ఫ్లిప్‌కార్ట్ కిరాణా కార్యక్రమం సమ్మిళిత వృద్ధిని.. సౌలభ్యాన్ని ఎలా ప్రోత్సహిస్తోంది?

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | ગુજરાતી | मराठी

కిరాణా దుకాణాలు తరతరాలుగా భారతీయ చిల్లర వ్యాపార వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయి. ‘మా తరంలో కేవలం కొన్ని అణాలకే నెలవారీ సరుకులు వచ్చేవి తెలుసా?’ అంటూ ఈ దుకాణాల గురించి మన తాతలు తమ జ్ఞాపకాలను కథలుకథలుగా చెప్పడం మనకు తెలిసిందే. ఇప్పుడు కొంతమంది పెద్దలు మాత్రమే గుర్తుంచుకునే కరెన్సీ. ఇప్పుడు కొందరు పెద్దలకు మాత్రమే ఈ నాణేల గురించి తెలిసి ఉంటుంది. నేటికీ దేశంలోని మహా నగరాలుసహా అతి చిన్న గ్రామాల్లోనూ విస్తరించిన ఈ కిరాణా దుకాణాలు భారత చిల్లర వ్యాపార చరిత్రలో ఒక భాగం. ఈ నేపథ్యంలో దుకాణ యజమానులు, వినియోగదారుల అనుసంధానంతో సమగ్ర వృద్ధి సాధించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిరకాల సంస్థల బలాన్ని మిళితం చేసేదే ఫ్లిప్‌కార్ట్ కిరాణా కార్యక్రమం. ఇందులో భాగంగా దేశంలోని మా కిరాణా భాగస్వాములలో ఓ నలుగురి జీవితానుభవాలను ఇక్కడ చదవండి.

Flipkart Kirana Program Story

కిరాణా దుకాణాలు కుటుంబం నిర్వహణలో నడిచే సంస్థలు మాత్రమేగాక భారతదేశంలో అత్యంత విశ్వసనీయ చిల్లర వ్యాపార రూపాల్లో ఒక భాగం. ఒక విధంగా తమ దుకాణాలున్న ప్రాంతంలో అక్కడి ప్రజల అవసరాల మేరకు సరకుల నిర్వహణ, కొనుగోళ్ల సదుపాయాలను తొలిసారి కల్పించింది వీటి యజమానులే. తమ ఖాతాదారుల అభిరుచులు, అవసరాలను చక్కగా అర్థం చేసుకుని, అందుకు తగినట్లు సరకులు సదా అందుబాటులో ఉంచుతూ వారి విశ్వాసం పొందారు.

భారతదేశంలో ఇంటర్నెట్ లభ్యత పెరిగిన కారణంగా జనాభాలో 100 కోట్లమందికిపైగా ప్రజానీకం కొనుగోలు అలవాట్లు కూడా వృద్ధి చెందాయి.

దేశంలోని పురాతన చిల్లర వ్యాపార రూపాల్లో ఒకటైన కిరాణా దుకాణాల వ్యవస్థను ‘ఇ-కామర్స్‌’ వేదికతో సంధానించేందుకు 2019లో ఫ్లిప్‌కార్ట్‌ కిరాణా కార్యక్రమం ప్రారంభించబడింది. వారు తమ దుకాణాలను విజయవంతంగా నిర్వహిస్తూనే ఉన్నారు. వీటిలో మామ్ అండ్ పాప్, దర్జీ, బేకరీ, కిరాణా దుకాణాల వంటివి వీటిలో భాగంగా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ కిరాణా భాగస్వాములుగా వీరందరికీ ఈ కార్యక్రమం అనుబంధ ఆదాయార్జనకు తోడ్పడుతుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ ఖాతాదారులు ఈ కార్యక్రమం ద్వారా తమకు అవసరమైన ఉత్పత్తులను సురక్షితంగా, సౌకర్యవంతంగా కొనుగోలు చేసే వీలుంటుంది.

అవసరాలు తీర్చేందుకు ఆపసోపాలు పడాల్సి వస్తోందా

త్తరాఖండ్‌లో ఎటుచూసిన పచ్చదనం ఉట్టిపడే డెహ్రాడూన్‌ నగరంలో గౌరవ్‌ రాహి, ఫైజాన్‌ సిద్ధిఖీ ఫ్లిప్‌కార్ట్ కిరాణా భాగస్వాములుగా ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్ సాంకేతిక పరిజ్ఞానం తమ కుటుంబాలకు జీవన సౌలభ్యం కల్పించడమేగాక తమ చుట్టూ ఉన్న వారికి తమను సదా అందుబాటులో ఉంచుతున్నాయని వారు సగర్వంగా చెబుతున్నారు. దేశంలో ఏ ప్రాంత వస్తువైనా తమ ఇళ్లకు చేరుతుండటంపై ఖాతాదారులలో సంతోషం చూసినప్పుడు తమకు ఎనలేని సంతృప్తి కలుగుతుందని వారంటున్నారు.

“ఫ్లిప్‌కార్ట్‌ కిరాణాఅంటే విజయానికి తొలిమెట్టు”అని గౌరవ్‌ చెబుతారు.

Flipkart Kirana Program Story Gaurav

పట్టభద్రుడైన గౌరవ్ చాలా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, ఈ ప్రాంతంలో అవకాశాలు తక్కువ కావడంతో తన తండ్రి నడిపే టైలరింగ్ వ్యాపారంలో పాలుపంచుకోవాలని భావించాడు. అయితే, ఏడుగురు సభ్యులున్న తమ కుటుంబం గడిచేందుకు ప్రస్తుత ఆదాయం సరిపోదని గ్రహించి, ఫ్లిప్‌కార్ట్ కిరాణా కార్యక్రమంలో భాగస్వామి కావాలని నిర్ణయించుకున్నాడు.

ఇప్పుడతను ఫ్లిప్‌కార్ట్‌ సరకుల చేరవేత, టైలరింగ్ పని చేయడంసహా సాయంత్రం తన వ్యాహ్యాళికీ సమయం కేటాయింకోగలిగాడు. అంతేకాదు… తన సొంత ఇంటి కల తీరడానికి ఫ్లిప్‌కార్ట్ కిరాణా ద్వారా వచ్చే ఆదాయం కలిసివస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు.

“ఇవాళ నాకు అనేక ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. కానీ, మహమ్మారి సమయంలో ఫ్లిప్‌కార్ట్ మాకు అండగా నిలిచి ఎనలేని తోడ్పాటునిచ్చింది. అందువల్ల దీన్నుంచి వెళ్లిపోయే ఆలోచనే నేనెన్నటికీ చేయను” అని అతను చెప్పాడు. అలాగే “ఫ్లిప్‌కార్ట్ సాయంతో ఇప్పటికే నేను చాలా ముందడుగు వేశాను. ఇప్పుడు నా సోదరి పెళ్లికి డబ్బు కూడబెడుతున్నాను.ఇదంతా ఫ్లిప్‌కార్ట్ వల్లనే సాధ్యమైంది. “ అని స్పష్టం చేశాడు.

ఫైజాన్‌ సిద్ధిఖీ, కూడా డెహ్రాడూన్‌లో ఫ్లిప్‌కార్ట్‌ కిరాణా భాగస్వామిగా ఉన్నాడు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల మెరుగు కోసం ఫ్లిప్‌కార్ట్‌తో కలసి నడవాలని అతడు నిర్ణయించుకున్నాడు.

కరోనా దిగ్బంధం సమయంలో పర్వత ప్రాంతాల్లో జీవనం దుర్భరంగా మారింది. దీంతో కిరాణా కార్యక్రమంలో చేరడానికి ముందు జీవనోపాధి కోసం అతడెన్నో మార్గాల్లో యత్నించాడు. ఇప్పుడతను తన సోదరునితో కలసి అతని కిరాణా దుకాణంలో పనిచేస్తూనే సరుకుల చేరవేతకు సమయం కేటాయిస్తున్నాడు. ఫ్లిప్‌కార్ట్‌లో తనకనువైన సమయమే కాకుండా కావాల్సిన ప్రాంతాన్ని కూడా ఎంచుకునే స్వేచ్ఛ ఉండటంపై అతనెంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

Flipkart Kirana Program Story Faizan

“మాది ఉమ్మడి కుటుంబం… మా సోదరుడితో కలసి కుటుంబ దుకాణం నిర్వహిస్తుంటాను” అని ఫైజాన్‌ చెప్పాడు. “మా ఆదాయం చాలా పరిమితం కాబట్టి కనీస అవసరాలు మాత్రమే తీరేవి. ఇలా కొన్నేళ్లు సంఘర్షణ పడ్డాక నా కుటుంబం కోసం ఇప్పుడు డెహ్రాడూన్‌లో ఇంటి స్థలం కొనగలిగాను. ఇవాళ నా సమయం మీద నాకు పూర్తి అదుపు ఉంది. మునుపెన్నడూ ఎరుగని విధంగా ఫ్లిప్‌కార్ట్‌ కిరాణా నాకెంతో స్వేచ్ఛనిచ్చింది అన్నాడు. “ఇప్పుడు నాకు నేనే యజమానిని.

ఎదగడంపై పెద్ద కలలు… మెరుగైన ఫలితాలు

భారతదేశంలో 1.20 కోట్ల కిరాణా దుకాణాలుంటాయని అంచనా. నేడు ఫ్లిప్‌కార్ట్‌ మొత్తం బట్వాడాలో మూడోవంతు నిర్వహిస్తున్నది ఈ వ్యాపార సమాజ సభ్యులే. కచ్చితమైన అనుబంధ ఆదాయం, సరళతతోపాటు సమ్మిళిత వృద్ధికి భరోసా ఇవ్వడమే కాకుండా అదనపు ప్రోత్సాహకాలను కూడా ఫ్లిప్‌కార్ట్‌ కిరాణా కార్యక్రమం భాగస్వాములకు అందిస్తోంది. వీటిలో సిఫారసు ప్రోత్సాహకాలు, రూ.5లక్షలకు వ్యక్తిగత ప్రమాద బీమా వంటి అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

సురేష్‌, కర్ణాటకలోని బెంగళూరులో ఫ్లిప్‌కార్ట్‌ కిరాణా భాగస్వామిగా ఉన్నాడు. అతడు అనేక గంటలపాటు పనిచేసే చాలా ఉద్యోగాలు చేసిన స్థిరమైన ఆదాయం ఉండేది కాదు. దీంతో ఇతరత్రా మార్గాన్వేషణ చేయాలని కుటుంబసభ్యులు సురేష్‌కు సూచించారు. అటుపైన ప్రారంభించిన కిరాణా దుకాణం వారికొక ప్రాథమిక ఆదాయ వనరుగా మారింది. సురేష్‌ త్వరలోనే ఫ్లిప్‌కార్ట్‌ కిరాణా బట్వాడా భాగస్వామిగా చేరాడు. తద్వారా అతనికి అనుబంధ ఆదాయ హామీ లభించింది. కిరాణా భాగస్వామిగా తనకు సౌలభ్యం ఉండటం కూడా అతనీ మార్గం ఎంచుకోవడానికి దోహదం చేసింది.

Flipkart Kirana Program Story Suresh

“నా సంపాదన ఇప్పుడు నా పిల్లల చదువులుసహా కుటుంబ పోషణకు ఎంతో సహాయకారిగా ఉంది” అని సురేష్ చెప్పాడు. “నేను ఫ్లిప్‌కార్ట్ కిరాణా కార్యక్రమంతో భాగస్వామిగా చేరినప్పుడు బ్యాంకు రుణం కావాలా? అని అడుగుతూ చాలా ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. కానీ, కిరాణా కార్యక్రమం ద్వారా సంపాదన సంతృప్తికరంగానే ఉందంటూ నేను తిరస్కరించాను. ఇంట్లో ఏదైనా పండుగ లేదా మరేదైనా వేడుక కోసమైనా ఫ్లిప్‌కార్ట్ కిరాణా ద్వారా లభించే ఆదాయం నాకెంతో ప్రయోజనకరం.”

శ్రీకాంత్‌, బెంగళూరులో కిరాణా కార్యక్రమం భాగస్వామిగా ఉన్నాడు. ఫ్లిప్‌కార్ట్‌ కిరాణా కార్యక్రమంతో జోడీ కట్టాక తన జీవితమే మారిపోయిందని అతడు చెబుతున్నాడు. అంతకుముందు ఓ రేకుల షెడ్డులో నివసించే తమ కుటుంబం ఇవాళ మంచి ఇల్లు అద్దెకు తీసుకోగల స్థితికి చేరిందని చిరునవ్వుతో సంతృప్తి వ్యక్తం చేశాడు.

“నేను దాదాపు 2-2.5 ఏళ్ల నుంచి ఫ్లిప్‌కార్ట్ కిరాణా కార్యక్రమ భాగస్వామిగా ఉన్నాను” అని శ్రీకాంత్ తెలిపాడు. “మీరు అదనపు పొదుపు గురించి మాట్లాడితే- నా పొదుపు సొమ్ముతో మంచి ఇల్లు అద్దెకు తీసుకున్నాను… మిగిలిన దానితో నా భార్యకు కొంత బంగారం కూడా కొన్నాను. ఇంతకుముందు మా మామగారు ఓ తోపుడు బండిమీద వ్యాపారం చేసేవారు. ఇవాళ మాకంటూ ఓ దుకాణం ఉంది. ఆయనిప్పుడ ఆ దుకాణ బాధ్యతలు చూసుకుంటారు. నేనేమో కిరాణా భాగస్వామిగా పని చేస్తున్నాను. నా కుటుంబం ఇప్పుడెంతో సుఖంగా జీవిస్తోంది.”

Flipkart Kirana Program Story Srikanth

కర్ణాటకలోని మాండ్యాలో రైతు దంపతులైన తన తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం చేయగలగడంపై అతడెంతో గర్విస్తున్నాడు. కిరాణా కార్యక్రమం ద్వారా ఆదా చేసిన సొమ్ముతో తండ్రికి మోటార్ సైకిల్‌ కూడా కొనిపెట్టాడు. ఫ్లిప్‌కార్ట్ కిరాణా భాగస్వామిగా అతనికెంతో సమయ సౌలభ్యం ఉంది. అందుకే అతడు నిత్యం క్రమం తప్పకుండా తన బిడ్డను పాఠశాల నుంచి తీసుకొచ్చి భోజనం తినిపిస్తాడు. తన కొడుకు భవిష్యత్తు కోసం ప్రణాళికలు కూడా రూపొందించుకున్నాడు. ఆ మేరకు పిల్లవాణ్ని మంచి పాఠశాలలో చేర్చడానికి తన సంపాదనలో కొంత ఆదా చేస్తున్నాడు.

స్వదేశీ సమ్మిళిత వృద్ధి

Flipkart Kirana story - Hemant Badri

హేమంత్‌ బద్రీ, ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగదారు సేవలు, సరఫరా ప్రక్రియ విభాగం సీనియర్‌ ఉపాధ్యక్షుడు. భారతీయ ఇ-కామర్స్‌ పర్యావరణ వ్యవస్థతోపాటు అటు వినియోగదారులు-ఇటు కిరాణా భాగస్వాములపై ఫ్లిప్‌కార్ట్‌ కిరాణా కార్యక్రమం ప్రభావం గురించి ఇలా వివరిస్తున్నారు.

“ఒక స్వదేశీ సంస్థగా ఏర్పాటైన ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ కిరాణా దుకాణాల కోసం సాంకేతికత సహిత సమగ్ర వృద్ధికి చోదకంగా నిలవడానికి కట్టుబడి ఉంది. తద్వారా భారతదేశంలో కిరాణా పర్యావరణ వ్యవస్థ బలోపేతంలో కీలక ఉపకరణంగా మారింది.” అని చెప్పారు. “మహమ్మారి సమయంలో దుకాణ యజమానులు అనుబంధ ఆదాయం పొందడానికే కాకుండా వారి కుటుంబాలకు అండగా నిలవడానికి మా కిరాణా కార్యక్రమం వీలు కల్పించింది.” అన్నారు.

ఫ్లిప్‌కార్ట్ కిరాణా కార్యక్రమానికి 2019లో శ్రీకారం చుట్టాక 27,000 మంది భాగస్వాములతో ప్రారంభమైంది. అప్పటి నుంచీ కిరాణా దుకాణాల భాగస్వామ్యం పెరుగుతూ ఇవాళ 2,00,000 మంది స్థాయికి చేరింది. వీరు దేశవ్యాప్తంగా లక్షలాది వినియోగదారులకు బట్వాడా సేవలందిస్తున్నారు. సమాన అవకాశాలపై దృష్టి సారించే ఫ్లిప్‌కార్ట్ సమ్మిళిత విధానాలకు తగినట్లు ఈ కార్యక్రమంలో పలువురు మహిళలకూ స్థానం కల్పించబడింది. ఈ కార్యక్రమం త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌సహా ఈశాన్య భారతంలోని రాష్ట్రాల్లో 5 రెట్లు వృద్ధి సాధించగా, ఒక్క ఏడాది కాలంలోనే ఈ ప్రాంతం నుంచి 15,000 మంది భాగస్వాములు చేరారు. మొత్తంమీద ఫ్లిప్‌కార్ట్ కిరాణా భాగస్వాములు తమ నెలవారీ ఆదాయంలో దాదాపు 30 శాతం పెరుగుదలను సాధించారు.


ఇదీ చదవండి: #కోటికొకరు: ఫ్లిప్‌కార్ట్‌ కిరాణా భాగస్వామి అమిత్‌కుమార్‌కు కుటుంబమే సర్వం

Enjoy shopping on Flipkart