కోమల్ ప్రసాద్ పాల్ వయసు 33 ఏళ్లు... ఓ రోడ్డు ప్రమాదంలో అతని కుడిచేయి పోయింది. అయితే, మైక్రోబయాలజీ పట్టభద్రుడైన ఈ కోల్‌కతా సాహసి అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఫ్లిప్‌కార్ట్ విక్రేతగా అవతారమెత్తాడు.
ఒక తీవ్ర వ్యక్తిగత విషాద ఘటనకోమల్ ప్రసాద్ పాల్ జీవితాన్ని అనుకోని మలుపు తిప్పింది. కోమల్ కోల్‌కతా సమీపంలోని బరసాత్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తుండగా 2017లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తను నడుపుతున్న వాహనం ట్రక్కును ఢీకొనడంతో స్పృహకోల్పోయిన ఈ యువకుడు 8 గంటలపాటు అదే స్థితిలో రోడ్డమీద పడి ఉన్నాడు. ఆ తర్వాత ఎవరో అతణ్ని సమీపంలోని ఒక ఆస్పత్రికి తరలించగా, వెంటనే ఐసీయూలో ప్రత్యేక చికిత్స ప్రారంభించారు. అతనికి తిరిగి స్పృహ వచ్చేసరికి తనకిక కుడిచేయి లేదనే వాస్తవం అర్థమైంది. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన అతనికి దుఃఖాన్ని ఎలా దిగమింగుకోవాలో అర్థం కాలేదు. ఇకపై తన కుటుంబాన్ని పోషించుకోవడం ఎలా? అన్న ప్రశ్న అతని హృదయాన్ని మెలిపెట్టింది.
కోమల్ నెల రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఏ పనీ లేకుండా కాలం గడపాల్సి రావడం దుర్భరం కాగా కొన్ని కాగితాలు, ఓ కాగితం, ఎరేజర్ తెచ్చిపెట్టమని తండ్రిని కోరాడు. అతను చిన్నతనం నుంచీ చిత్రలేఖనం, రేఖాచిత్రాలు గీయడమంటే ఇష్టపడేవాడు. ఇప్పుడు ఆస్పత్రిలో ఎటూ కదల్లేని పరిస్థితి అతడిలోని ప్రతిభను మళ్లీ నిద్రలేపింది. కానీ, కుడిచేయి పోయిందనే బాధను వీడి, ఎడమ చేతితోనే రేఖాచిత్రం వేయడం ప్రారంభించాడు. ఆ విధంగా, చిన్ననాటి కళాతృష్ణ అతని మనోబలాన్ని ఇనుమడింపజేయగా, క్రమేణా విషాదాన్ని అధిగమించాడు.
దురదృష్టకర సంఘటన పరిణామాలతో అతని తల్లిదండ్రులు, చెల్లెలు తీవ్రంగా కుంగిపోయారు. కానీ, వారి మనసులో కమ్ముకున్న విషాదం తన విజయ సంకల్పాన్ని మసకబార్చకుండా కోమల్ జాగ్రత్తపడ్డాడు. తన వైకల్యం మాట ఎలా ఉన్నా కుటుంబ పోషణలో తన కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిందేనని అతడు నిశ్చయించుకున్నాడు. ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చాక తిరిగి మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం కొనసాగించే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ ఉద్యోగ బాధ్యతలను నెరవేర్చలేని పరిస్థితి ఏర్పడింది. వైకల్యం ప్రభావం అతని పనితీరుపై పడింది. కోమల్ తన ఉద్యోగం విడిచిపెట్టక తప్పలేదు. ఉద్యోగంలో ఉన్నపుడు ఏర్పడిన పరిచయాలను ఉపయోగించుకుంటూ బాలింతలు, శిశువుల కోసం నెబ్యులైజర్లు, రొమ్ము (బ్రెస్ట్) పంపులు వంటి వ్యక్తిగత ఉత్పత్తుల విక్రయం మొదలుపెట్టాడు.
