సమాజంలోని వెనుకబడిన వర్గాల కోసం ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో అట్టడుగు స్థాయి కార్యక్రమాలను కొనసాగించడానికి 2022లో ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్ ప్రారంభించబడింది. ఇది దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఆన్-గ్రౌండ్ కార్యకలాపాలతో ప్రజలను చైతన్యవంతం చేస్తున్నందున, ప్రభావవంతంగా పని చేస్తున్న బహుళ NGOలతో కలిసి పని చేయడం ప్రారంభించింది. వైకల్యం ఉన్న పిల్లలకు మద్దతు ఇవ్వడం నుండి వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు సాధికారత కల్పించడం వరకు, ఈ కార్యక్రమాలు భారతదేశంలోని వేలాది మంది ప్రజల జీవితాలను మారుస్తున్నాయి. అలా చాలామంది జీవితంలో మార్పులను తీసుకొచ్చిన కొన్ని ఫలవంతమైన సహకారాలను ఇక్కడ చూడండి.
Aమా సంస్థ ద్వారా చేపట్టే సామాజిక కార్యకలాపాల్లో సమాజానికి తిరిగి ఇవ్వడం, వ్యక్తులను శక్తివంతులుగా చేయడమే ప్రధాన ధ్యేయం. ఈ ప్రయత్నాలను సంస్థాగతీకరిస్తూ ‘భారతదేశాన్ని కలిసి నిర్మించడానికి’ ఫ్లిప్‌కార్ట్ భారతదేశంలో సమ్మిళిత, సమానమైన, సాధికారత మరియు స్థిరమైన సమాజాన్ని సులభతరం చేసే దృష్టితో 2022లో ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్‌ను స్థాపించింది.
ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్ గురించి మరింతగా తెలుసుకునేందుకు ఇది చూడండి.:
గడిచిన ఏడాది కాలంగా అట్టడుగు స్థాయి నుంచి మార్పు తీసుకురావడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్ పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలోని 5 నమ్మకమైన సహాయక సంఘాలతో పాటూ గివ్ ఫౌండేషన్‌తో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ఆశ్రయ్ ఆకృతి, శ్రామిక భర్తీ, , ముక్తి, , దీపాలయ మరియు ఆర్తి ఫర్ గర్ల్స్ అనేవి మాతో భాగస్వాములైన స్వయం సహాయక సంఘాలు. ఇవి సమాజంలోని అణగారిన వర్గాలలో స్థిరమైన మార్పుకు మార్గం సుగమం చేసే దిశగా కృషి చేస్తున్నట్లు గుర్తించబడ్డాయి.
ఆశ్రయ్ ఆకృతితో అందరి భవిష్యత్తు కలిసే ఉంటుంది
1996లో ప్రారంభమైన ఆశ్రయ్ అకృతి, అట్టడుగు వర్గాలకు చెందిన వికలాంగ పిల్లల అవసరాలపై దృష్టి సారిస్తుంది. ప్రారంభం అయిన తొలిదశ నుండి ఇప్పటివరకు ఈ సంస్థ 250 మంది వినికిడి లోపం ఉన్న పిల్లలను ప్రధాన కళాశాలలు, పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో చేరేలా చేసింది
2022లో, ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్, తెలంగాణలోని హైదరాబాద్‌లోని ఆశ్రయ్ అకృతి యొక్క శ్రీనగర్ కాలనీ బ్రాంచ్‌లోని విద్యార్థులకు 3 నెలల పాటు స్పీచ్ థెరపీ మరియు ఆడిటరీ ట్రైనింగ్ యాక్సెస్‌తో పాటు వినికిడి పరికరాలను అందించడానికి NGOతో కలిసి పనిచేసింది. ఈ ట్రైనింగ్ మధ్యలో ఉన్న సమయంలోనే, ఇందులో పాల్గొన్నవారు కోర్స్‌లో గణనీయమైన పురోగతిని కనబరిచారు. వారి రోజువారీ కమ్యూనికేషన్‌ను నావిగేట్ చేయడానికి తగ్గట్లుగా మెరుగ్గా సన్నద్ధమయ్యారు.
