ఫ్లిప్‌కార్ట్‌ ఉత్పత్తుల వాపసు ప్రక్రియ – విధానం తీరు.. మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | ગુજરાતી | मराठी

మీకు ఫ్లిప్‌కార్ట్ వాపసు విధానంపై మీకు సందేహాలున్నాయా? అయితే, ఈ ఫ్లిప్‌కార్ట్ ఉత్పత్తుల వాపసు ప్రక్రియ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడంలో ఈ సరళ కరదీపిక మీకు తోడ్పడుతుంది. తద్వారా మీ ఆన్‌లైన్‌ కొనుగోళ్లు-వాపసుల అనుభవం సరళంగానూ సౌకర్యవంతంగానూ ఉంటుంది.

న్‌లైన్‌ కొనుగోళ్లు సరళంగా ఉండటమేగాక సత్వరం పూర్తవుతాయి. కేవలం కొన్ని క్లిక్‌లు లేదా స్పర్శలతో మీకిష్టమైన ఉత్పత్తులు కొనుగోలు చేయగల సౌలభ్యాన్ని, సౌఖ్యాన్ని మీరు పొందగలుగుతారు. అయితే, కొన్ని సందర్భాల్లో సదరు ఉత్పత్తులు అందిన తర్వాత అది మీరు ఊహించినదానికి భిన్నంగా ఉండవచ్చు. లేదంటే మీరు కోరిన పరిమాణం, రంగు లేదా ధర వగైరాలకు విరుద్ధంగా ఉండవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో లోపాలున్న లేదా పాడైన వస్తువు మీకు అంది ఉండవచ్చు. అప్పుడు మీరేం చేయాలి? అదిగో అలాంటి సమయంలోనే ఫ్లిప్‌కార్ట్‌ ఉత్పత్తుల వాపసు విధానం మీ సమస్యను సులువుగా పరిష్కరిస్తుంది.


ఫ్లిప్‌కార్ట్‌ ఉత్పత్తుల వాపసు ప్రక్రియపై వివరణ

ఫ్లిప్‌కార్ట్‌ ఉత్పత్తుల వాపసు విధానాన్ని అర్థం చేసుకోవడంలో ఈ చిన్న కరదీపిక మీకు తోడ్పడుతుంది:
Flipkart product returns

ఫ్లిప్‌కార్ట్ ఉత్పత్తుల వాపసు విధానం ఇలా ఉంటుంది:

  1. ఫ్లిప్‌కార్ట్‌ లోకి ప్రవేశించి మీఆర్డర్లట్యాబ్‌కు వెళ్లండి.అభ్యర్థన
   నమోదుకు

వాపసుపై నొక్కండి లేదా క్లిక్‌చేయండి.

 • మీకు వర్తించేవాపసు కారణంఎంచుకోండి- దీన్నిబట్టి మీకు వర్తించే మార్పిడి ఎంపిక కనిపిస్తుంది. అక్కడ మూడురకాల ఎంపికలు ఉంటాయి:
  • బదులు: మీ ఆర్డర్‌లోని వస్తువుకు బదులు అదేవిధమైన మరో వస్తువును విభిన్నమైన పరిమాణం లేదా రంగులో ఎంచుకోవచ్చు
  • Replace:మీరు ఆర్డర్‌ చేసిన వస్తువు పాడై (విరిగి, చెడిపోయి) ఉంటే లేదా లోపంతో (పనితీరు సమస్య వల్ల పనికిరానిదిగా) ఉన్న పక్షంలో సదరు వస్తువు వంటి మరొక వస్తువుతో దాన్ని మార్చుకోవచ్చు.
  • సొమ్ము వాపసు: మీరెంచుకున్న ఉత్పత్తి మీకు నచ్చిన పరిమాణం లేదా రంగు లేదా నమూనాలో అందుబాటులో లేకపోయినా లేదా అది నిల్వలో లేకపోయినా మీ డబ్బును వాపసు తీసుకోవాలని మీరు నిర్ణయించుకోవచ్చు. ఇటువంటి పరిస్థితిలో మీరు వాపసు కింద మీ డబ్బు మీకు (6వ దశ చూడండి) తిరిగి ఇవ్వబడుతుంది
 • మీరు వాపసు చేయాలనుకున్న ఉత్పత్తి రకాన్ని బట్టి, మీ వాపసు అభ్యర్థన ధ్రువీకరణ ప్రక్రియను మీరు చేపట్టాల్సి
 • ధ్రువీకరణ అనంతరం మీరు ఆర్డర్‌ చేసిన ఉత్పత్తి రకాన్నిబట్టి మీ నిర్ణయాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది
 • వాపసు ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా బిల్లు, అసలు ప్యాకేజీ సామగ్రి, ధరల అట్టలు, ఉచితాలు, అనుబంధ వస్తువులు… అవసరమైనవన్నీ సిద్ధంగా ఉంచుకోండి.
 • వస్తువు మార్పిడి/బదులు విషయంలో మీరు ఆర్డర్‌ చేసిన ఉత్పత్తి స్వీకరణ, అందజేత ప్రక్రియను నిర్ధారించి, మీకు సమాచారం పంపబడుతుంది.
 • సొమ్ము వాపసు వర్తించేట్లయితే సదరు ప్రక్రియ ప్రారంభించబడుతుంది
 • ఫ్లిప్‌కార్ట్ వాపసు/మార్పిడిపై హామీ మేరకు మీ అభ్యర్థన నెరవేరుతుంది

