సరఫరా గొలుసులో 2,100 మందికి పైగా వికలాంగులకు ఉపాధి కల్పిస్తూనే ఫ్లిప్‌కార్ట్ తన eDAB ఇనీషియేటివ్‌తో పని ప్రదేశం వద్ద కూడా అందరితో కలుపుకొని, విభిన్నమైన చర్యలతో వారికి సమాన ఉపాధిని అందిస్తోంది. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నాడు; అలాగే రోజూ వారి కథలు మనం చూడాలి మరిచు చదవాలి. వారి కథల్లో వారే హీరోలు ఎందుకు ఎలా అయ్యారో ఇక్కడ తెలుసుకోండి.
“I ‘‘మాట్లాడలేను, వినలేను – అందుకేనేమో ఈ ప్రపంచం నన్ను చూడలేదు. కానీ జీవితం అంటేనే సవాళ్లను ఎదుర్కోవడం’’ అంటూ సైగలు చేశాడు అజయ్ సింగ్
చూడండి: ఫ్లిప్‌కార్ట్ యొక్క eDAB హబ్ నుంచి కథలు
‘‘ఈరోజుకీ మన సమాజంలో వికలాంగులైన మహిళలు చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. తప్పుడు చికిత్స కారణంగా నా కాలులో లోపం ఏర్పడింది. నేటికీ నేను కుంటుతూనే నడుస్తాను. అది మన తలరాత అని అనుకున్నా సరే లేదా దానితో పోరాడినా సరే..’’ అన్నారు సంగీత. నేను పోరాడాలని నిర్ణయించుకున్నాను.
‘‘నా రెండు చేతులకీ చేతివేళ్లు ఉండవు. కానీ నన్ను నేనెప్పుడూ వికలాంగునిగా భావించలేదు. నా జీవనోపాధి కోసం నేను చాలానే శ్రమించాల్సి వచ్చేది. నిర్మాణంలో ఉన్న స్థలంలో రాళ్లు మరియు ఇటుకలు మోసేవాడిని. ఒక్కోసారి నా చేతికి ఉన్న ఈ రెండు వేళ్లు కూడా తెగిపోతూ ఉండేవి’’ అన్నారు శేఖర్ కుమార్.
అలా వారి ప్రతిభను ప్రదర్శించేందుకు సరైన అవకాశాల కోసం వెతుక్కుంటూ ఈ ముగ్గురూ దిల్లీలోని ఫ్లిప్‌కార్ట్ యొక్క Flipkart’s వైకల్యాలు కలిగిన ఈకార్టియన్స్ (eDAB) డెలివరీ హబ్‌లో తమని తాము కనుగొన్నారు.
భవిష్యత్తు కలుపుకునే ఉంటుంది మరియు సమానమైంది కూడా
పని ప్రదేశం వద్ద సమానత్వం మరియు కార్యాలయానికి చెందిన ఉద్యోగుల విధానాలలోని వైవిధ్యమే ప్రధానంగా ఫ్లిప్‌కార్ట్ 2017లో eDAB ప్రొగ్రామ్‌ని పరిచయం చేసింది. తద్వారా తన సరఫరా గొలుసులోనే ఇతరులతో సమానంగా వికలాంగులకూ అవకాశాలు కల్పించాలని భావించింది.
మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఉద్యోగి స్థానంలోనూ వికలాంగులనే ఎంపిక చేయడం ద్వారా 2021లో దిల్లీలో ఒక హబ్‌ని ప్రారంభించింది ఫ్లిప్‌కార్ట్. ఇలా 100% పూర్తి స్థాయిలో వికలాంగులతో పని చేసే మొదటి హబ్ ఇదే కావడం విశేషం. దాదాపు 50 మంది ఉద్యోగులతో రోజూ దాదాపు 2000 డెలివరీల వరకు ఇది చేస్తుంది. అంతేకాదు.. 97% వినియోగదారుల తృప్తికరమైన రేటింగ్ కూడా పొందుతోంది.