‘‘మేము Give భాగస్వామ్యంతో ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్ ద్వారా మాకు అవసరమైన మద్దతు పొందాము. ఆశ్రయ్ అకృతిలోని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మేం విరాళంగా అందించిన 9 వినికిడి పరికరాలు వారి జీవితంలో నిజంగా భారీ మార్పును తెచ్చిపెట్టింది’’ అన్నారు ఆశ్రయ్ ఆకృతికి చెందిన ప్రొగ్రామ్స్ మేనేజర్ అనుదా నందం. ‘‘ఫ్లిప్‌కార్ట్ నుంచి వినికిడి పరికరాలు అందుకున్నందుకు విద్యార్థులు చాలా సంతోషించారు. అవి వారి స్పీచ్‌కి మాత్రమే కాదు.. అకడమిక్స్‌కి కూడా బాగా ఉపయోగపడతాయి.’’
యాక్సెస్ మరియు అవకాశం ; హర్షవర్ధిని కథ
హర్షవర్ధిని తండ్రి, సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. వారి కుటుంబంలో సంపాదిస్తున్న ఏకైక సభ్యుడు ఆయనే. హర్షవర్థిని తల్లి వారి ఇంటిల్లిపాదినీ సంరక్షిస్తుంటుంది. ఆశ్రయ్ అకృతిలో వినికిడి సహాయాన్ని పొందిన అనేక మంది విద్యార్థులలో ఆమె ఒకరు. మంచి అవకాశాల కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిన వారి కుటుంబానికి హర్షవర్ధిని రోగ నిర్ధారణ ఒక పెద్ద సవాలుగా మారింది.
పాఠశాలలో, వికలాంగ పిల్లలకు వనరుల కొరత ఏర్పడింది. దాంతో హర్షవర్ధిని తరచుగా ఎప్పటికప్పుడు చదువుకుంటూ సరైన ట్రాక్‌లో ఉండటం చాలా కష్టమైంది. వైకల్యాలున్న పిల్లల కోసం ఆశ్రయ్ అకృతి చేస్తున్న పని గురించి ఆమె తల్లిదండ్రులు తెలుసుకున్నప్పుడు, వారు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఈ రోజు, హర్షవర్ధిని తన జీవితాన్ని నెమ్మదిగా అలవాటు చేసుకుంటోంది. తనకు లభించిన చక్కని యాక్సెసబిలీటీ ద్వారా కొత్త కొత్త అవకాశాలు రోజూ ఆమెను పలకరిస్తున్నాయి.
శ్రామిక్ భారతితో వ్యవసాయం చేసే సహజ మార్గం
శ్రామిక్ భారతి 1986లో ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్‌లలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. అప్పటి నుండి సమాజంలోని గ్రామీణ మరియు పట్టణ వెనుకబడిన వర్గాలతో చురుకుగా పని చేస్తోంది. 2015 నుండి, వారు రైతులను సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుండి సహజ వ్యవసాయ పద్ధతులకు మార్చడంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటి వరకు, లాభాపేక్ష లేని ఈ సంస్థ కనీసం 5,000 మంది రైతులను సహజ వ్యవసాయ పద్ధతులను విజయవంతంగా అవలంబించేలా చేసింది.
వెనుకబడిన వారికి జీవనోపాధి అవకాశాలను సృష్టించే ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్ యొక్క ప్రధాన లక్ష్యంతో సన్నిహితంగా, ఫౌండేషన్ సహకారం కోసం శ్రామిక్ భారతిని సంప్రదించింది. ఫలితం “ది సేఫ్ ఫుడ్ ఫెస్ట్ మరియు ఎగ్జిబిషన్”, లక్నోలోని బృందావన్ కాలనీలో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గ్రామీణ మరియు వెనుకబడిన వర్గాల నుండి 1,000 మంది రైతులు, ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో మహిళలు సహజ ఉత్పత్తులను విక్రయించడానికి ఈ ప్రదర్శనను నిర్వహిస్తారు.
‘‘కార్యక్రమం విజయవంతమైంది. ఇది సహజ రైతులు (రైతు ఉత్పత్తిదారుల సంస్థల క్రింద నిర్వహించబడింది) పట్టణ వినియోగదారులతో అనుసంధానం అవ్వడానికి; అలాగే వారు నైతికంగా, సురక్షితమైన పద్ధతులలో పండించిన ఆహారాన్ని గృహిణులు, నాయకులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు మరియు ఇతరుల ముందు ప్రదర్శించడానికి సహాయపడింది’’ అని ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ నీల్మని గుప్తా అన్నారు. ‘‘ఆహారం, వ్యవసాయ మరియు సహజ వ్యవసాయ నిపుణులచే చేపట్టిన అవగాహన సదస్సుల ద్వారా పట్టణ ప్రాంతాల్లోనూ సురక్షితమైన ఆహారం గురించి అవగాహన కల్పించాయి.’’