 


ఫ్లిప్‌కార్ట్ ఉత్పత్తి వాపసు ప్రక్రియకు ఎంత సమయం పడుతుంది?

మీరు వాపసు అభ్యర్థన సమర్పించగానే మీ నమోదిత ఇ-మెయిల్ చిరునామాకు ఒక మెయిల్‌ సహా నమోదిత మొబైల్ ఫోన్ నంబరుకు సంక్షిప్త సందేశం (SMS) అందుతుంది. అలాగే మీరు ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ ఫోన్‌లో ‘మై అకౌంట్‌’లోకి వెళ్లి, ‘మై ఆర్డర్స్‌’పై క్లిక్ చేసి, పేజీని సందర్శించడం ద్వారా కూడా ఈ ప్రక్రియ ప్రగతి చూడవచ్చు. మీరు మార్పిడి కోరేట్లయితే చాలా సందర్భాల్లో మీ నుంచి వాపసు వస్తువును తీసుకెళ్లేటపుడే బదులు వస్తువు మీకు అందించబడుతుంది. మీ ఆర్డర్‌ ప్రగతిని
పరిశీలించడం
మరచిపోకండి.
ఇక్కడ క్లిక్‌ చేసి ఫ్లిప్‌కార్ట్‌ ఉత్పత్తుల వాపసు గురించి మరింత తెలుసుకోండి.


వివిధ రకాల ఉత్పత్తులపై ఫ్లిప్‌కార్ట్‌ ఉత్పత్తుల వాపసు విధానం తెలుసుకోండి

వాపసు అన్నది మీకు మార్పిడి మరియు/లేదా సొమ్ము వాపసు ఎంపికను కల్పించే దిశగా ఈ విధానం కింద సంబంధిత విక్రేతలు నేరుగా అందించే సదుపాయం.
మా విశ్వసనీయ ఖాతాదారుల పునాది దృష్ట్యా వాపసుల విధానంలో చాలా మార్పులు చేయబడ్డాయి. అయితే, ఒక చిన్న ముందస్తు మాట: నిర్దిష్ట కేటగిరీ కిందగల జాబితాలోని అన్ని ఉత్పత్తులకూ ఒకే విధమైన వాపసు విధానం వర్తించకపోవచ్చు.
మా వాపసు విధానాన్ని అర్థం
చేసుకోవడానికి 4 వర్గీకరణలను పరిగణనలోకి తీసుకోవాలి

 • 7 రోజులు

అన్ని ఎలక్ట్రానిక్స్ (పెద్ద ఉపకరణాలు, మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వగైరా) వస్తువలు, జీవనశైలి సంబంధిత కొన్ని నిర్దిష్ట వస్తువుల మార్పిడి కోసం మీరు వాటిని అందుకున్న 7 రోజుల్లోగా అభ్యర్థించవచ్చు. ఇక్కడ క్లిక్‌ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. నిర్దిష్ట బ్రాండ్‌ వస్తువుల విధానాల మేరకు ఉత్పత్తి లోపభూయిష్టంగా ఉంటే సమస్య పరిష్కారం కోసం సమీపంలోని అధీకృత సేవా కేంద్రాన్ని సంప్రదించాల్సిందిగా మేం మిమ్మల్ని కోరవచ్చు.

  • 10 రోజులు
    భారీ, ఫర్నీచర్‌ రకాల వస్తువులైతే మీరు అందుకున్న 10 రోజుల్లోగా మాత్రమే వాటి మార్పిడి కోసం మీరు అభ్యర్థించవచ్చు.

