స్థానికం నుంచి జాతీయ స్థాయికి: కుటుంబ వ్యాపారం కోసం ఫ్లిప్‌కార్ట్‌ విక్రేత మహెర్‌ బాత్రా ఆశావహ ప్రణాళికలు

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | ગુજરાતી | मराठी

చిన్నతనం నుంచీ తాత, తండ్రి కుటుంబ వ్యాపారం నడపడం చూస్తూ పెరిగిన మెహర్‌ బాత్రా కూడా పరిశ్రమలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకోవాలని కలలుగన్నారు. ఆన్‌లైన్‌ మార్కెట్‌లో తమ వ్యాపార విస్తరణ దిశగా ఆయన అందుకున్న తొలి ఆర్డర్‌ దోహదం చేసింది. ఆ విధంగా ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా తమ పిరమిడ్‌ ఫ్యాషన్స్‌ సేవలను డిజటలీకరించారు. ఇప్పుడాయన రోజుకు 100కుపైగా ఆర్డర్లపై సేవలందిస్తున్నారు! తమ ఎదుగుదల కోసం ఆయనతోపాటు ఆయన బృందం ఇ-కామర్స్‌ను ఎలా సద్వినియోగం చేసుకున్నారో చదవండి.

Flipkart seller

మెహర్‌ బాత్రా ఫ్లిప్‌కార్ట్‌ విక్రేతగా మారడానికి ముందే తన వ్యాపార సామ్రాజ్య స్వరూపానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారుర. మార్కెట్‌ అవకాశాల సద్వినియోగానికి తగిన ఆలోచలన్నీ ఆయన మెదడులో సదా మెదలుతూనే ఉంటాయి. అందుకే 27 ఏళ్ల వయసులోనే తమ కుటుంబ వ్యాపారం పిరమిడ్‌ ఫ్యాషన్స్‌పై తనదైన ముద్ర వేయడానికి సిద్ధమ్యారు.

మెహర్‌ తమ కుటుంబంలో మూడోతరం వ్యాపారవేత్త కాగా, ఆయన ఢిల్లీలో పెరిగారు. కుటుంబ వ్యాపారానికి పునాది వేసిన తాత 25 ఏళ్ల కిందట ఎగుమతి ప్రధానంగా మహిళల దుస్తుల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేశారు. ఓ చిన్నగదిలో, కాసిని యంత్రాలు, కొద్దిమంది పనివాళ్లతో ప్రారంభమైన ఈ తయారీ కేంద్రం ఇవాళ అనేక షోరూములతో కూడిన పరిశ్రమగా ఎదిగింది. ఫ్లిప్‌కార్ట్‌ విక్రేతగా మెహర్‌ కొత్త విక్రయ అవకాశాల అన్వేషణకు పురికొల్పింది ఈ ఎదుగుదలే.

తన ఖాతాదారులంతా ఆన్‌లైన్‌లోనే కావడం వల్ల తాను కూడా అక్కడే వారికి అందుబాటులో ఉండాలని భావించినట్లు మెహర్‌ చెప్పారు. ఇక అఖిలభారత మార్కెట్‌ సౌలభ్యం కల్పించడమే కాకుండా ఇ-కామర్స్‌ శక్తిసామర్థ్యాల సద్వినియోగానికి ఫ్లిప్‌కార్ట్‌ మద్దతు ఉండనే ఉంది.

వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం

మెహర్‌ తన జ్ఞాపకాలను తిరగదోడుతూ తాత బోధించిన జ్ఞానగుళిక గురించి గుర్తు చేసుకున్నారు: వ్యాపార నిర్మాణం నిరంతర కృషితో కూడినది- అందుకు సమయం అవసరం. వేగవంతమైన నేటి ఆధునిక వ్యాపార వాతావరణంలో కూడా వ్యవస్థాపకత ప్రయత్నాల్లోనూ తాత ప్రబోధాన్ని ఆయన వీడలేదు. తమ వస్త్ర వ్యాపారాన్ని తదుపరి స్థాయికి చేర్చడంలో తన తండ్రి, తాత వెచ్చించిన సమయం, కృషి, అంకితభావాన్ని చూసిన మెహర్ వారి అడుగుజాడల్లో నడవడం సహజమే!