ఎదుగుదల అనే విత్తనాలు నాటుదాం – రామ్ కుమారి కథ
2016లో, కాన్పూర్‌లోని శివరాజ్‌పూర్‌లోని ఛబ్బా నివాడ గ్రామానికి చెందిన రామ్ కుమారి, ప్రముఖ వ్యవసాయదారుడు సుభాష్ పాలేకర్ నిర్వహించిన శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. రసాయన లేదా సేంద్రియ ఎరువును ఉపయోగించకుండా పంటలను పండించే సహజ వ్యవసాయానికి ఇదే ఆమెకు పరిచయంగా మారింది. దీని తరువాత, రామ్ కుమారి మరియు ఆమె భర్త ఒక చిన్న భూమిలో రాంభోగ్ అనే ప్రీమియం వరి రకాన్ని పెంచడం ప్రారంభించారు. ఇదే వారికి తగిన గుర్తింపు ఇచ్చిందని చెప్పచ్చు!
నేడు, రామ్ కుమారి ఏక్తా నేచర్ ఫార్మింగ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌లో భాగం, ఇక్కడ 600 మంది మహిళా రైతులు సహజ వ్యవసాయ ఉత్పత్తులను సమీకరించి, ప్రాసెస్ చేసి విక్రయిస్తున్నారు. శ్రామిక్ భారతి మరియు ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల ఫెస్ట్‌లో ఆమె పంట ఉత్పత్తులు విజయవంతంగా ప్రదర్శించబడతాయి మరియు విక్రయించబడతాయి.
ముక్తిలో మొక్కలను పెంచడం అంటే వెనుకబడిన వారికి సాధికారత అందించినట్లే
2003 నుండి క్రియాశీలంగా ఉన్న ముక్తి అనే సంస్థ ప్రధానంగా సుందర్‌బన్స్ డెల్టా ప్రాంతం మరియు పశ్చిమ బెంగాల్‌లోని 10 ఇతర జిల్లాలలో పనిచేస్తున్న ఒక ప్రముఖ సామాజిక-ఆర్థిక సంస్థ.
అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలు తమ జనపనార ఉత్పత్తుల ద్వారా స్థిరమైన జీవనం సాగించేందుకు వీలుగా ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్ ముక్తితో చేతులు కలిపింది. “హస్త్‌శిల్ప్ – లెట్స్ గో గ్రీన్ విత్ ముక్తి, ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్” అనే NGO జూలై 2022లో కోల్‌కతాలోని న్యూ టౌన్, జత్రాగచిలో ప్రారంభమైంది. ఈ సమయంలో 24 మంది మహిళలకు జనపనార బొమ్మల తయారీ మరియు చెప్పుల తయారీ ప్రక్రియలలో శిక్షణ ఇచ్చారు. జనపనార పశ్చిమ బెంగాల్‌లో విస్తృతంగా లభ్యం కావడం మాత్రమే కాదు.. అది పర్యావరణానికి చాలా అనుకూలమైనది కూడా. అందుకే జనపనార గ్రహం యొక్క సుస్థిరతకు దోహదపడుతుంది.
‘‘ముక్తి వద్ద మేము ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్‌తో భాగస్వామిగా ఉండటం గొప్ప అవకాశంగా మరియు గౌరవంగా భావిస్తున్నాము. అలాగే అనేకమంది అణగారిన మహిళలు, ముఖ్యంగా ఇంటి పని చేస్తున్నవారు, గృహిణులు లేదా ఆర్థిక అవరోధాలు ఎదుర్కొంటున్న మహిళల జీవితాల్లో కోరుకున్న మార్పును ఇది తీసుకువస్తుందని ఆశిస్తున్నాము. ఈ కార్యారంభం వారిని స్వావలంబనగా దిశగా అడుగులు వేసేలా చేయడమే కాకుండా; వారి కుటుంబాన్ని వారే పోషించుకునేలా చేస్తుంది’’ అన్నారు అంకిత కొతియల్, CSR లీడ్, ముక్తి.