తొలిరోజుల్లో వ్యాపారం మందకొడిగానే ఉండేది. అయినప్పటికీ కోమల్ వెనుకంజ వేయలేదు. మైక్రోబయాలజీలో పట్టభద్రుడైన అతడు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా ఆ వృత్తికి తగినవాడు. అయితే, వ్యాపారవేత్త కావడం ఓ సరికొత్త సవాలేనని అతడు త్వరలోనే గ్రహించాడు. అయినా పట్టువీడకుండా విజయతీరం చేరేదాకా ఈ కొత్త ప్రయాణం కొనసాగించాల్సిందేనని నిశ్చయానికి వచ్చాడు.
విజయాన్ని రుచి చూడాలనే ఆకాంక్ష రగలగా, అతడు తన వ్యాపార విస్తరణకు వివిధ మార్గాన్వేషణ ప్రారంభించాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఒకరోజు ఫ్లిప్‌కార్ట్‌లో విక్రేతగా అవకాశాల గురించి కోమల్ ఓ స్నేహితుడిని వాకబు చేశాడు. దీంతో ఆన్‌లైన్ ద్వారా పరిశీలించాల్సిందిగా మిత్రుడు సూచించాడు. అటుపైన కోమల్ తనవంతు శోధనతో చివరకు ఫ్లిప్‌కార్ట విక్రేతల కూడలిలో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోన అతనికి ఫ్లిప్‌కార్ట్ సెలక్షన్-అక్విజిషన్ బృందానికి చెందినసౌరోజ్యోతి నుంచి పిలుపు వచ్చింది. ఆ బృందం సాయంతో కోమల్ తన నమోదు ప్రక్రియను పూర్తిచేసి, ఎలాంటి ఇబ్బంది లేకుండా విక్రేతగా మారిపోయాడు.
ఆ తర్వాత 2019 మే నెలలో ఈ 33 ఏళ్ల వికలాంగుడు ఫ్లిప్‌కార్ట్ విక్రేతగా కొత్త జీవితం ప్రారంభించాడు. ఇప్పుడతనుఅల్టిమేట్ హైజీన్ పేరిట ఫ్లిప్‌కార్ట్‌లో వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులనుఫ్లిప్‌కార్ట్ సమర్థ్ కార్యక్రమం కింద విక్రయిస్తున్నాడు. ఇ-కామర్స్ ప్రపంచంలో అణగారిన వర్గాల వ్యాపారవేత్తలకు, హస్తకళాకారులకు ఈ కార్యక్రమం ఎప్పటిలాగానే కొత్త అవకాశాలను కల్పిస్తోంది. కాగా, ఫ్లిప్‌కార్ట్ విక్రేతగా తొలిరోజు అతనికి ఒకేఒక ఆర్డర్ మాత్రమే వచ్చినా, ఆ తర్వాత వెనక్కు చూసుకునే పరిస్థితి రాలేదు. ఇవాళ అతడు రోజుకు 50కిపైగా ఉత్పత్తులను విక్రయిస్తుండగా, ఈ పరిమాణం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. గడచిన ఐదు నెలల్లో అతడు తన అమ్మకాల్లో 100 శాతానికిపైగా వృద్ధి సాధించాడు. చిన్న వ్యాపారవేత్త అయినప్పటికీ తాను సాధించిన విజయంపై భరోసాతో ఆర్డర్ల ప్యాకింగ్ కోసం కోమల్ ఇప్పుడొక సహాయకుడిని పనిలో పెట్టుకున్నాడు.
కోమల్ విషయంలో అతని తల్లిదండ్రులు పూర్తి మద్దతునిచ్చారు. దైవభక్తుడైన కోమల్ నిత్యం భగవద్గీత పఠిస్తాడు. ఈ గ్రంథం తనకు ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా సాగిపోయే స్థైర్యాన్నిస్తుందని అతడు చెబుతాడు. ఫ్లిప్‌కార్ట్ తనకు చేయూతనిస్తున్నందున విజయపథంలో దూసుకుపోగలనని అతడికి తెలుసు. నిజమే.. వ్యాపారంలో మునిగినప్పటికీ అతనింకా బొమ్మలు వేస్తూనే ఉన్నాడు.
మరిన్ని స్ఫూర్తిదాయ కథనాలను వ్యవస్థాపనపై మా #స్వయంకృషి సిరీస్‌లో చదవండి