సురక్షిత ఆన్‌లైన్‌ కొనుగోళ్లు చేయండి! ఫ్లిప్‌కార్ట్‌ నకిలీ వెబ్‌సైట్‌ను ఎలా పసిగట్టాలో తెలుసుకోండి

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | ગુજરાતી | मराठी

అసలైనదిగా మభ్యపెట్టే ఫ్లిప్‌కార్ట్‌ నకిలీ వెబ్‌సైట్‌లో కొనుగోళ్ల వల్ల మీరు వ్యక్తిగత సమాచారమే కాకుండా మీ డబ్బును కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కానీ, మీరు సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సైబర్ మోసాన్ని ఆదిలోనే అడ్డుకోగలరు. ఈ దిశగా మోసపూరిత వెబ్‌సైట్ లేదా యాప్‌ను పసిగట్టడానికి, మీరు ఎలాంటి ఆందోళన లేకుండా కొనుగోళ్లు చేయడానికి కొన్ని సులభ మార్గాలున్నాయి.

మీరెప్పుడైనా అచ్చం ఫ్లిప్‌కార్ట్ తరహాలో కనిపించే నకిలీ వెబ్‌సైట్‌ని క్లిక్ చేశారా? అది అసలైనది కాదేమోననే అనుమానం మిమ్మల్ని పీడిస్తోందా? మీకు అలా సందేహం రావడం మంచిదే! అయినప్పటికీ, మీ మనసు కీడు శంకిస్తుంటే- నకిలీ వెబ్‌సైట్ లేదా యాప్‌ని పసిగట్టడానికి కొన్ని సులభ మార్గాలను మీకందిస్తున్నాం. మీ వ్యక్తిగత, ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని సురక్షితం చేసుకోవడం కోసం ఈ మార్గాలేమిటో చదవండి.. ఇక ఎలాంటి ఆందోళన లేకుండా కొనుగోళ్లు చేయండి!

నకిలీ వెబ్‌సైట్‌ను గుర్తించడం ఎలా?

fake websites

1. అసలైనదిగా కనిపిస్తున్నా… డొమైన్‌ పేరు తప్పుగా ఉంటే?

నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించే సైబర్ నేరగాళ్లు అది అచ్చం ఫ్లిప్‌కార్ట్లా మభ్యపెట్టే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, ఫ్లిప్‌కార్ట్ లోగోతోపాటు అధికారిక ఆర్ట్‌వర్క్, ‘ది బిగ్ బిలియన్ డేస్’ లోగో వంటి ట్రేడ్‌మార్కులను నకిలీ వెబ్‌సైట్‌లో యథాతథంగా అనుకరించడం సాధ్యం కాదు. కాబట్టి.. వీటి పరిశీలన ద్వారా మీరు రెండు రకాలుగా మోసపూరిత వెబ్‌సైట్‌ను కనుగొనవచ్చు:
ఫోటోషాప్ చేయబడిన బొమ్మలు కావచ్చునేమో చూడండి: ఉదాహరణకు అలాంటి బొమ్మల్లో అమ్మకాల తేదీ తప్పుగా ఉండటాన్ని మీరు కనుగొనవచ్చు. లేదా అక్షరాల రూపంలో మార్పు కనిపించవచ్చు… ‘లైట్’ (Lite) వంటి అదనపు పదం ఉండొచ్చు… లేదా మీరు బొమ్మలు మసకగా ఉండటం గమనించవచ్చు.
యూఆర్‌ఎల్‌ (URL)ను తనిఖీ చేయండి: కేవలం ఫ్లిప్‌కార్ట్‌కు మాత్రమే ‘flipkart.com’ అని డొమైన్‌ పేరుంటుంది. అయితే, నకిలీ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌లు ఫ్లిప్‌కార్ట్‌ లాగా కనిపించే ‘యూఆర్‌ఎల్‌’తో మాయచేసే ప్రమాదం ఉంది. ఉదాహరణకు:

  • Flipkart.dhamaka-offers.com/
  • Flipkart-bigbillion-sale.com/
  • http://flipkart.hikhop.com/

లేదా వెబ్‌సైట్‌ పేరులో డాట్‌ కామ్‌ (.com)బదులు కిందివిధంగా ఉండొచ్చు:

