మేక్‌ ఇన్‌ ఇండియా: వేగంగా ఎదిగిన ఫ్లిప్‌కార్ట్‌ విక్రేత ఆశిష్‌ కుక్రేజా కథనం!

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | ગુજરાતી | मराठी

తన తల్లి, భార్య మద్దతుతో నడిచే కుటీర పరిశ్రమ స్థాయినుంచి రూ.50 కోట్ల టర్నోవర్‌ స్థాయికి ఎదిగిన ఆశిష్ కుక్రేజాది మేక్ ఇన్ ఇండియా విజయగాథ! ఈ ఫ్లిప్‌కార్ట్ విక్రేత తన కలలను ఎలా సాకారం చేసుకున్నాడో చదవండి. అతనిప్పుడు తన గో-గ్రీన్ కార్యక్రమాలతో సమాజానికి కొంత తిరిగి చేయూతనిస్తున్నారు.

Make In India

’మేక్‌ ఇన్‌ ఇండియా’ మంత్రం స్ఫూర్తితో వ్యాపార యజమాని,ఫ్లిప్‌కార్ట్‌ విక్రేత ఆశిష్‌ కుక్రేజా తన సామర్థ్యాన్ని విజయానికి పరిమితం చేసుకోకుండా అంతకుమించిన కలతో ముందడుగు వేశారు. అందుకే అందని చందమామను అందుకోవడమే కాదు… తారస్థాయికి ఎదిగారు. కుటీర పరిశ్రమ స్థాయిలో చిన్న వ్యాపారం నుంచి తన పట్టుదల, తల్లి-భార్య తోడ్పాటుతో ఏకంగా రూ.50కోట్ల టర్నోవర్‌గల వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. అతని#మేక్‌ ఇన్‌ ఇండియా విజయగాథ ప్రత్యేకంగా గుర్తుంచుకోదగినదే!


ఈ కథనాన్ని దిగువన చూడండి:

YouTube player

”నేనొక సీదాసాదా మధ్యతరగతి కుటుంబీకుడిని. నాకంటూ సొంత ఇల్లు, కారు వగైరా సౌకర్యాలన్నీ కావాలన్న కలలుగనే వాణ్ని. కానీ, నా కలను సాధించుకోవడం ఎలాగో మాత్రం నాకు తెలియదు” అని 2014 తొలినాళ్లనాటి తన గతాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పాడతడు. అప్పటికి తన ఫుట్‌వేర్‌ బ్రాండ్‌ ‘క్రాసా’ వ్యాపారాన్ని అతడు ప్రారంభించనే లేదు.

ఆరంభంలో తన వ్యాపారాన్ని తమ చిన్న ఇంటినుంచే నడిపేవాడు. ఆర్డర్ల ప్యాకింగ్‌ బాధ్యతను అతని తల్లి, భార్య చూసుకునేవారు. ఆశిష్‌ ఆలోచనలు పెద్దస్థాయిలో ఉన్నప్పటికీ, అతని పెట్టుబడి రూ.50,000 మాత్రమే. ఈ కారణంగా ఆదిలో ఆర్థిక అవరోధాలు ఎదురైనప్పటికీ ఒక్కక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్లాడు.

ఇవాళ స్వయం కృషితో ఎదిగిన ఈ #SellfMade ఫ్లిప్‌కార్ట్‌ విక్రేత వ్యాపారవేత్తగా తన ప్రయాణంలో అనేక మైలురాళ్లను అధిగమించాడు. అంతేకాదు… వందలాది భారతీయ కుటుంబాలు తమ కలలను సాకారం చేసుకునే దిశగా తనవంతు చేయూతనిస్తూ సామాజిక బాధ్యతను కూడా నెరవేరుస్తున్నాడు.

Make In India

మార్కెట్‌లో గట్టి పట్టు సంపాదించుకున్న నేపథ్యంలో తన తదుపరి లక్ష్యమైన రూ.100 కోట్ల టర్నోవర్‌ సాధించడంపైనే కాకుండా ఒక సానుకూల ప్రభావం కనిపించేలా చేయడంపైనా దృష్టి సారించాడు.

ఆ మేరకు ‘గో-గ్రీన్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. తదనుగుణంగా తన ఫుట్‌వేర్‌ బ్రాండ్‌ కింద ప్లాస్టిక్‌ వ్యర్థాల తగ్గింపుతోపాటు వాటిని వినూత్న బూట్ల తయారీకి వినియోగించేలా పునరుత్పాదన చేస్తున్నాడు. ఆ మేరకు ఫ్లిప్‌కార్ట్‌ ప్రతి అడుగులోనూ తోడూనీడగా ఉండటంతో ఇప్పుడు సమాజానికి తనవంతు సేవపై ఆశిష్‌ దృష్టి సారించాడు. తదనుగుణంగా సుస్థిర విలువ ప్రక్రియ ద్వారా లేదా తనలాగా కలలుగనే వారికి ఉపాధి అవకాశాల కల్పన ద్వారా తనవంతు కృషి చేస్తున్నాడు.


ఇదీ చదవండి: చెన్నై సూపర్‌ క్వీన్స్‌: ఈ ఫ్లిప్‌కార్ట్‌ కూడలిలో సరఫరా చెయిన్‌ పరంగా చరిత్ర సృష్టిస్తున్న మహిళల బృందం!

Enjoy shopping on Flipkart