ప్రతికూలతపై విజయం: చిన్న వ్యాపార యజమాని నుంచి స్ఫూర్తిదాయక విజేతదాకా…

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | ગુજરાતી | मराठी

చేతిలో కేవలం రూ.5,000తో ఓ చిన్న వ్యాపారం ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్‌ విక్రేత చారుగుప్తా- ప్రతికూలతను అధిగమించగల శక్తికి ప్రతీకగా నిలిచారు. #స్వయంకృషితో విజయతీరాలకు చేరడంలో ఆమె ప్రయాణం ఎలా సాగిందో చూడండి.

Small Business

సాహసం, నిజాయితీతో కూడిన కృషితోనే తన కలలు నిజం కాగలవని విశ్వసించిన ఫ్లిప్‌కార్ట్‌ విక్రేత చారు గుప్తాకు కఠోర పరిశ్రమ ఏమాత్రం కొత్త కాదు. ఓ చిన్న వ్యాపార యజమాని కావడానికి ముందు ఆమె జీవనోపాధి కోసం రకరకాల పనులు చేశారు. అయితే, కుటుంబంలో సంక్షోభంతో పరిస్థితులు ప్రతికూలించినపుడు ఏదోవిధంగా ముందడుగు వేయడం ఒక్కటే పరిష్కారమని ఆమెకు తెలుసు. అందుకే చారు గుప్తా 2015లో తన వద్దగల కేవలం రూ.5,000తో ఒక చిన్న వ్యాపారం ప్రారంభించారు. అటుపైన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, ఫ్లిప్‌కార్ట్‌ మార్గదర్శకత్వంతో తన చిన్న వ్యాపారాన్ని ఒక వర్ధమాన పరిశ్రమ స్థాయికి విస్తరించగలిగారు.


ఫ్లిప్‌కార్ట్‌ విక్రేత చారు గుప్తా కథనం చూడండి:

YouTube player

సవాలు ఎంతటిదైనా వెనకడుగు వేయడం తెలియని చారు గుప్తా సాహసం-పట్టుదల మంత్రాన్ని ఎన్నడూ వీడలేదు. ఇవాళ రూ.5కోట్ల టర్నోవర్‌ సాధించిన చారు గుప్తా 2015లో తన పరిస్థితులు ఎలాంటివో ఎన్నడూ మరచిపోరు. ఆనాటినుంచీ పడిన ప్రతి ముందడుగు ఆమె ఉక్కు సంకల్పాన్ని ప్రతిబింబిస్తాయి. ఒక మహిళా వ్యాపారవేత్తగా సమాజ దృక్పథంతోపాటు తనపై తనకుగల అన్ని పరిమితులనూ ఆమె ఛేదించారు.

టోకు వ్యాపారులు తనకు ఒక సమయమంటూ ఇవ్వకపోవడం, ఫలితంగా వ్యాపార ప్రణాళికను పదేపదే సర్దుబాటు చేసుకోవాల్సి రావడం వంటి ఆటంకాలు ఆమెకు అడుగడుగునా ఎదురయ్యాయి. దీంతో తన విజయపథంలో ఆమె ఇ-కామర్స్ గురించి ఆమూలాగ్రం నేర్చుకోవాల్సి వచ్చింది. ఒక్కసారి ఆమె ఫ్లిప్‌కార్ట్ అమ్మకందారుగా మారిన తర్వాత చిన్న వ్యాపారం కాస్తా రూ.కోటి టర్నోవర్ మైలురాయి దాటడానికి ఎంతోకాలం పట్టలేదు. కేవలం ఒకేఒక సంవత్సరంలో ఆమె వ్యాపారం 400 శాతం పెరగడంవిశేషం!

ఈ విజయగాథలో ఆమె సంస్థ సైకరా కలెక్షన్స్ కేవలం వ్యాపారం కాదు… అంతకన్నా ఎక్కువ. అలాగే ఫ్లిప్‌కార్ట్ కూడా ఒక వేదిక స్థాయికన్నా ఎక్కువ. ఇది చారు వాస్తవ సామర్థ్యాన్ని గ్రహించిన ప్రదేశంగా మారింది. తనలాంటి ఇతర మహిళలు కూడా తమ కలలను సాకారం చేసుకునే దిశగా ఆమె ఎలాంటి అవకాశాలు కల్పించింది?


ఇదీ చూడండి: చెన్నై సూపర్ క్వీన్స్: ఈ ఫ్లిప్‌కార్ట్ కూడలిలో మొత్తం మహిళలేగల బృందం సరఫరా గొలుసు చరిత్ర సృష్టిస్తోంది.

Enjoy shopping on Flipkart