  • Flipkart.biz
  • Flipkart.org
  • Flipkart.info

 

మరికొన్ని సందర్భాల్లో నకిలీ వెబ్‌సైట్ అచ్చం ఫ్లిప్‌కార్ట్లా కనిపించినా.. ‘యూఆర్‌ఎల్‌’ అసలు ఏ సంబంధం లేకుండా ఉండొచ్చు. ఉదాహరణకు:

  • 60dukan.xyz
  • Offernoffer.xyz
  • big-saving-days.xyz

2. నమ్మశక్యంగాని ఆఫర్లు లేదా డిస్కౌంట్లు

fake websites
కొనుగోలుదారులను ఆకర్షించేందుకు నకిలీ వెబ్‌సైట్ కింద చూపినట్లు ఊహించనంత భారీ ఆఫర్లు ప్రకటిస్తుంది:

  • శామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌8పై 98 శాతం తగ్గింపు
  • కేవలం
    రూ.2,499కే శామ్‌సంగ్‌ గెలాక్సీ 10+
  • కేవలం
    రూ.10,000కే ఐఫోన్‌ 11

ఇటువంటి అసంబద్ధమైన ధరల ప్రకటన హాస్యాస్పదమేగాక అనైతికం.. చట్ట విరుద్ధం కూడా- కాబట్టి, అలాంటి ప్రలోభాలకు గురిచేసే వెబ్‌సైట్ల దరిదాపులకైనా వెళ్లకండి.

3. వెబ్‌సైట్‌ చిరునామా ‘సురక్షితం కాదు’ (Not secure) అని చూపుతుంటే:

fake websites
అధికారిక ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ సురక్షితమైనదిగానూ.. ధ్రువీకరించబడినదిగానూ ఉంటుంది. దీని ‘యూఆర్‌ఎల్‌’ ‘https://’తో ప్రారంభమవుతుంది. ‘s’ అంటే సురక్షితమైనదని అర్థం. ఆ మేరకు ‘https’ ద్వారా మీరు బదలాయించే సమాచారం సంకేత నిక్షిప్తం సందేశంగా భద్రం చేయబడుతుంది. అంతేకాకుండా మీ వెబ్‌సైట్ సురక్షితమని భరోసా కల్పిస్తూ మీ శోధక ఉపకరణం (బ్రౌజర్) ‘తాళంకప్ప’ గుర్తుతో సూచిస్తుంది. కనుక… నకిలీ ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ చిరునామా ‘నాట్ సెక్యూర్’ అనే పదంతో ప్రారంభమవుతుందని గుర్తుంచుకోండి. అయినప్పటికీ చెల్లింపు దశకొచ్చేసరికి నేరగాళ్లు కూడా సురక్షిత చెల్లింపు మార్గం (పేమెంట్ గేట్‌వే) ఉపయోగిస్తారు కాబట్టి ఆ సమయంలో మాత్రం మీకు ‘సురక్షితం’ (సెక్యూర్) అని కనిపిస్తుంది. అయితే, అధికారిక ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ ‘మొదటినుంచి-చివరిదాకా’ అన్నివిధాలా సురక్షితమని మరువకండి.

4. వెబ్‌సైట్ ఆశించిన విధంగా పనిచేయనప్పుడు:

నకిలీ ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ కింది అంశాలలో ఏదైనా
ఒకటి లేదా అన్నింటినీ కలిగి ఉండవచ్చు:

  • మీ కార్ట్‌
    క్లిక్‌ చేయడానికి వీల్లేనిదిగా, ముందే నింపినదిగా కనిపించవచ్చు
  • మీ పేరు,
    రహస్య సంకేత పదంతో ‘లాగిన్‌’ కోరకపోవచ్చు
  • కొన్ని
    లంకెలు చురుగ్గా ఉండకపోవచ్చు
  • మూడు
    గీతల (హ్యాంబర్గర్) మెనూ చురుగ్గా లేకపోవచ్చు
  • మీరు
    తప్పుడు లేదా అసంపూర్తి వివరాలతో ప్రవేశించి కొనసాగే వీలు ఉండొచ్చు

 

ఫ్లిప్‌కార్ట్‌ నకిలీ యాప్‌ను పసిగట్టడం ఎలా?

