ఫ్లిప్‌కార్ట్‌ ‘ఈజీవీ, గిఫ్ట్‌ కార్డులు వాడుకోవడంపై ఇది కరదీపిక: సిద్ధమై.. రండి.. షాపింగ్‌ చేయండి!

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | ગુજરાતી | मराठी

మీకు ప్రియమైన వారు ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ గిఫ్ట్ వోచర్‌ మీకు బహుమతిగా ఇచ్చినపుడు లేదా మీరు ఫ్లిప్‌కార్ట్‌లో చెల్లింపు సౌలభ్యం కోసం వోచర్‌ కొనుగోలు చేసి ఉంటే లేదా రకరకాల పోటీల్లో మీరు వాటిని గెలుచుకుని ఉంటే, మీరింకా షాపింగ్ చేయాల్సింది ఇంకా చాలా ఉంటుంది! అంతేకాదు.. మీరిప్పుడు దేశమంతటాగల మా భాగస్వాముల దుకాణాల్లో ఎక్కడైనా ఫ్లిప్‌కార్ట్ ‘ఈజీవీ’లను కొనుగోలు చేయవచ్చు. ఇక మీ గిఫ్ట్ కార్డు సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే, మీ ఫ్లిప్‌కార్ట్ ‘ఈజీవీ’, గిఫ్ట్ కార్డు వాడుకోవడంపై మీకు అవసరమైన సమాచారం తెలుసుకోండి.

Flipkart EGVs

మీరు అనేక ఫ్లిప్‌కార్ట్ పోటీలలో పాల్గొని గెలుచుకున్నా లేదా మీ ప్రియమైన వ్యక్తులెవరైనా బహుశా మీపై ప్రేమతో ఉదారంగా ఇచ్చి ఉన్నాఅలాంటి ఫ్లిప్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్ గిఫ్ట్‌ వోచర్ ఒకటి (లేదా రెండు!) మీరు వాడుకునేందుకు సిద్ధంగా ఉండొచ్చు. అయితే, వీటిని వాడుకోవడం ఎలాగని ఆలోచిస్తున్నారా? ఇదిగో… ఫ్లిప్‌కార్ట్ ‘ఈజీవీ’లను ఎలా వాడుకోవాలో వివరంగా తెలిపే సమాచారమంతా ఇక్కడ లభిస్తుంది. అయితే-

ఫ్లిప్‌కార్ట్ ‘ఈజీవీ’లలో అంతగా ఉత్తేజకరమైనది ఏమిటి?

క్లుప్తంగా చెబితే- ‘ఈజీవీ’లు లేదా ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డులు మీరు దుకాణాల్లో మార్పిడి చేసుకునే వోచర్‌ల వంటివే. ఉదాహరణకు, మీరు ₹500 విలువైన గిఫ్ట్‌ కార్డును గెలుచుకున్నట్లయితే, ఆ ₹500కు సరిపడా విలువకు మీరు ఏవైనా కొనుగోలు చేసి, చెల్లింపు నిమిత్తం ఫ్లిప్‌కార్ట్ ‘ఈజీవీ’లను వాడుకోవచ్చు.
ఇక గిఫ్ట్ కార్డ్ అనేది ఫ్లిప్‌కార్ట్ అంతటా ఉత్పత్తుల కొనుగోలు కోసం మీరు ముందుగా చెల్లించిన సొమ్ముకు సమాన నిల్వ కలిగి ఉంటుంది. మీరు దీన్ని ప్రత్యేక సందర్భాలలో బహుమతిగానో లేదా ప్రేమపూర్వక సందర్భాలు, ప్రశంసలు తెలిపే బహుమతిగానూ ఉపయోగించుకోవచ్చు.
అంతేకాకుండా దీన్ని వాలెట్‌ తరహాలో సత్వర, సులభ చెల్లింపుల కోసం వాడుకోదలిస్తే ఆ విధంగానూ ఉపయోగించుకోవచ్చు.

నేను ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేయడం ఎలా?

