సాంకేతికత, గేమిఫికేషన్ మరియు వినూత్నత అనేవి ఉపయోగించి ఒక కొత్త ఆలోచనకు అంకురార్పణ చేయచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్, దాని NGO భాగస్వాములు, ఫ్లిప్‌కార్ట్ బృందం మరియు వినియోగదారులు అంతా కలిసి ఉత్తరాఖండ్‌లోని ఛమోలి జిల్లాలో జ్ఞానోత్పాదకమైన రేపటి కోసం సహాయపడుతున్నారు. ఫ్లిప్‌కార్ట్ సెలబ్రేషన్ ట్రీ – ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోని ఒక గేమ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో మళ్లీ చెట్లను పెంచడం ద్వారా పునరావాసాలకు ఎలా తోడ్పడుతుందో ఇది చదివి తెలుసుకోండి.
వావాతావరణ మార్పుల ఉపశమనానికి మరియు సరైన పద్ధతుల అనుసరణకు తిరిగి చెట్లను పెంచాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఈ ఆలోచనే ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల్లో కోటలకు ప్రసిద్ధిగాంచిన ఛమోలీ అనే జిల్లాలో ఒక వినూత్నమైన అడుగుకు శ్రీకారం చుట్టేలా చేసింది. దానికి అక్కడి ప్రజల నుంచి వచ్చిన స్పందన కూడా అద్భుతం. అది చూపించే ప్రభావం గురించి తెలుసుకున్న ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్ రెండు NGOలు, గివ్, సంకల్ప్ తరు ఫౌండేషన్‌లతో కలిసి ఎల్లలు లేకుండా ఆలోచించి, చక్కని ఆటకు శ్రీకారం చుట్టింది ఫ్లిప్‌కార్ట్ గేమ్స్ టీమ్.
‘‘ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్ ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో ఒక సీడ్ బాంబింగ్ ప్రాజెక్ట్‌కు సపోర్ట్ చేసేందుకు ముందుకు వచ్చింది. పర్వత ప్రాంతాన్ని తిరిగి పచ్చగా మార్చడమే కాదు.. చుట్టుపక్కల ఉన్న 63 గ్రామాల్లోని 27,000 మంది ప్రజలపై చక్కని ప్రభావం చూపడం కూడా ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అని చెప్పచ్చు’’ అన్నారు ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్, డైరెక్టర్, పూజా త్రిశూల్.
కథను బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అయితే దీంతోపాటు కింద ఉన్న పాడ్‌క్యాస్ట్ కూడా వినండి;
సీడ్‌బాల్ బాంబింగ్ ప్రాజెక్ట్ ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు మార్పు సాధ్యమని చేతల్లో చూపించింది. వాతావరణ మార్పుల అనుసరణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అక్కడున్న కమ్యూనిటీలకు సాధికారత సైతం కల్పించడం ద్వారా జ్నానోత్పాదకమైన భవిష్యత్తుని అందించింది. సాంకేతిక వినూత్నత మరియు వాతావరణంలో మార్పు తీసుకురావాలన్న ఫ్లిప్‌కార్ట్ సంకల్పంతో ఇదంతా ఒకే అడుగుతో సాధ్యమైంది.
ఊహ నుంచి వాస్తవానికి..
గత కొన్ని దశాబ్దాలుగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న భయంకరమైన పర్యావరణ మార్పుల ప్రభావం చమోలీ యొక్క కొండ ప్రాంతం పై బాగా కనిపిస్తోంది. వేగవంతమైన అటవీ నిర్మూలన కారణంగా కొండ చరియలు విరిగిపడడం వల్ల జిల్లాలోని పలు గ్రామాలను ప్రభావితం చేశాయి. దీని కారణంగా అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అలాగే వారి జీవనోపాధి సైతం ప్రభావితమైంది.
ఫ్లిప్‌కార్ట్ పాటించే స్థిరమైన చర్యలు, వినూత్నత మరియు ఇచ్చే సంస్కృతి ద్వారా అతి తక్కువ సమయంలోనే ఈ నష్టాన్ని ఒక మిషన్ సహాయంతో రివర్స్ చేయగలిగింది. దృఢమైన లక్ష్యం, మూడు ఇంటర్నల్ టీంలకు చెందిన స్పెషలిస్ట్స్ సహాయంతో ఈ పని జరిగేలా చేసింది.