చిన్నాటినుంచి తనకు తెలిసిన వ్యాపార ప్రపంచంలో విజయసాధనకు తగిన పరిజ్ఞాన సముపార్జన దిశగా మొదట ఆయన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ) పట్టభద్రుడయ్యారు. తాను ఫ్లిప్‌కార్ట్ విక్రేతగా ఎందుకు మారాలని భావించిందీ చెబుతూ- “ఖాతాదారు సేవలు, నాణ్యతపై భరోసా కోసం ప్రజలు ఫ్లిప్‌కార్ట్‌ను ఎంచుకుంటారు. కాబట్టి సరసమైన ధర, వస్తు సౌలభ్యం, నాణ్యతలను కోరుకునే ఖాతాదారుల తొలి ప్రాధాన్యం ఫ్లిప్‌కార్ట్” అని మెహర్‌ వివరించారు.

ఫ్లిప్‌కార్ట్‌ విక్రేతగా కేవలం ఒక్క సంవత్సరం అనుభవంతో దుస్తులు, గార్మెంట్ పరిశ్రమ వృద్ధి సామర్థ్యంపైనా మెహర్‌ గట్టి నమ్మకం చూపారు. అందుకే ఇవాళ ఆయన 200కుపైగా సిబ్బందితో, 180కిపైగా యంత్రాలతో సొంత తయారీ సంస్థ మద్దతుతో ఆయన దూసుకెళ్తున్నారు. ఫ్లిప్‌కార్ట తన పక్షాన ఉండటంతో అవకాశాలకు ఆకాశమే హద్దు అనే వాస్తవం ఆయనకు బాగా తెలుసు.

ప్రజాస్వామ్యీకృత ఇ-కామర్స్‌ వేదిక సంపూర్ణ సద్వినియోగం

మెహర్ లక్ష్యం చాలా సులువైనది: “ఆన్‌లైన్‌లో ప్రవేశం నా వరకూ ఎదుగుదల సంబంధిత విషయం. నేను చక్కని జీవనశైలితో మంచి జీవితం గడుపుతూ నాకంటూ ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అంటారాయన.

తాత, తండ్రి ఫ్యాక్టరీతోపాటు షోరూమ్‌ల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తుండగా మెహర్ ఆన్‌లైన్ కార్యకలాపాలపై దృష్టి పెడతారు. ప్రస్తుతం ఈ ఫ్లిప్‌కార్ట్ విక్రేత పాశ్చాత్య, సంప్రదాయ మహిళా దుస్తులపై శ్రద్ధ పెట్టారు. ఇవన్నీ సొంత సంస్థలోనే తయారవుతాయి. నాణ్యతపై స్పృహగల ఖాతాదారులను ఆకర్షించడం కోసం దుస్తుల తయారీకి అవసరమైన వస్త్ర సరంజామాను సూరత్‌లోని తన మామ ద్వారా ఆయన తెప్పిస్తారు. ఆయన కూడా మెహర్‌ పురోగమనానికి తనవంతు తోడ్పాటు అందిస్తారు.

ఈ ఫ్లిప్‌కార్ట్ విక్రేత 2020 చివరలో ఆన్‌లైన్ వేదికపైకి రావడం వల్ల ప్రస్థానం నెమ్మదిగానే మొదలైంది. కానీ, ఇప్పుడు ఆయన ఊహించిన దానికన్నా వేగంగా ఆర్డర్లు పెరుగుతున్నాయి. విక్రయాలు, ప్రచారం వంటి వివిధ అంశాల్లో ఫ్లిప్‌కార్ట్ ఖాతా మేనేజర్ మార్గదర్శకత్వంతో మెహర్ వ్యాపారం ఇప్పుడు రోజుకు 100కుపైగా ఆర్డర్లను అందుకుంటోంది.

“నా ఉత్పత్తులు మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలన్నది నా ఆకాంక్ష. నేనిప్పుడు ఆన్‌లైన్ లో నా బ్రాండ్‌ను సుస్థిరం చేసుకోగలిగిన నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ మద్దతుతో నా ఆకాంక్ష కూడా నెరవేరగలదన్నది నా గట్టి నమ్మకం. ఆ మేరకు సమీప భవిష్యత్తులోనే నా వ్యాపారం వృద్ధి చెందగలదని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను” అని మెహర్ చెబుతున్నారు.

ఈ ఫ్లిప్‌కార్ట్ విక్రేత ఇంకా తన భవిష్యత్‌ ఆరంభ దశలోనే ఉన్నప్పటికీ తన సామర్థ్యమేమిటో ఆయన త్వరగా గ్రహించగలడు. ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల వేళ అమ్మకాలు దాదాపు 2 రెండు రెట్లు పెరగడం గమనించిన మెహర్ తదుపరి అధ్యాయమైన ‘ది బిగ్ బిలియన్ డేస్-2022’ కోసం ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు!

ఇలాంటి ఫ్లిప్‌కార్ట్‌ విజేతల కథనాలు చదవడానికి ఇక్కడక్లిక్‌ చేయండి.

Enjoy shopping on Flipkart