్రూప్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, దివ్యా శర్మ మాట్లాడుతూ- “ఫ్లిప్‌కార్ట్ EV100కి సైన్ అప్ చేయడం మరియు భారతదేశంలో ఇ-కామర్స్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలను దత్తత తీసుకోవడానికి ముందుకు రావడం పట్ల క్లైమేట్ గ్రూప్ చాలా థ్రిల్‌గా ఉంది. సాంకేతికతలో ఆవిష్కరణలను పెంపొందించడంలో మరియు మా గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ కమిటెడ్ బిజినెస్‌లలో ఇ-మొబిలిటీపై జ్ఞానాన్ని మార్పిడి చేయడంలో ఫ్లిప్‌కార్ట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వేగవంతమైన ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడటానికి మరియు దీర్ఘకాలికంగా గాలి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడటానికి, మరిన్ని భారతీయ కంపెనీలు దీనిని అనుసరించాలని మేము కోరుతున్నాము, EVల యొక్క వేగవంతమైన రోల్-అవుట్‌ను చూడాలనుకునే విధాన రూపకర్తలకు శక్తివంతమైన మద్దతు సంకేతాలను మేమెప్పుడూ పంపుతాము.

ఫ్లిప్‌కార్ట్ యొక్క ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణం

ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో ఫ్లిప్‌కార్ట్ యొక్క మార్గదర్శక ప్రయత్నాలు భారతీయ నగరాల్లో పైలట్‌లతో ప్రారంభమయ్యాయి. మొదట ఈబైక్‌లతో మరియు తరువాత ఎలక్ట్రిక్ వ్యాన్‌లు లేదా ఇవాన్‌లతో ఇవి మొదలయ్యాయి. ప్రారంభంలో ముంబయిలో మూడు నెలల పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన తరువాత, ఫ్లిప్‌కార్ట్ యొక్క eBike ప్రయోగం సాధించిన విజయం, చొరవ, అలాగే అది పర్యావరణం పై చూపే ప్రభావాన్ని వెలుగులోకి తెచ్చింది. జూన్ 2019లో, ఎలక్ట్రిక్ మొబిలిటీ చొరవ ఢిల్లీ మరియు హైదరాబాద్‌కు విస్తరించబడింది. 2020లో, ఫ్లిప్‌కార్ట్ ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, భువనేశ్వర్, పూణె, ముంబయి, బెంగుళూరు, కోల్‌కతా మరియు లక్నో నగరాలకు తన కార్యకలాపాలను విస్తరించింది.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన EV100 ఇనీషియేటివ్‌లో చేరిన భారతదేశంలో మొట్టమొదటి ఇ-కామర్స్ ప్లేయర్‌గా, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకోవడానికి కార్పొరేట్ నాయకత్వాన్ని ఉత్ప్రేరకపరిచే EV100 యొక్క లక్ష్యానికి ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకంగా నిలిచింది.
ఫ్లిప్‌కార్ట్ తన వ్యాపారం మరియు విలువ గొలుసు అంతటా స్థిరమైన అభ్యాసాలను పెంపొందించడంపై దృష్టి సారించింది. స్థిరమైన వృద్ధిని దృష్టిలో ఉంచుకుని అనేక కార్యక్రమాలను నడుపుతోంది. ఫ్లిప్‌కార్ట్ దాని సరఫరా గొలుసులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను తగ్గించడానికి కట్టుబడి ఉంది. అలాగే ఇప్పటికే ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వినియోగంలో 51% తగ్గింపును సాధించింది. ఫ్లిప్‌కార్ట్ అనేది పరిశ్రమలో మొదటి EPR అధికారాన్ని కలిగి ఉన్న ఏకైక ఇ-కామర్స్ సంస్థ. ఇక్కడ మేము ఉపయోగించే ప్యాకేజింగ్ మొత్తం బరువును తిరిగి సేకరించే నిబంధనకు మేం ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నాము.
ఫ్లిప్‌కార్ట్ తన విద్యుత్ అవసరాల కోసం పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడం ద్వారా మరియు మొత్తం శక్తి ఉత్పాదకతను పెంచడానికి పలు ప్రాజెక్ట్‌లను ప్రవేశపెట్టడం ద్వారా దాని కార్యకలాపాలలో వనరుల సామర్థ్యంపై దృష్టి సారించింది. అలాగే దాని గిడ్డంగులలో మురుగునీటిని బయటకు కూడా అస్సలు విడుదల చేయదు. అందుకే దీని వ్యూహాత్మక సౌకర్యాలు ISO 14001 ధృవీకరణను పొందాయి. కార్యాలయంలో పర్యావరణ కాలుష్యాన్ని నిరోధించడానికి గల సంసిద్ధతకు ఇది కీలకమైన ప్రమాణం. హైదరాబాద్‌లోని ఫ్లిప్‌కార్ట్ డేటా సెంటర్ ఎక్కువగా పునరుత్పాదక శక్తిపై నడుస్తుంది మరియు IGBC యొక్క గ్రీన్ బిల్డింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా దాని యొక్క అనేక పెద్ద గిడ్డంగుల ప్రాజెక్టులు నిర్మించబడుతున్నాయి.


అలాగే ఇదీ చదవండి

ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రిక్ వాహనాలను చాలా వేగవంతంగా పైలట్ చేస్తుంది

ఫ్లిప్‌కార్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను తొలగించే విధానాలపై దృష్టి సారిస్తుంది

Enjoy shopping on Flipkart