 

   • భారీ, ఫర్నీచర్‌ రకాల వస్తువులైతే మీరు అందుకున్న 10 రోజుల్లోగా మాత్రమే వాటి మార్పిడి కోసం అభ్యర్థించవచ్చు.

ఇక్కడ క్లిక్‌చేసి

   • మరిన్ని వివరాలు తెలుసుకోండి.

గమనిక:పైన పేర్కొన్న రెండు వర్గీకరణల కిందకు వచ్చే వస్తువులను మీరు వాడకుండా, పాడుకాకుండా, అన్ని అసలు ట్యాగులతో ఉంటేనే ఫ్లిప్‌కార్ట్‌ వాపసుల విధానం వర్తిస్తుందని గుర్తుంచుకోండి.

   • దయచేసి గమనించండి…

ఒకవేళ ప్యాకేజీతో నిమిత్తంలేని (ఓపెన్‌ బాక్స్‌) సరఫరా అయితే దాన్ని మీకు నేరుగా అందించిన తర్వాత పాడవడం/అందకపోవడం/పొరపాటు వస్తువు వంటి అభ్యర్థనలు అంగీకరించబడవు.

   • అటువంటి సందర్భాల్లో దయచేసి ఉత్పత్తిని ఇంటివద్ద అప్పటికప్పుడే పూర్తిగా తనిఖీ చేయండి.

    • వాపసు వీలుకాదు
      కొన్ని ఉత్పత్తుల వాపసు వీలుకాదు. ఈ జాబితాను

ఇక్కడ చూడండి.


ఉత్పత్తుల వాపసు – సాధారణ నేపథ్యాలు

మీ ఆర్డర్లు వాపసు, బదులు, మార్పిడి సదుపాయం లేదా సొమ్ము వాపసుకు ఎప్పుడు అర్హమవుతాయి?
ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోళ్ల సమయంలో మెరుగైన సమాచారంతో అవగాహన పొంది, ఉత్పత్తులను నిశ్చింతగా ఎంపిక చేసుకునేందుకు వీలుగా కొన్ని నేపథ్యాలను పరిశీలించండి.

      • మీరు ఆర్డరు చేసిన వస్తువు పాడైనపుడు, లోపభూయిష్టమైనపుడు, ప్యాకింగ్‌ తెరచినట్లు తేలినపుడు

Flipkart product returns
మొట్టమొదట మీరు ఆర్డర్ చేసిన ఉత్పత్తి అందుకోగానే ఏదైనా నష్టం జరిగిందేమో తనిఖీ చేయండి. కొన్ని సందర్భాల్లో రవాణా, ఎక్కించడం/దించడంలో పొరపాట్లు వగైరాల వల్ల ప్యాకేజీ దెబ్బతిన్నట్లు కనిపించవచ్చు. కానీ, అందులోని ఉత్పత్తికి ఏ నష్టమూ కలగకపోవచ్చు. అయితే, మీ ప్యాకేజీ మరొకదానితో తారుమారైందని లేదా ఉత్పత్తి సంబంధిత పెట్టెలో సరిగ్గా సీల్ చేయబడలేదని గమనిస్తే మీరు అప్పటికప్పుడే ఆర్డర్‌ను నిరాకరించవచ్చు. ఒకవేళ మీరు ప్యాకేజీని తీసుకున్న తర్వాత ఈ పరిస్థితిని గమనిస్తే వాపసు అభ్యర్థన పంపవచ్చు. వాపసు అభ్యర్థన ఏ వర్గీకరణకు వస్తుందో తెలుసుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్ లేదా డెస్క్‌ టాప్ సైట్‌లోని మీ ఆర్డర్ల ట్యాబ్‌పై క్లిక్ చేయండి. అక్కడ వాపసును ఎంచుకుని, సదరు ప్రక్రియ తదుపరి దశలకు వెళ్లండి. ఆ తర్వాత ఫ్లిప్‌కార్ట్ ఉత్పత్తుల వాపసు బృందం తనవంతు బాధ్యతను స్వీకరిస్తుంది.
మీరు ఆర్డర్‌ చేసిన ఉత్పత్తి వర్గీకరణను బట్టి మీరు మార్పిడి లేదా సొమ్ము వాపసును ఎంపిక చేసుకోవచ్చు.

