#స్వయంకృషి (Sellfmade) – ఈ ఫ్లిప్‌కార్ట్ విక్రేత కోవిడ్-19 సంక్షోభాన్ని తట్టుకుంటూ, ఖాతాదారులకు సాయపడే అద్భుత మార్గాన్ని ఎలా కనుగొన్నాడు!

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | ગુજરાતી | मराठी

ఈ ఆకాంక్షభరిత ఇంజనీర్ ఆత్మవిశ్వాసంతో ఒకడుగు ముందుకేసి, వ్యాపారవేత్త కావడం కోసం ఏకంగా ఉద్యోగాన్నే వదులుకున్నాడు. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమని కుటుంబసభ్యులు చెప్పినా విజయంపై పూర్తి భరోసాతో ముందుకే సాగాలని నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా అభిషేక్ గోయెల్ ఇవాళ #సెల్ఫ్‌మేడ్ ఫ్లిప్‌కార్ట్ విక్రేతగా దూసుకుపోతూ ఆన్‌లైన్ కొనుగోలుదారులకు అవసరమైన ఉత్పత్తిని సులువుగా, సరసమైన ధరతో అందుబాటులోకి తెస్తూ సాయపడుతున్నాడు. అతని స్ఫూర్తిదాయకమైన కథనం చదవడంతోపాటు కోవిడ్‌-19 సంక్షోభానికి అనుగుణంగా అతని వ్యాపారం ఎలా సాగిందో తెలుసుకోండి

sell on Flipkart

నాపేరు అభిషేక్ గోయెల్ నేను 2015లో ఫ్లిప్‌కార్ట్‌ విక్రేతగా చేరాను. నేను ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివాను. నా కంపెనీ పేరు డిజివే ఇన్ఫోకామ్. నేను 2007లో ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరి, 2019 ఆగస్టులో దానికి స్వస్తి పలికాను. వ్యాపారవేత్త కావాలన్న నా కలను నెరవేర్చుకోవడంలో భాగంగా తయారీ రంగంలో అడుగుపెట్టాను. ఆ విధంగా ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించడం కోసం ఎక్స్‌టెన్షన్ కార్డులు, సర్జ్ ప్రొటెక్టర్ల వంటి కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేశాను.

sell on Flipkart

అయితే, కోవిడ్‌-19 ఫలితంగా ఉద్యోగుల విధి నిర్వహణతోపాటు మా వ్యాపారంలో కూడా మార్పులు తప్పలేదు. ముందుగా మా ఉద్యోగుల కోసం థర్మల్‌ స్కానర్లు, చేతులకు రక్షణ తొడుగులు తయారుచేశాం. మా పని ప్రదేశాన్ని నిత్యం శానిటైజర్‌తో ప్రక్షాళన చేసేవాళ్లం. ఈ మహమ్మారి సమయంలో నా వ్యాపార నిర్వహణ వేళలు వ్యక్తిగతంగా నాకెంతో సౌకర్యంగానే ఉండేవి. ఇప్పుడు నేను రాత్రి 7 గంటలకల్లా ఇల్లు చేరుతున్నాను. తద్వారా కుటుంబంతో తగినంత సమయం గడిపే అవకాశం నాకు లభించింది.

ఈ మహమ్మారి సమయంలో ఫ్లిప్‌కార్ట్‌ తనవంతు సాయం అందించడాన్ని నిజంగా నేను అభినందిస్తున్నాను. ఆ మేరకు వీలైనంత మేర దేశంలోనిప్రతి పిన్‌కోడ్‌ ప్రాంతంలోనూ అవసరంలో ఉన్న వారందరికీ ఈ కష్ట సమయంలో ఉత్పత్తులు అందించడం ద్వారా తన కర్తవ్యం నిర్వర్తించింది. తద్వారా తన నిబద్ధతను రుజువు చేసుకుంది.

మా ఖాతాదారుల తాజా డిమాండ్లు తీర్చడంలో భాగంగా ఒక నెల కిందట మా ఉత్పత్తుల జాబితాలో రక్షిత చేతి తొడుగులను జోడించాం. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ చేతి తొడుగుల విక్రయంపై నేను నిర్ణయం తీసుకున్నాను. తదనుగుణంగా ఈ ఉత్పత్తి దిగుమతిదారును నేను సంప్రదించగలిగాను. మా సరఫరాలు స్థిరంగా కొనసాగడానికి, ఉత్పత్తిని సరసమైనదిగా ఉంచుతూ ఖాతాదారులకు సులభంగా అందుబాటులో ఉంచగల మార్గాన్ని అన్వేషించాం.

ఫ్లిప్‌కార్ట్ విక్రేత విధానాలు నాకెంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. ఇదొక ఉన్నతస్థాయి విక్రేతల పోర్టల్‌. వారికెంతో సన్నిహితంగా మెలగుతుంది. విక్రేతల మద్దతు బృందం చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుంది. బిల్లింగ్ నుంచి చెల్లింపు వ్యవస్థ వరకూ ప్రతిదీ కచ్చితంగా ఉంటుంది. మనను చేరువ చేసుకోవడంలో, అవగాహన చేసుకోవడంలోఫ్లిప్‌కార్ట్‌ అత్యున్నత స్థానంలో ఉంటుంది. అయితే, నా అభిప్రాయం ప్రకారం… ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక స్థానంలో ఉండటానికి కారణం- ఈ కంపెనీ సాంకేతికత, సమాచారం ఆధారంగా నిర్మించబడినది కావడమే. కాబట్టే విక్రేతలను, వినియోగదారులను అద్భుతంగా అనుసంధానించగలుగుతోంది! కేవలం ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టినందువల్లే నా వ్యాపారం అనూహ్యంగా పెరిగిందని నేను గమనించాను.

కోవిడ్‌-19 కారణంగా చాలామంది నేరుగా దుకాణంలో వస్తువుల కొనుగోలుకు ఇష్టపడరు. అందుకే ప్రతిదీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయబడుతోంది. ఫ్లిప్‌కార్ట్ విక్రేతగా ప్రయాణం ప్రారంభించినప్పుడు మొదట్లో నేను చిన్న వస్తువుల నుంచీ ఆన్‌లైన్ అమ్మకాలు చేయాలని భావించాను! కానీ, ఫ్లిప్‌కార్ట్ నా పని సులభం చేయడంతో విక్రయాలు కేవలం 21 రోజుల్లో పైపైకి దూసుకెళ్లాయి. మేము 2020 మే 10న మా పని ప్రారంభించాం.. ఇప్పుడు విక్రయాలు కొనసాగుతుండగా మా వ్యాపారం చక్కగా సాగుతోంది. ఇది నాకెంతో సంతోషకరమైన అంశం!

Enjoy shopping on Flipkart