ఫ్లిప్‌కార్ట్ సెలబ్రేషన్ ట్రీ – ఒక గేమ్ ఆధారిత, ఆధునిక పరిష్కారం ద్వారా స్థిరమైన మార్పు అనే విత్తనాలను నాటడం సాధ్యమైంది. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఇంటరాక్టివ్ గేమ్ అయిన దీనిని ఆడడం ద్వారా వినియోగదారులు వర్చువల్‌గా చెట్లను పెంచవచ్చు. అలా వర్చువల్‌గా పెంచే ప్రతి చెట్టుకు బదులుగా వాస్తవ ప్రపంచంలో ఫ్లిప్‌కార్ట్ ఒక మొక్కను నాటుతుంది. ఇలా ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులు సైతం ఈ గొప్ప ఉద్యమంలో పాల్గనే అవకాశం పొందారు. ఇది భూమి మీద కొన్ని వేలమంది జీవితాలను ప్రభావితం చేసింది.
స్పెషలిస్ట్‌లలో ఒకరు మరియు ఫ్లిప్‌కార్ట్ కొత్త ఇనీషియేటివ్స్ డైరెక్టర్ అయిన అర్పిత కపూర్ – ‘‘గేమర్స్ ఆట ఆడడం ద్వారా ఈ మిషన్‌తో అనుబంధం కలిగి ఉండడం చాలా ముఖ్యం’’ అంటారు.
ఒక చెట్టును పూర్తిగా ఇలా పెంచడానికి 21 రోజులు సమయం వెచ్చించిన వారికి ఇచ్చే బహుమతులు గొప్ప అర్థాన్ని కలిగి ఉండాలని మేము కోరుకున్నాం. అందుకే సాధారణ రివార్డ్స్ వంటి iPhone లేదా TV లాంటివి ఇవ్వలేదు. సరిగ్గా అదే సమయంలో వారి వంతుగా వాస్తవ జీవితంలోనూ ఓ మొక్క నాటాలనే ఆలోచన మాకు వచ్చింది. సాధారణ రివార్డ్‌లు లేదా డిస్కౌంట్‌లు చేయవు. నిజ జీవితంలో ఒక చెట్టును నాటాలనే ఈ ఆలోచన మాకు ఎలా వచ్చింది రోజులు ఆట ఆడినందుకు ఇది ఎంత చక్కని బహుమతో కదూ’’ అంటారు అర్పిత. ఈ 21 రోజుల ఉద్యమంలో సెలబ్రేషన్ ట్రీ దాదాపు 3 మిలియన్ల మంది గేమర్స్‌ని ఎంగేజ్ చేసింది.
ఏ పర్వతమూ మరీ ఎత్తు కాదు
‘‘మా వ్యాపార పద్ధతులన్నింటిలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ కృషి చేస్తోంది మరియు 2040 నాటికి నెట్ జీరో వాతావరణ మార్పు ప్రభావం శూన్యం చేయాలనే లక్ష్యంతో తనకంటూ కొన్ని కమిట్‌మెంట్స్ పెట్టుకుంది’’ అంటారు ఫ్లిప్‌కార్ట్ స్థిరత్వ డైరెక్టర్ ధరశ్రీ పాండా. ‘‘మాకు ఉన్న అతి పెద్ద లక్ష్యంలో మనందరం కలిసి జీవించేందుకు అవసరమైన ఆరోగ్యకరమైన ఆవరణ వ్యవస్థను క్రియేట్ చేయడం కూడా ఓ భాగం. దీని కోసం మేం మా నెట్వర్క్‌లో ఉన్న వినియోగదారులు, సప్లయర్స్, క్లైమేట్ ప్రాక్టీషనర్స్.. ఇలా అందరితో కలిసి పని చేయాలని భావిస్తున్నాం. అలాగే ఈ వాల్యూ చైన్‌కి మరింత బలాన్ని ఇచ్చేలా థింక్ ట్యాంక్స్ కూడా తీసుకురావాలని అనుకుంటున్నాం. సీడ్ బాంబింగ్ వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం చూపించే అసలైన ప్రభావం కూడా ఇదే.
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ప్రభావిత గ్రామాల్లో మొక్కలను పెంచేందుకు మా టీం సరైన వ్యక్తులు, గివ్ ఫౌండేషన్ మరియు సంకల్ప్ తరు ఫౌండేషన్ వంటి భాగస్వాములను ఎంపిక చేసుకుంది. వారంతా చెప్పింది చేయడానికి, కమిట్‌మెంట్‌లకు అనుగుణంగా జీవించేందుకు సంసిద్ధంగా ఉన్నవారే.
‘‘ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్‌లో సీడ్ బాంబింగ్ ప్రాజెక్ట్ అతి పెద్ద ఫిలాసఫీతో సమలేఖనం అయి ఉంటుంది. మృత్తికా క్రమక్షయాన్ని అరికట్టడంతోపాటు ఆ ప్రాంతాన్ని పచ్చగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఒకసారి మృత్తికా క్రమక్షయం అరికడితే, హిమాలయ శ్రేణుల్లో కొండచరియలు విరిగి పడే ప్రాంతాల్లో ఆ ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉంటుంది’’ అంటారు పూజ.