స్వయం సమృద్ధి అన్నింటికంటే ముఖ్యమైంది – ఝుమా కథ
తన బిడ్డ తీవ్ర అస్వస్థతకు లోనైనప్పుడు, ఝుమా తన భర్త యొక్క అస్థిర ఆదాయంపై మాత్రమే ఆధారపడలేనని గ్రహించింది. ఈ క్రమంలోనే స్వయం సమృద్ధి సాధించడానికి మార్గం కోసం వెతుకుతున్నప్పుడు, కోల్‌కతాలోని న్యూ టౌన్‌కు చెందిన ఝుమా, పొరుగువారి సిఫార్సు ద్వారా ముక్తి గురించి తెలుసుకుంది. NGO మరియు ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్ నిర్వహించిన హస్త్‌శిల్ప్ కార్యక్రమం ఆమె జూట్ బొమ్మల తయారీలో నైపుణ్యాన్ని నేర్చుకునేలా చేసింది. ఆమె ఫెయిర్‌లో 16 బొమ్మలను విక్రయించడంతో ఈ క్రాఫ్ట్‌లోనే తన వృత్తిని కొనసాగించడానికి ఆమెను ప్రేరేపించడానికి సరిపోతుంది. ఇప్పుడు, ఝుమా తన కొత్త వ్యాపారాన్ని ముక్తితోనే ప్రారంభించాలని యోచిస్తోంది.
కొత్త కలలను దీపాలయతో నిర్మించుకోండి
1979లో స్థాపించబడిన లాభాపేక్షలేని సంస్థ దీపాలయ. నిరుపేద పిల్లలకు విద్య ద్వారా సాధికారత కల్పించడంపై దృష్టి సారించే లక్ష్యంతో ఇది ప్రారంభితమైంది. ప్రస్తుతం, వెనుకబడిన వర్గాల నుండి మహిళలు, యువత మరియు వికలాంగులైన పిల్లలను చేర్చడానికి సంస్థ విస్తరించింది.
హర్యానాలోని గురుగ్రామ్‌లోని అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలు సబ్బు తయారీ వృత్తిని నేర్చుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్ NGOతో కలిసి పనిచేసింది. గురుగ్రామ్‌లోని సోహ్నా గ్రామానికి చెందిన సుమారు 50 మంది మహిళలు ఈ కార్యక్రమానికి ఎంపికయ్యారు. కార్యక్రమం ముగింపులో, సమాజంలోని ఇతర మహిళలకు నైపుణ్యాలను అందించడానికి బాధ్యత వహించే స్వయం సహాయక బృందాలను (SHGs) ఏర్పాటు చేయడానికి మహిళలు కలిసి ఉన్నారు.
‘‘ఈ శిక్షణా కార్యక్రమం స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా మహిళా సాధికారత పరిధిని విస్తృతం చేస్తుంది” అని దీపాలయ రిసోర్స్ మొబిలైజేషన్ ఆఫీసర్ జ్యోతి చెప్పారు. వారం మొత్తం వర్క్‌షాప్‌లో మహిళలు హెర్బల్ సోప్ తయారీని నేర్చుకునే అవకాశం లభించింది. సోహ్నాకు చెందిన రాణి అనే ఒక విద్యార్థి 10 మంది సభ్యులతో ఒక SHGని ఏర్పాటు చేసింది. వారితో కలిసి త్వరలోనే తన స్వంత వ్యాపారాన్ని ప్రారంభించనుంది. వీరంతా ఇంట్లోనే హెర్బల్ తయారీ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నారు మరియు ఇంట్లో హెర్బల్ సబ్బులు తయారు చేస్తున్నారు.
హర్యానాలో కాజల్ తాజా అవకాశాలు మరియు విజయం
సోహ్నా గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లల తల్లి అయిన 23 ఏళ్ల కాజల్ కోసం, సబ్బు తయారీ కార్యక్రమం క్లిష్ట సమయంలో వచ్చింది. ఆమె భర్త, అమ్మకందారుడు. అతని తల్లిదండ్రులతో సహా 6 మందితో కూడిన వారి కుటుంబానికి ఏకైక పోషకుడు. వారికి మద్దతుగా కాజల్ వర్క్ షాప్ ట్రై చేసింది. ఆమె కొత్తగా సంపాదించిన నైపుణ్యంతో, కాజల్ ఇప్పుడు రోజుకు 20 సబ్బులను తయారు చేస్తుంది, వాటిని తన పరిసరాల్లోని వ్యక్తులకు విక్రయిస్తుంది. ఆమె సంపాదించిన నైపుణ్యాలతో తన స్వంత చిన్న వ్యాపారాన్ని తెరవాలని ఆమె కలలు కంటుంది.
