భారతీయ వాయుసేన ఉద్యోగి ఇక్రముల్లా ఖాన్‌కు- వ్యాపారవేత్త కావాలన్న ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి ఉద్యోగ విరమణ సరైన అవకాశం లభించింది. ఆ మేరకు వ్యాపారవేత్త కావాలన్న తన స్వప్నానికి ఫ్లిప్‌కార్ట్ విక్రేతగా రెక్కలు తొడిగి, అడ్డువచ్చిన సవాళ్లను ఎలా అధిగమించాడో ఇక్కడ చూడండి.
ఉద్యోగం నుంచి రిటైరయ్యాక భారత వాయుసేన ఉద్యోగి ఇక్రముల్లా ఖాన్ రెండో ఇన్నింగ్స్ మొదలైంది. ఢిల్లీ నగరంలోని ఓఖ్లా వాస్తవ్యుడైన ఆయన, దేశమాత సేవలో 20 ఏళ్లు పూర్తిచేసుకున్న తర్వాత సార్జంట్‌గా రిటైరయ్యారు. తన తదుపరి గమ్యం వ్యాపారవేత్త కావడమేనని ఆయనకు తెలుసు.
రిటైర్మెంట్ తర్వాత ఇక్రముల్లా కొన్నేళ్లపాటు ప్రైవేటు కంపెనీల్లో పనిచేశాడు. అయినప్పటికీ, వ్యాపారవేత్త కావాలన్నదే ఆయన అంతిమ లక్ష్యం. ఆ దిశగా ప్రయత్నాల్లో భాగంగా రెస్టారెంట్‌సహా ఓ చిన్న చిల్లర వ్యాపారం చేసినా ఆశించిన మేర కాలం కలసి రాలేదు. అయినా, ఆయన కుంగిపోలేదు… తన కల సాకారం చేసుకోవడానికి తనవంతు శ్రమించాడు.
ఆయన కథ చదవండి: ఆకాశమే హద్దుగా కలలు
చివరకు ఇ-కామర్స్ విజయాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచనతో 2019లో ఇక్రముల్లా తన పేరిట ఓ కంపెనీని నమోదు చేశాక ఆయన కృషి ఫ్లిప్‌కార్ట్‌ద్వారా ఫలించింది. “భారతదేశమంతటా నా ఉత్పత్తులు విక్రయించే వేదికను నేను కనుగొన్నాను” అని ఆయన అన్నారు. ఆ విధంగా ఆయన 2021లో తన క్రీడా దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించారు.
అటుపైన తన క్రీడా దుస్తుల తయారీ కోసం ముందుగా ఆయన ఢిల్లీలోని స్థానిక మార్కెట్లను సందర్శించాడు. అయితే, తన ఆకాంక్ష మేరకు వ్యాపారం వృద్ధి చెందాలంటే- ఉత్పత్తుల శ్రేణిని పెంచడంతోపాటు సొంత తయారీ యూనిట్ ఒక్కటే మార్గమని నిశ్చయించుకున్నాడు.
““ఇది ఎలాంటి వయోపరిమితి లేని వేదిక.. మీకు కావలసిందల్లా అభిరుచి, అంకితభావం, ఏదైనా సాధించాలనే తపన. ఫ్లిప్‌కార్ట్‌లో స్వల్ప పెట్టుబడితో మీరు వ్యాపారం ప్రారంభించవచ్చు కనుక పెట్టుబడి కూడా అడ్డంకి కాబోదు” అని ఇక్రాముల్లా అంటారు.
ఫ్లిప్‌కార్ట్‌లో తన ఖాతా నిర్వాహకుల తోడ్పాటుతో మార్కెట్ ధోరణులు, విక్రయాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తన విజయానికి ఆకాశమే హద్దని ఆత్మవిశ్వాసంగల ఈ విశ్రాంత ఉద్యోగి గ్రహించారు. “వాయుసేనలో అనుభవం నా వ్యాపార నిర్వహణ, పురోగమనంలో నాకెంతో ఉపయోగపడింది” అని ఆయన చెప్పారు. మొత్తంమీద ఏకసైనిక శక్తిలా తన ఉత్పత్తుల జాబితాలు, ఆర్డర్లు, సరకులు, ప్యాకేజింగ్, బట్వాడా వగైరాలన్నింటినీ ఒంటిచేత్తో స్వయంగా నిర్వహిస్తాడు.
“రిటైర్మెంట్ తర్వాత నేను చాలా రకాల పనులు చేశాను. ఒక వ్యవస్థాపకుడు, వ్యాపారవేత్త కావాలనే నా కల ఫ్లిప్‌కార్ట్‌తో మాత్రమే నెరవేరింది” అని తన కలల విజయాన్ని అనుక్షణం ఆస్వాదిస్తున్న ఈ #సెల్ఫ్‌మేడ్ ఫ్లిప్‌కార్ట్ విక్రేత చెప్పారు.
ఇలాంటి #మేడ్ ఇన్ ఇండియా విజయగాథలు చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండిhere