ఓ #మేడ్‌ ఇన్‌ ఇండియా కథ: అనిశ్చితి నుంచి బయటపడే ప్రయత్నంలో ఇ-కామర్స్‌ను ఎంచుకున్న మధుర నివాసి పీయూష్‌ అగ్రవాల్‌

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | ગુજરાતી | मराठी

వ్యాపారవేత్త కావాలన్నది తన కల అని పీయూష్‌ అగ్రవాల్‌ తన చిన్ననాటి జ్ఞాపకాలను తలచుకున్నారు. అయితే, ఎంఎన్‌సి ఉద్యోగంలో చేరినా, అందులో సంతృప్తి లేకపోవడంతోపాటు మహమ్మారి సమయంలో అతడు స్వస్థలానికి రావాల్సి వచ్చింది. అదిగో అప్పుడు తన చిన్ననాటి ఆకాంక్ష మళ్లీ రగిలి, అతని భవిష్యత్తును తిరగరాసింది. ఈ నేపథ్యంలో అతడు తన కలను ఎలా సాకారం చేసుకున్నాడో చదవండి!

entrepreneur

త్తర ప్రదేశ్‌ రాష్ట్రం మధుర నివాసిపీయూష్‌ అగ్రవాల్‌తానో వ్యాపారవేత్త కాగలనని గట్టిగా విశ్వసించాడు. అయితే, ఎప్పుడు… ఎలా తన కలను నేరువేరుతుందో అప్పట్లో అతనికి తెలియదు. ఈ నేపథ్యంలో ఒక బహుళ జాతీయ కంపెనీలో అతనికి ఉద్యోగం వచ్చింది. ఆ విధంగా ఉద్యోగ బాధ్యతల్లో మునిగినా, ఆయన కన్న కల మాత్రం అతడిని వెన్నాడుతూనే ఉంది.

ఇంతలో మహమ్మారి విరుచుకుపడటంతో పీయూష్‌ ఉద్యోగం నుంచి బయటపడి ఇల్లు చేరాల్సి వచ్చింది. “కరోనా దిగ్బంధం సమయంలో నాకు పైసా సంపాదన లేదు. అందుకే నేనేం చేయాలనేదానిపై ఆలోచనలు ఎడతెగకుండా వస్తుండేవి. ఫలితంగా తీవ్ర ఒత్తిడి, ఆందోళనలకు లోనయ్యాను. ఏదైమైనా జీవనోపాధి కోసం ఏదో ఒకటి చేయక తప్పదని నిర్ణయానికి వచ్చాను” అని చెప్పాడు పీయూష్‌. ఈ పరిస్థితుల మధ్య అతనిలో ఒక కొత్త భావన మొలకెత్తింది. దాన్ని అనుసరించి తన పారిశ్రామిక స్వప్నం సాకారం కావడం మొదలైంది.


అతని కథ చూడండి: విజయానికే అంకితం


వ్యాపారవేత్త కావాలన్న తన కలకు కట్టుబడిన పీయూష్‌, అవకాశాల కోసం అన్వేషణ ప్రారంభించాడు. తాను నివసించే నగరానికిగల వారసత్వంతోపాతు అదొక పవిత్ర యాత్రాస్థలం కావడం, కొన్ని నిర్దిష్ట ఉత్పత్తులకు డిమాండ్‌ ఉండటాన్ని బట్టి ‘శంఖాల దుకాణం’ ఏర్పాటు ఆలోచన వచ్చింది.

“నేనొక ఆలయానికి వెళ్లినపుడు జనం సాంబ్రాణి వత్తులు కొనడం గమనించాను. ఇక్కడ అనేక ఆలయాలు ఉండటమేగాక యాత్రికులు పెద్దసంఖ్యలో మధురకు వస్తుంటారు. కాబట్టి యాత్రికుల రాకపోకలు ఉన్నంతకాలం ఇలాంటి వస్తువుల విక్రయం కొనసాగుతుందని నేను విశ్వసించాను” అని పీయూష్‌ చెప్పాడు.

పీయూష్ ఆలోచన నిజమైంది.. వ్యాపారవేత్తగా ఎదిగాలన్న తపన అనిశ్చితితో కొట్టుమిట్టాడుతున్న అతనికి వ్యాపారం ప్రారంభించడంలో తోడ్పడింది. తల్లిదండ్రుల సహకారంతో తొలుత స్థానికంగా అమ్మకాలు ప్రారంభించాడు. ఈ ప్రయత్నం 3 నెలల్లోనే సఫలం కావడంతో అక్టోబర్ 2020లో తన బ్రాండును ఆన్‌లైన్‌ వేదికకు పరిచయం చేస్తూఫ్లిప్‌కార్ట్‌ను తన భాగస్వామిగా ఎంచుకున్నాడు.

“ఫ్లిప్‌కార్ట్ వేదికలో ప్రవేశం తర్వాత నాకు దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది. అంతకుముందు నేను నెలవారీ జీతంకింద అందుకునే మొత్తం ఇప్పుడు వారానికోసారి నా చేతిలో పడుతోంది” అని పీయూష్ తెలిపాడు. ఈ పురోగమనంతో అతని వ్యాపారం మరింత ముందుకు దూసుకుపోతోంది. వ్యాపారంలో చురుగ్గా పెట్టుబడి పెడుతూ, ఇంటి నుంచే చిన్న వ్యాపారం ప్రారంభించిన యువ వ్యాపారవేత్త ఇవాళ తన సొంత తయారీ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

ఇప్పటిదాకా తాను సాధించిన విజయం గర్వకారణమే అయినా, ఆ వేగాన్ని తగ్గించడం పీయూష్‌కు ఎంతమాత్రం ఇష్టంలేదు. “ఈ వ్యాపారాన్ని నెలకు రూ.1 కోటి ఆదాయం ఇవ్వగలిగినదిగా రూపుదిద్దాలని నేను సంకల్పించాను. దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లో నా ఉత్పత్తులు చూడాలన్నది ఇప్పుడు నా కొత్త కల” అని ఆయన చెప్పాడు.

మరింత చదవాలంటే- #స్వయంకృషితో ఎదిగిన వ్యాపారవేత్తల విజయగాథల కోసం క్లిక్‌ చేయండిhere

Enjoy shopping on Flipkart