    • ఊహించని సైజు, రంగు లేదా శైలి

Flipkart product returns
మీరు ఒక జత రన్నింగ్ షూ ఆర్డర్ చేసి, అవి అందిన తర్వాత మీకు సరిపోవని తెలుసుకున్నారా? మరేం పర్వాలేదు… మీ ఫ్లిప్‌కార్ట్ ఖాతాలోకి ప్రవేశించి, ‘మై ఆర్డర్స్’ ట్యాబ్‌కి వెళ్లి, ‘రిటర్న్స్‌’పై క్లిక్ చేయండి. అక్కడ ‘సైజ్ ఇష్యూ’ (సమస్య) కారణం ఎంపిక కింద ‘మార్పిడి’ని ఎంచుకోండి. ఇలాంటి సందర్భాల్లో సైజు సరిపోనపుడు లేదా ఉత్పత్తి రంగు నచ్చని పక్షంలో ‘మార్పిడి’ మీకు ఒక ఎంపిక కాగలదు.

    • నిల్వలో లేని ఉత్పత్తుల విషయంలో వాపసు, మార్పిడి

Flipkart product returns

     • మీరొక టీ-షర్టు ఆర్డర్ చేసి తెప్పించుకున్న తర్వాత అది సరిపోవడం లేదని తెలిసిందా? అయితే, దాన్ని మార్పిడి చేసుకోవడానికి మరొకటి మీకు తగిన సైజులో లేకపోతే ఏంచేయాలి?

 

     • మీరు ‘మై ఆర్డర్‌’ ట్యాబ్ నుంచి సదరు టీ-షర్టుకు చెల్లించిన సొమ్మును పూర్తిగా వాపసు పొందవచ్చు. వాస్తవానికి మీరు జీవనశైలి వర్గంలోని ఉత్పత్తులలో దేనికోసం ఆర్డర్ చేసినా వాపసు పొందవచ్చు.

 

     • కానీ, మీకు సరిపడే సైజులోగల అదేరకం టీ-షర్టును మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లయితే, అది తిరిగి స్టాక్‌లోకి వచ్చినప్పుడు సమాచారం పొందాలని మీరు భావిస్తున్నారనుకుందాం. అలాంటప్పుడు ‘నోటిఫై మి’ (Notify Me) ఎంపికపై క్లిక్ చేయండి. మీకు నచ్చిన టీ ఫ్లిప్‌కార్ట్‌ లో విక్రేతవద్ద అందుబాటులోకి రాగానే మీకు సమాచారం అందుతుంది. ఆ విధంగా మీకు నచ్చినవి కచ్చితంగా కొనుగోలు చేసేందుకు మరొక అవకాశం కూడా ఉంటుంది.

      • మీరు ఆర్డర్‌ చేసింది ఒకటైతే మరేదో వచ్చింది

Flipkart product returns
అంటే- మీరు మీ ‘మోటో జి’ ఫోన్‌ కోసం ‘కెప్టెన్ అమెరికా మొబైల్ కవర్‌’ ఆర్డర్ చేశారు. కానీ, కానీ మీకందిన ప్యాకేజీలో ‘బంగారు రంగు ఐఫోన్ కవర్’ వచ్చింది. సాధారణంగా ఇలా జరగడం అరుదు… కానీ, అలాంటి సందర్భాల్లో వాపసు కోసం తక్షణమే అప్రమత్తం చేయాలి.
ఆ మేరకు వాపసు అభ్యర్థన సమర్పించాక, మా వస్తు ప్రదాన (డెలివరీ) సిబ్బంది సదరు ఉత్పత్తిని స్వీకరించి, మీరు ఆర్డర్ చేసిన మేరకు కచ్చితమైన ఉత్పత్తిని బదులుగా అందజేస్తారు. అయితే, మీరు ఉత్పత్తి కొనే సమయంలో సంబంధిత పేజీలోగల వాపసుల విధానాన్ని తప్పక చదవాలన్నది గుర్తుంచుకోండి.
అన్ని వాపసులూ ఫ్లిప్‌కార్ట్ మార్పిడి హామీకి లోబడి ఉంటాయి.