YouTube player

యాప్‌ పేరును జాగ్రత్తగా.. నెమ్మదిగా చదవండి

 

యాప్‌ పేరు మాయ చేసేదిగా లేక అక్షర దోషాలతో
ఉండొచ్చు. ఉదాహరణకు:
‘ఎఫ్‌కె
లైట్‌’ – ఆన్‌లైన్‌ షాపింగ్‌ యాప్‌గా కనిపించవచ్చు
.
ఈ నకిలీ యాప్‌ ‘ఫ్లిప్‌కార్ట్‌’ అనే పదాన్ని వాడకపోయినా, అసలైనదేననే భ్రమ కల్పించేదిగా ఉంటుంది.
లోగోను తనిఖీ చేయండి
ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ కొనుగోళ్ల యాప్, ఫ్లిప్‌కార్ట్ విక్రయ కూడలి వంటి ఇతర యాప్‌ల ముద్రను అనుకరించేందుకు ఫ్లిప్‌కార్ట్ నకిలీ యాప్‌లు ప్రయత్నిస్తాయి. అయితే.. ఈ నకిలీలలో వ్యత్యాసాలను సులభంగా గుర్తించవచ్చు.
యాప్‌ రూపకర్తలెవరో తనిఖీ చేయండి
అధికారిక ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌ను స్వయంగా ఫ్లిప్‌కార్ట్‌ రూపొందించింది. ఈ మేరకు రూపకర్త విభాగం కింద మీకు అధికారిక వెబ్‌సైట్‌ లంకె కనిపించడంతోపాటు అభిప్రాయం కోరే ఇ-మెయిల్‌ చిరునామా @flipkart.comతో ముగిసే పదాలు కూడా కనిపిస్తాయి.
సందేహాస్పద పద్ధతులపై జాగ్రత్త వహించండి
నకిలీ వెబ్‌సైట్‌ విషయంలో కింది అంశాలను గమనించండి:

  • భారీ, అసహజ ప్రకటనలు
  • చురుగ్గాలేని లేదా స్పందించని లంకెలు
  • అసమంజస సమీక్షలుInauthentic reviews

ఫ్లిప్‌కార్ట్‌లోసురక్షితంగా కొనుగోళ్లు చేయడం ఎలా?

ఫ్లిప్‌కార్ట్‌ నకిలీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ల బారిన పడకుండా ఉండాలంటే అధికారిక వేదికలపై కొనుగోళ్లు చేయడమే మంచిది. అలాంటి మార్గాలేమిటో దిగువన చూడండి:

You can follow మీ ఫోన్‌లో యాప్‌ను
డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవసరమైన సూచనల కోసం కరదీపికను చూడండి.

ఆన్‌లైన్‌ కొనుగోళ్ల వేళ మోసపూరిత చర్యలపై అనుమానం ఉంటే <ahref=”https://stories.flipkart.com/contact-flipkart- 1800-208-9898/” target=”_blank” rel=”noopener noreferrer”> ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారుల సహాయ నంబరు
1800208 9898కు డయల్‌ చేయడానికి సందేహించకండి. ఫ్లిప్‌కార్ట్‌ ఆమోదిత ప్రతినిధులెవరూ మీ పాస్‌వర్డ్‌, ఓటీపీ, పిన్‌ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎన్నడూ అడగబోరనే వాస్తవాన్ని మరువకండి. .
ఫ్లిప్‌కార్ట్‌ నకిలీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ను పసిగట్టడంపై సంపూర్ణ పరిజ్ఞానంతో ఇకపై మీరు నిశ్చింతగా ఆన్‌లైన్‌ కొనుగోళ్లు చేయండి. తద్వారా మీ వ్యక్తిగత వివరాలన్నీ భద్రంగా ఉంటాయని, మీ ఆర్డర్‌ తక్షణమే మీ వాకిట ఉంటుందని భరోసాతో ఉండండి!
సైబర్‌ భద్రతపై మరిన్ని చిట్కాల కోసం మా సమగ్ర కరదీపికను చదవండి.

Enjoy shopping on Flipkart