ఆరోగ్యకరమైన భవిష్యత్తు దిశగా ఆర్తి ఫర్ గర్ల్స్
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విజయ్ ఫౌండేషన్ ట్రస్ట్ (అసోసియేషన్), ఆర్తి ఫర్ గర్స్‌గా ప్రసిద్ధి చెందింది. వదిలివేయబడిన ఆడపిల్లలకు ఆశ్రయం కల్పిస్తుంది మరియు రాష్ట్రంలోని అణగారిన వర్గాల మహిళలు మరియు బాలికల అవసరాలను చురుకుగా అందిస్తోంది.
ఋతుక్రమం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత; కార్యక్రమం మీద అవగాహన కల్పించడంలో సహాయం చేయడానికి ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్ NGOతో చేతులు కలిపింది. కడపలోని ఆర్తి ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో ఋతు పరిశుభ్రత నిర్వహణపై అవగాహన కల్పించడం (ఎంహెచ్‌ఎం) కార్యక్రమం, గ్రామీణ మహిళలు మరియు బాలికలను సర్వే చేశారు.
చాలా మంది గ్రామీణ మహిళలు తమ కుటుంబాలు మరియు ప్రియమైనవారితో రుతుస్రావం సంబంధిత సమస్యలను చర్చించడం కష్టమని, చక్కగా ఋతుక్రమ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రతపై అవగాహన లేదని ముందస్తు సర్వేలో తేలింది. కార్యక్రమం, సులభతరంగా డాక్టర్. టి వింధ్య, MD మరియు ప్రసూతి మరియు గైనకాలజిస్ట్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షురాలు, మహిళలకు రుతుక్రమ పరిశుభ్రతపై వెలుగునిచ్చింది. ఒక నెల తర్వాత నిర్వహించిన పోస్ట్-అవేర్‌నెస్ సర్వేలో, పాల్గొన్నవారు ఆ అంశాన్ని చక్కగా అర్థం చేసుకోవడంతో పాటు లోతైన అవగాహన గురించి కూడా మాట్లాడారు.
రుతుక్రమ పరిశుభ్రత ప్రాముఖ్యతను డాక్టర్ వింధ్య ఈ సందర్భంగా ఎత్తిచూపారు. ఋతుస్రావంతో ముడిపడి ఉన్న అపోహలు మరియు మూఢనమ్మకాలను ఆమె వివరించారు. దీని కారణంగా చాలా మంది బాలికలు పాఠశాల నుండి తప్పుకుంటున్నారు,
సునీల్‌కాంత్ రాచమడుగు, కన్సల్టెంట్, ఆర్తి ఫర్ గర్స్
మెన్స్ట్రుయేషన్ చుట్టూ గల మూఢనమ్మకాల వివరణ
18 ఏళ్ల నిర్మల (పేరు మార్చబడింది) బహిష్టు గురించిన సామాజిక నిషిద్ధాలు మరియు అపోహల కారణంగా పాఠశాలకు హాజరవడం నుండి ఆహార పదార్థాలను తాకడం వరకు నిషేధించబడింది – నిర్మల మరియు ఆమె తల్లి ఋతుస్రావం గురించి చాలా మంది ఇతరుల మాదిరిగానే ఋతుక్రమాన్ని విశ్వసించారు. అలాగే దానిని శాపంగానూ పరిగణిస్తారు.
ఈ అవగాహన కార్యక్రమం నిర్మల మరియు ఆమె తల్లి ఋతుస్రావం చుట్టూ ఉన్న అనేక అపోహల పై అందరికీ అవగాహన కల్పించారు. అలాగే వారు జ్ఞానం అనే సంపదను పొందారని వారు చెప్పారు.
వెనుకబడిన వారికి సాధికారత కల్పించడానికి మరియు మెరుగైన భారతదేశాన్ని నిర్మించడానికి, ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్ బలమైన, అధిక ప్రభావ కార్యక్రమాలను రూపొందిస్తుంది. సంఘంలో అవిశ్రాంతంగా పని చేసే వివిధ NGOలతో సహకారాలు, ఫౌండేషన్ గరిష్ట స్థాయిలో ప్రభావాన్ని సృష్టిస్తుంది మరియు కలుపుకొని సామాజిక అభివృద్ధితో ముందుకు నడిపిస్తుంది.
మరిన్ని కథలను ఫ్లిప్‌కార్ట్ నుంచి ఇక్కడ చదవండి