      • li>

మీకు సొమ్ము వాపసు కావాలంటే

Flipkart product returns
వస్తు మార్పిడితో మీరు సంతృప్తి చెందకపోతే లేదా మీకు నచ్చిన నిర్దిష్ట ఉత్పత్తి లేదా నమూనా నిల్వలో లేకపోతే మా ఖాతాదారు సహాయక బృందం సొమ్ము వాపసును ఎంచుకోమని మీకు సూచించవచ్చు.
అలాంటప్పుడు మీరు ‘మై ఆర్డర్స్‌’ పేజీలోని వివరాలను పూరించి, సొమ్ము వాపసు అభ్యర్థన ఎంపికను క్లిక్‌ చేయండి. ఇది ఆమోదం పొందిన తర్వాత మీ సొమ్ము వాపసు ప్రక్రియ చేపట్టబడుతుంది. అటుపైన మీ డబ్బు మూడు పద్ధతులలో ఏదైనా ఒకదాని ప్రకారం మీ ఖాతాకు తిరిగి జమ చేయబడుతుంది:

      1. మీరు వస్తువు అందాక చెల్లింపు పద్ధతిలో చెల్లింపు చేసి ఉంటే ‘ఐఎంపిఎస్‌’ (IMPS) ద్వారా బదిలీ చేయబడుతుంది
      2. మీరు ఆర్డర్ కోసం చెల్లించిన పద్ధతిలోనే సొమ్ము తిరిగి వాపసు (బ్యాక్ టు సోర్స్ అంటారు) అవుతుంది. ఉదాహరణకు॥ మీరు ‘హెచ్‌డిఎఫ్‌సి’ డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించి ఉంటే మీ వాపసు సొమ్ము మళ్లీ అదే ఖాతాకు జమ చేయబడుతుంది.
      3. వాపసు అభ్యర్థన సమయంలో మీరు పేర్కొన్న బ్యాంక్ ఖాతాలోకి ‘ఐఎంపిఎస్‌’ ద్వారా, సొమ్ము వాపసును తిరిగి (మూలఖాతాలోకి) తీసుకునే బదులు బ్యాంకు ఖాతాలోకి జమ చేయాలని ఎంచుకోవచ్చు. (ఇందుకు డెబిట్ కార్డ్/నెట్‌బ్యాంకింగ్ ఫార్వర్డ్ చెల్లింపుల విధానం అందుబాటులో ఉంది).
      4. ఆమోదయోగ్య లావాదేవీల కోసం మీరు మీ వాపసు మొత్తాలను తిరిగి ఫ్లిప్‌కార్ట్‌ ‘ఈజీవీ’లకు బదిలీ చేయవచ్చు.
       .
      • ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేసిన ఏదైనా ఉత్పత్తి నిర్దిష్ట హామీ గడువులోగా పనిచేయని పక్షంలో

విక్రేతల వాపసు విధానం, సదరు ఉత్పత్తి వర్గం ఆధారంగా నిర్దిష్ట వ్యవధిలోగా ఫ్లిప్‌కార్ట్ మార్పిడి హామీ వర్తిస్తుంది. అందువల్ల ఉత్పత్తి సమాచారంగల పేజీలో మొదట మార్పిడి హామీ వ్యవధిని ఒకసారి సరిచూసుకుని, ‘వాపసు లేదా మార్పిడి’ కోరడం ముఖ్యమైన అంశం.
మీరు ఆర్డర్ చేసిన ఉత్పత్తులు నిర్దిష్ట హామీ గడువు దాటిన తర్వాత పనిచేయకపోయినా, వాటిలో ఏవైనా లోపాలను మీరు గమనించినా సాధారణంగా చిల్లర విక్రేతల వద్ద కొనుగోలు చేసే ఉత్పత్తుల తరహాలోనే మీ నగరంలోని సంబంధిత కంపెనీల ఆమోదంగల సేవా కేంద్రాలను సంప్రదించాల్సి ఉంటుంది.
ఈ వ్యాసం చదివిన తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో ఉత్పత్తుల వాపసు ప్రక్రియ మరింత సులభమనే అవగాహన మీకు కలిగి ఉంటుందని మేము భావిస్తున్నాం. మీకింకా సందేహాలుంటే ఫ్లిప్‌కార్ట్‌ ఉత్పత్తుల మార్పిడి, వాపసు ప్రక్రియపై ‘ఎఫ్‌ఏక్యూ’లను పూర్తిగా, శ్రద్ధగా చదవాలని మా విజ్ఞప్తి.


ఇంకా సందేహాలున్నాయా?ఇక్కడ క్లిక్‌ చేయండి ఫ్లిప్‌కార్ట్‌తో మరింత మీ సన్నిహిత సంబంధాల కోసం సమాచారం తెలుసుకోండి
సమాచార గ్రాఫిక్‌ చిత్రాల రూపకర్త సాధనా ప్రసాద్‌|ఫ్లిప్‌కార్ట్‌ స్టోరీస్‌

Enjoy shopping on Flipkart