ఫ్లిప్‌కార్ట్ ‘ఈజీవీ’ని గెలుచుకోవడం లేదా బహూకరించడం మాత్రమేగాక మీరు ఆన్‌లైన్‌ ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డు స్టోర్‌ను సందర్శించవచ్చు లేదా దేశమంతటాగల 9000కుపైగా ప్రదేశాల్లోని మా భాగస్వాముల దుకాణాలకు వెళ్లి ప్రత్యక్షంగా కొనుగోలు చేయవచ్చు.
మరింత సరళంగా వినియోగం, సౌలభ్యం దిశగా ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డులు లేదా ‘ఈజీవీ’లను ఇప్పుడు మీకు అవసరమైన విలువలో కూడా కొనుగోలు చేయవచ్చు. అంటే- వినియోగదారులు ముందస్తు నిర్దేశిత మొత్తంతోపాటు తమకు కావాల్సిన విలువతోనూ ‘ఈజీవీ’లను పొందే వీలుంది. ఈ మేరకు రూ.25 నుంచి రూ.10,000దాకా మీకు కావాల్సిన విలువతో తీసుకోవచ్చు.

గిఫ్ట్ కార్డు స్టోర్‌లో వివిధ సందర్భాలు, ఇతివృత్తాలకు తగిన ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డులు ఎంచుకునే వెసులుబాటు కూడా ఉంది. అంటే- ‘ప్రేమికుల దినోత్సవం, తండ్రుల దినోత్సవం, వివాహ వార్షికోత్సవం, జన్మదినోత్సవం’ వంటి అనేక సందర్భాలకు తగినట్లు కార్డుల రూపేణా మాత్రమేగాక డిజిటల్‌ రూపంలోనూ లభిస్తాయి.
అలాగే ప్రముఖ బ్రాండ్‌లు, స్టోర్‌లకు సంబంధించిన 120కిపైగా గిఫ్ట్ కార్డులను మీరు ఎంచుకునే, సౌలైభ్యంగా ఉండే విలువల్లోనూ ఫ్లిప్‌కార్ట్‌ గిఫ్ట్ కార్డ్ స్టోర్ ప్రదర్శిస్తుంది.

విజేతకెన్నో సౌలభ్యాలు – ఫ్లిప్‌కార్ట్‌ గిఫ్ట్ కార్డుల వాడకం ఎలా

మీ వద్దగల ఫ్లిప్‌కార్ట్ ‘ఈజీవీ’ల సద్వినియోగం ఎలాగన్నదే మీ ఆలోచనైతే- అదెంతో సులభం. మీరు చేయాల్సిందల్లా ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో ప్రవేశించి, మీరు కొనుగోలు చేయదలచిన వస్తువులను ఎంచుకుని, మీ కార్ట్‌లో నింపండి. తర్వాత, మీరు ఎప్పుడూ చేసినట్లుగానే ‘ప్రొసీడ్ టు పే’ మీద క్లిక్ చేయండి. మీ చెల్లింపు మార్గంగా ‘క్యాష్ ఆన్ డెలివరీ’ లేదా నెట్ బ్యాంకింగ్‌’లను ఎంచుకునే బదులు ‘గిఫ్ట్ కార్డ్ ద్వారా చెల్లింపు’ మీద క్లిక్ చేయండి. ఫ్లిప్‌కార్ట్ ‘ఈజీవీ’లు మీ బ్యాంకు డెబిట్/క్రెడిట్ కార్డుల తరహాలో 16-అంకెల కార్డు సంఖ్య, 6-అంకెల ‘పిన్‌’తో ఉంటాయి. ఈ రెండు నంబర్లూ మీ మెయిల్‌కు అందిన ‘ఈజీవీ’ వివరాల్లో ఉంటాయి. మీరెంచుకున్న వస్తువుల ఆర్డరుపై చెల్లింపు నిమిత్తం ఆ నంబర్లను నమోదు చేయండి.
Flipkart EGVs

మీరెంచుకున్న వస్తువుల మొత్తం ఫ్లిప్‌కార్ట్ ‘ఈజీవీ’ల విలువకన్నా ఎక్కువైతే, మీకు నచ్చిన ఇతర చెల్లింపు పద్ధతిలో దేనిద్వారానైనా మిగిలిన మొత్తాన్ని అలవోకగా చెల్లించండి… అంతే!

