#స్వయంకృషి (Sellfmade) – ఈ ఫ్లిప్‌కార్ట్ విక్రేత కోవిడ్‌-19 దిగ్బంధం సమయంలో పెంపుడు జంతు యజమానులు నిశ్చింతగా ఉండేందుకు తోడ్పడ్డారు!

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | ગુજરાતી | मराठी

దిగ్బంధం వల్ల మనలో చాలా మందికి కిరాణా తదితర సామగ్రి తెచ్చుకోవడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల నడుమ దేశవ్యాప్తంగా పెంపుడు జంతువులకు ఆహారం సమకూర్చడం వాటి యజమానులకు అదనపు భారంగా తయారైంది. అలాంటి సమయంలో ఫ్లిప్‌కార్ట్‌ వేదికగా అధికశాతం ఆన్‌లైన్‌ వ్యాపారం చేసే ఓ చిన్న కంపెనీ ‘ఫుడీ పప్పీస్‌ గ్రూప్‌’ తానున్నానంటూ వారికి భరోసా ఇచ్చింది. తమ ప్రియమైన పెంపుడు జంతువులు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేవిధంగా అవసరమైన ప్రతి ఒక్కటీ సమకూర్చడం లక్ష్యంగా పనిచేసింది. ఆ కంపెనీ కథేమిటో ఇప్పుడు చదవండి.

pet supplies

ప్రపంచ మహమ్మారి కోవిడ్‌-19 వల్ల దిగ్బంధం విధించబడిన సమయంలో ఇల్లువదిలి బయటకు వెళ్లి కిరాణా సరకులు, ఇతర నిత్యావసరాలు తెచ్చుకోవడం అనేకమందికి కష్టసాధ్యమైంది. ఇలాంటివారిలో కరోనాతో నిర్బంధ చికిత్స పొందాల్సి వచ్చిన పెంపుడు జంతువుల యజమానులు కూడా ఉన్నారు. ఫలితంగా వారి పెంపుడు జంతువులు కూడా నిర్బంధ స్థితిలో ఉండాల్సి వచ్చింది. మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని పెంపెడు జంతు వస్తుసామగ్రి దుకాణాలు కూడా మూతపడ్డాయి. అయితే, ఈ వస్తుసామగ్రిని అధికశాతం ఆన్‌లైన్‌లో విక్రయించే ఓ చిన్న కంపెనీ ‘ఫుడీ పప్సీస్‌ గ్రూప్‌’ పెంపుడు జంతు యజమానుల చింత తీర్చింది. ఆ మేరకు వారి ఇళ్లలో జంతువులను సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచేవిధంగా అవసరమైన సరఫరాలు అందించింది. ఇదీ వారి కథ.

“నా పేరు అంకిత్‌ పాహుజా. జంతువులు, పక్షులు, చేపలంటే నాకెంతో ఇష్టం. నేనెక్కడికి వెళ్లినా ఇంట్లో వాటికోసం ఆహారం, నీరు అందుబాటులో ఉంచి వెళ్లడం నా అలవాటు. జంతువులపై నాకున్న ఈ ప్రేమే నన్నో వ్యాపార ప్రారంభానికి పురికొల్పింది. ఆ మేరకు దాదాపు నాలుగున్నరేళ్ల కిందట ఆన్‌లైన్‌లో పెంపుడు జంతు సంబంధిత వస్తుసామగ్రి సరఫరాపై ఆలోచించాను.

ఈ ఆలోచనపై నా వ్యాపార భాగస్వాములైనసిద్దార్థ్‌ గులాటి తోపాటు వరుణ్‌కల్రాలతో చర్చించాను. ఆ విధంగా#సెల్ఫ్‌మేడ్‌ ఫ్లిప్‌కార్ట్‌ విక్రేతలుమారాను. నేనిప్పుడు పెంపుడు జంతువుల ఆహారం, ఇతర సామగ్రి విక్రయిస్తున్నాను. నా వ్యాపారంలో 95 శాతం దాకా ఇప్పుడు ఆన్‌లైన్‌ విక్రయ విధానానికి అనువుగా మారిపోయింది.

ఈ దిగ్బంధ సమయంలో సాధారణంగానే మేం ఊహించిన దానికన్నా ఎక్కువ సంఖ్యలో ఆర్డర్లు వచ్చాయి. పెంపుడు జంతువులను వాటి యజమానులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకునేలా భరోసా ఇవ్వాలని మేం నిర్ణయించుకున్నాం. కాబట్టి, ఈ సరఫరాలకు మా ధరలు తదనుగుణంగా ఉండేలా చూసుకున్నాం. అంతే తప్ప, వారి అవసరాన్ని మా లాభార్జన అవకాశంగా మార్చుకునేందుకు మేం ప్రయత్నించలేదు.