టీం లీడ్స్ దగ్గర్నుంచి క్యాషియర్స్, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ నుంచి ప్యాకర్స్, సార్టర్స్.. ఇలా ఈ హబ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ప్రతిభావంతులు, సామర్థ్య, నైపుణ్యాలు కలవారు కావడం విశేషం.
‘‘నాకు ఫ్లిప్‌కార్ట్ గురించి ఓ ఫ్రెండ్ చెప్పగానే వెంటనే నేను సంస్థలో చేరిపోయా. అలా ఫ్లిప్‌కార్ట్‌లో చేరినప్పట్నుంచి ఇప్పటివరకు నేను వెనుదిరిగి చూసింది లేదు. ఈ రోజు నేను నా నలుగురు పిల్లలకీ ఒక సురక్షితమైన భవిష్యత్తును ఇవ్వగలనని నమ్ముతాను’’ అంటారు నలుగురు పిల్లల తండ్రి, ఫ్లిప్‌కార్ట్ విష్‌మాస్టర్ శేఖర్.
తనకి గర్వకారణమైన అనేక క్షణాలను గుర్తు చేసుకుంటూ- ‘‘చాలా రకాల స్మాల్ టైమ్ జాబ్స్ చేసిన తర్వాత నేను ఫ్లిప్‌కార్ట్‌లో చేరాను. నా కాళ్ల మీద నేను నిలబడడం, నా మొట్టమొదటి జీతాన్ని నా తల్లిదండ్రులకు ఇవ్వడం.. నాకు చాలా సంతోషాన్నిచ్చాయి..’’ అంటారు ఫ్లిప్‌కార్ట్ విష్‌మాస్టర్ అజయ్.
ఇదే హబ్‌లో టీం లీడర్‌గా ఉన్న సంగీత కూడా మునుపు ఎన్నో జాబ్స్ చేశారు. ‘‘కానీ ఫ్లిప్‌కార్ట్‌లోనే నేను నా కుటుంబాన్ని కనుగొనగలిగాను’’ అంటారామె.
మద్దతిచ్చే సంస్కృతి
విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ మరియు వారికి అవసరమైన మద్ధతునిస్తూ నేడు eDAB ఇనీషియేటివ్ ద్వారా 2100 మంది వికలాంగులకు తమ సరఫరా గొలుసు ద్వారా బలాన్ని అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్.
eDAB ప్రొగ్రామ్ ద్వారా ఉద్యోగుల ఎదుగుదలకు ఉపకరించే విధంగా స్పెషల్ క్లాస్ రూమ్స్, ఆన్ జాబ్ ట్రయినింగ్ ప్రొగ్రామ్స్.. వంటివి సంజ్ఞా భాషలో నిపుణులతో నేర్పిస్తారు. ఈ ప్రొగ్రామ్ ద్వారా ఉద్యోగులందరికీ సెన్సిటైజేషన్ సెషన్స్ మరియు సానుభూతి శిక్షణతో పాటూ సరఫరా గొలుసు అందరికీ యాక్సెసిబుల్‌గా ఉండేందుకు అవసరమైన మౌలికపరమైన మార్పులను కూడా ఫ్లిప్‌కార్ట్ చేపడుతుంది.
వినియోగదారులతో విష్మాస్టర్స్ సులభంగా సంభాషించేందుకు వీలుగా ప్రత్యేక బ్యాడ్జెస్ మరియు ఫ్లాష్‌కార్డులను డిజైన్ చేయించారు.
eDAB హబ్ వద్ద ఫ్లిప్‌కార్ట్‌లో సంగీత, అజయ్ మరియు శేఖర్లలానే ఇతరులు చాలామంది కలుపుకోవడం, నిరంతర మద్ధతు మరియు గౌరవమర్యాదలు అనే సంస్కృతి ద్వారా చక్కగా తమ పనిలో రాణించారు. ‘‘మా ఇబ్బందులు భిన్నమైనవి కావచ్చు. కానీ మేమంతా మా కథల్లో హీరోలమే’’ అంటారు సంగీత.
ఇది కూడా చదవండి; వాయిసెస్ ఆఫ్ ఇన్‌క్లూజన్; స్టోరీస్ ఫ్రమ్ ఏ ప్రొగ్రెసివ్ వర్క్ ప్లేస్