ఫ్లిప్‌కార్ట్ ‘ఈజీవీ’లు చాలా ఉన్నాయా? వాటిని ఎలా పసిగట్టాలో ఇక్కడ చూడండి

అంటే- మీరెంతో అదృష్టవంతులు.. మీ వద్ద చాలా ఫ్లిప్‌కార్ట్ ‘ఈజీవీ’లు ఉన్నాయంటే శుభవార్తేగా! మీరు ఆ వోచర్లతో భారీ కొనుగోళ్లు చేయాలనుకుంటే నిశ్చింతగా చేసుకోవచ్చు.
మీ వద్దగల అన్ని ఫ్లిప్‌కార్ట్ ‘ఈజీవీ’లనూ వాడుకోవాలని భావిస్తే కేవలం ఎడమవైపు ఎగువనగల మెనూపై క్లిక్‌ చేయండి, తర్వాత మై అకౌంట్స్‌పై క్లిక్ చేసి, కిందికి వెళ్లండి, అక్కడ మై కార్డ్స్‌ అండ్‌ వాలెట్స్‌పై క్లిక్‌ చేయండి దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డును జోడించండి. మీ గిఫ్ట్‌ కార్డు నంబరుదీంతోపాటు గిఫ్ట్‌ కార్డు పిన్‌ కోసం మీ ఫ్లిప్‌కార్ట్ ‘ఈజీవీ’ల ఇ-మెయిల్‌ను తనిఖీ చేయండి, వివరాలను నమోదు చేయండి, తర్వాతఅప్లైపై క్లిక్ చేయండి. అంతే… ఒక పని పూర్తయినట్టే!

అంటే- మీరు గిఫ్ట్‌ కార్డును మీ వాలెట్‌కు జోడించారన్న మాట. మరోసారి ఫ్లిప్‌కార్ట్‌లో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఈ చెల్లింపు పద్ధతిని మీరు ఉపయోగించవచ్చు.

బహుళ కొనుగోళ్ల కోసం ఒక ఫ్లిప్‌కార్ట్ ‘ఈజీవీ’ని వాడుకోండి

ఉదాహరణకు మీ వద్ద ₹500 విలువైన ఫ్లిప్‌కార్ట్ ‘ఈజీవీ’ ఉన్నపుడు మీరు ₹300 విలువైన పరిమళ ద్రవ్యం కొనాలనుకుంటే ఆందోళనపడకండి. మీరు ₹300 మాత్రమే ఖర్చుపెట్టినా, మిగిలిన ₹200 సురక్షితంగా, భద్రంగా ఉంటాయి. అలాగే మీరు మీ ఆర్డర్ను ఒకవేళ రద్దుచేస్తే, ఆ మొత్తం నేరుగా మీ ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డుకు తిరిగి జమవుతుంది.

మీ ఫ్లిప్‌కార్ట్ ‘ఈజీవీ’ నిల్వను ఇలా తనిఖీ చేసుకోండి

మీ గిఫ్ట్ కార్డు నిల్వను కిందివిధంగా ఏ సమయంలోనైనా తనిఖీ చేసుకోవచ్చు:-
1) గిఫ్ట్‌ కార్డును వాలెట్‌కు జోడించినపుడు:
‘మై అకౌంట్‌’కు వెళ్లండి; అక్కడ ‘మై కార్డ్స్‌ అండ్‌ వాలెట్‌’; ‘వ్యూ డీటెయిల్స్‌’కు వెళ్లండి.
2) గిఫ్ట్‌ కార్డును ఇంకా వాలెట్‌కు జోడించని పక్షంలో:
‘హేవ్ ఎ గిఫ్ట్ కార్డ్’కు వెళ్లి దానిపైflipkart.com/rv/egv‘ క్లిక్ చేయండి. మీ కార్డు నంబరు, పిన్‌ సంఖ్య నమోదు చేయండి
ఇప్పుడు మీ కార్డులో మీరు ఖర్చు చేయగల మిగిలిన నిల్వను చూసుకోగలరు.
మీరు మీ కార్ట్‌ను సవరించుకుని, మరికొన్ని వస్తువులు కొనడానికి ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డులు జారీచేసిన తేదీ నుంచి 12 నెలల వరకూ గడువు ఉంటుంది. కాబట్టి ఫ్లిప్‌కార్ట్‌లోకి ప్రవేశించండి అటుపైన జంకుగొంకు ఏదీ లేకుండా మీ మనసుకు నచ్చినట్లు కొనుగోళ్లు చేయండి!


నవీకరించబడిన ‘ఎఫ్‌ఏక్యూ’లను చదివి ఫ్లిప్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్ గిఫ్ట్‌ వోచర్ల గురించి తెలుసుకోండి.

Enjoy shopping on Flipkart