అవసరాలకు తగినట్లు నిల్వలు సమకూర్చుకున్నామని మేం భావించినా, డిమాండ్ విపరీతంగా ఉండటంతో మా నిల్వల్లో 50 శాతం త్వరగానే ముగిసిపోయింది. దీంతో మా సమీప ప్రాంత విక్రేతల నుంచి సరఫరాల కోసం ప్రయత్నిస్తున్నాం. ‘పెడిగ్రీ’ వంటి దిగుమతి చేసుకున్న ఉత్పత్తులను కూడా మేం విక్రయిస్తున్నాం. వీటి ధర ఎక్కువే అయినా త్వరలో పరిస్థితి చక్కబడుతుందని మేం ఆశిస్తున్నాం.

ఈ మహమ్మారి సమయంలో మేము సురక్షితంగా ఉండటానికి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. మరోవైపు మా ఖాతాదారులు, వారి పెంపుడు జంతువులు కూడా సురక్షితంగా ఉండేవిధంగా భరోసా ఇవ్వడంపైనా దృష్టి సారించాం. ముందుజాగ్రత చర్యల్లో భాగంగా శానిటైజర్లతో ప్రతి రెండు గంటలకు ఒకసారి మా కార్యాలయాన్ని కూడా శుద్ధి చేస్తాం. ప్రవేశద్వారం వద్ద శానిటైజర్లు, సబ్బు డిస్పెన్సర్లను కూడా ఉంచాం. మా ప్రాంగణంలో అడుగు పెట్టే ప్రతి ఒక్కరినీ ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్‌తో తనిఖీ చేస్తారు. మాస్కు ధరించడం తప్పనిసరి.. లేకపోతే ప్రవేశానికి అనుమతించం. చివరకు మా ఉద్యోగులను కూడా మా కారులోనే కార్యాలయానికి తీసుకువస్తాం.

దిగ్బంధం ప్రకటించిన తొలినాళ్లలో మా కార్యకలాపాలు ప్రారంభించడం చాలా కష్టమైంది.ఫ్లిప్‌కార్ట్‌సహాయంతో జిల్లా కలెక్టర్‌ నుంచి వాపార నిర్వహణకు అనుమతి తెచ్చుకుని పని ప్రారంభించాం.

మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 10వ తేదీ వరకూ మా సంస్థ పూర్తిగా మూతపడింది. కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో మా ఖాతా మేనేజన్‌ కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో మాకెంతో సాయపడ్డారు. ఏయే ఉత్పత్తులు బాగా అవసరమో ఆమె ఎప్పటికప్పుడు సమాచారమిచ్చేవారు. ఆమె సూచనలకు తగినట్లు మేం కూడా మా ఉత్పత్తులను అందుబాటులో ఉంచేవాళ్లం. మాకు రావాల్సిన చెల్లింపు రోజు మార్చి రోజు క్రమం తప్పకుండా అందేవిధంగా ఫ్లిప్‌కార్ట్‌ చూసుకుంది.

మీరు ఆన్‌లైన్‌లో ఆర్డరు ఇచ్చినపుడు ఉత్పత్తులు నేరుగా మీ ఇంటికి చేరుతాయి. వాటిని అందజేయడంలో సామాజిక దూరం పాటించడం వల్ల ఎలాంటి సంపర్కం, సంక్రమణకు అవకాశం ఉండదు. ఈ విపత్కర సమయంలో ఇ-కామర్స్‌ నిజంగా ఎంతో సహాయకారిగా నిలిచింది. కాబట్టి దయచేసి, బయటకు వెళ్లకండి.. మీ విషయంలో జాగ్రత్త వహిస్తూ ఆరోగ్యంగా ఉండండి.”

పెంపుడు జంతువులు మనకు ప్రేమాభిమానాలను పంచడమే కాకుండా మనలో చాలామందికి ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం కూడా కల్పిస్తాయి. యజమానులకు తోడుగా నిలుస్తూ ఆప్యాయత, రక్షణ కూడా ఇస్తాయి. వారితో ప్రత్యేక అనుబంధం ఏర్పరచుకుంటాయి. ఈ నేపథ్యంలో అంకిత్, అతని భాగస్వాములైన సిద్ధార్థ్, వరుణ్ వంటి అమ్మకందారులు ఆన్‌లైన్‌లో పెంపుడు జంతువుల సామగ్రిని విక్రయిస్తున్నారు. తద్వారా దేశంలోని పెంపుడు జంతువుల యజమానులు కూడా ప్రస్తుత ఒత్తిడితో కూడిన ప్రపంచ మహమ్మారి పరిస్థితుల నడుమ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ తమ పెంపుడు జంతువులపై శ్రద్ధ వహించగలరని మేం విశ్వసిస్తున్నాం. నాణ్యమైన ఉత్పత్తులన్నీ సరసమైన ధరతో లభిస్తున్నందువల్ల పెంపుడు జంతువులు కూడా యజమాని సరసన సేదదీరుతూ వాటిని ఆస్వాదిస్తాయి!

పల్లవి సుధాకర్‌ నుంచి అదనపు సమాచారంతో జిష్ణు మురళికి వివరించిన కథనం మేరకు…

Enjoy shopping on Flipkart