63 గ్రామాల్లో దాదాపు 1 మిలియన్ స్థానిక సీడ్‌బాల్స్‌ని చల్లాలంటే అది నిజంగా చాలా పెద్ద పనే. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు మరియు మహిళలను ఇందులో భాగం చేయడం ద్వారా ఈ పని పూర్తి చేయడం సాధ్యమైంది. ఫ్లిప్‌కార్ట్ మరియు భాగస్వాములైన NGOలు కూడా డ్రోన్స్ సహాయంతో ఈ ప్రాజెక్ట్ ప్రయత్న వ్యాప్తి, ప్రభావాన్ని మరింతగా పెంచారు. ఇప్పుడు చమోలీలో అతి కష్టమైన ప్రాంతాల్లోనూ సీడ్ బాంబింగ్ చాలా సులభం అయింది. అలాగే సుమారు 300 కేజీల సీడ్‌బాల్స్‌ను డ్రోన్స్ ద్వారా ఆ భూభాగం మీద చల్లారు.
ఈ యాక్టివిటీ ద్వారా చాలామంది మహిళలకు ఉద్యోగం ఇచ్చేందుకు సాధ్యపడింది. వారికి సీడ్‌బాల్స్ చేయడంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. ‘‘స్థానిక గ్రామాలకు చెందిన సుమారు 25 నుంచి 30 మంది మహిళలకు సీడ్‌బాల్స్ తయారీలో శిక్షణ ఇచ్చారు. కమ్యూనిటీ మెంబర్స్‌తో పాటు వీరినీ ప్రాజెక్ట్‌లో భాగంగా సీడ్స్ బాంబింగ్‌కి ఉపయోగించారు. డ్రోన్‌తో చేసిన సీడ్ బాంబింగ్ మాకు చాలా పెద్ద లాభమని చెప్పచ్చు’’ అన్నారు పూజ
ఒక పచ్చని వారసత్వం
ఈ సీడ్ బాంబింగ్ ప్రాజెక్ట్ ద్వారా 3 నుంచి 4 లక్షల మధ్యలో చెట్లను పెంచాలని భావించాం . అప్పుడే ఈ ప్రాంతంలోని డ్యామేజ్‌ని కవర్ చేయగలమని అనుకున్నాం. ఫ్లిప్‌కార్ట్ మరియు తన భాగస్వాములు ఈ ప్రాజెక్ట్ ద్వారా 95,788 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‌ని (నాటిన మొక్కల జీవితకాలం అంతటిలోనూ) తగ్గించాలని భావించాం. అలాగే కమ్యూనిటీలలో కొన్ని తరాల పాటు ఈ మార్పు యొక్క ప్రభావం మనం చూడవచ్చు.
మా సంస్థలో పనిచేస్తున్నవారిలో ఈ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలా మంది మహిళలకు, ఈ ప్రయత్నం వారి జీవన నాణ్యతను బాగా మెరుగుపరిచింది. కర్మాగారాలు మూతపడటంతో, చాలా మంది మహిళలకు ఆదాయ మార్గాలు లేకుండా అయిపోయాయి. కానీ ఈ ప్రాజెక్ట్ వారికి చక్కని ఆదాయ అవకాశం కల్పించింది. ఇప్పుడు, ఉపాధితో, ఈ మహిళలకు వారి నిబంధనల ప్రకారం జీవితాన్ని గడపడానికి మరియు వారి పిల్లలను పాఠశాలలో చేర్చడానికి అవసరమైన డబ్బు ఉంది, ”అని సంకల్ప్‌తరు ఫౌండేషన్ ప్రతినిధి చెప్పారు.
63 గ్రామాలు, 27,000 మంది లబ్ధిదారులు మరియు 1.1 మిలియన్ల స్థానిక సీడ్‌బాల్‌ల బాంబింగ్ – ఇవన్నీ కలిగిన ప్రాజెక్ట్ సీడ్‌బాల్ బాంబింగ్ అనేది ఒక ప్రభావవంతమైన, ఆశ, కమిట్‌మెంట్‌తో కూడిన కథ. ఇది కేవలం కమ్యూనిటీనే కాదు.. గ్రహాన్ని కూడా చాలా ప్రభావితం చేసింది.
‘‘ఈ ప్రాజెక్ట్ ద్వారా భూమికి సంబంధించిన ఈ సమస్య పై మేము ప్రజలకు అవగాహన కలింగించగలిగాం. అలాగే మాతో వాటాదారులుగా చేసిన చాలామంది ఈ రోజు గ్రీన్ అంబాసిడర్స్‌గా లేదా గ్రీన్ వారియర్స్‌గా ఉన్నారు’’ అన్నారు పూజ.
స్థిరత్వం మరియు హరిత గ్రహాన్ని నిర్మించడానికి సంబంధించి మరిన్ని కథల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.