చిన్న చిన్న ఆనందాలు ఫ్లిప్‌కార్ట్ విష్‌మాస్టర్ అభిజిత్ ఆర్‌కేకి అతని #OneInABillion క్షణాలను అందించాయి

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | ગુજરાતી | मराठी

కేరళలోని కొల్లాంలో గల పారిపల్లి అనే అందమైన పట్టణంలో, ఫ్లిప్‌కార్ట్ విష్‌మాస్టర్ అభిజిత్ ఆర్‌కె తన స్వంత ఆనందానికి మరియు అర్థవంతమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. తన కుటుంబంతో కలిసి సమయం గడపడం దగ్గర నుండి పారిపల్లిలోని హబ్‌లో తన తోటివారితో బలమైన స్నేహాన్ని పెంపొందించుకోవడం వరకు, ఇలా అభిజిత్ పనికి ప్రాధాన్యతనిస్తూ, ప్రియమైనవారితో గడుపుతూ నాణ్యమైన సమయాన్ని సమతుల్యం చేసుకుంటాడు. ఈ క్షణంలో జీవించడం గురించి చెప్పే ఈ విష్‌మాస్టర్ యొక్క #OneInABillion కథనాన్ని చదవండి.

One In A Billion

బాల్యం గడపడానికి, పిల్లలు ఎదగడానికి కొల్లం అనేది ఒక అందమైన ప్రదేశం. మా ఇల్లు కడపపురం (సముద్రతీరం) నుండి చాలా దూరంలో ఉన్న పారిపల్లిలో ఉంది. ఇక్కడ నివసించడంలో గొప్ప విషయం ఏమిటంటే, మనకు ఎల్లప్పుడూ తాజా సముద్రపు ఆహారం ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం, స్థానిక మత్స్యకారులు తాము పట్టుకున్న చేపలను తీసుకువస్తారు. వాటిలో కొంత భాగాన్ని పొందడానికి నేను బీచ్‌కి వెళ్లడం అంటే నాకు చాలా ఇష్టం. తాజా సీఫుడ్ వంటల రుచిని ఏదీ అధిగమించలేదు!

నేను ఇక్కడ నా తల్లిదండ్రులు, నా కవల సోదరుడు మరియు మా జీవిత భాగస్వాములిద్దరితో కలిసి నివసిస్తున్నాను. నా భార్య అకౌంటెంట్‌గా పని చేస్తుండగా; నా తల్లిదండ్రులు ఇద్దరూ ఎల్‌ఐసీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. నా భార్య పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC) పరీక్ష కోసం చదువుతోంది మరియు ఆమె విజయంపై నాకు చాలా నమ్మకం కూడా ఉంది.

10వ తరగతి పూర్తయిన తర్వాత పాలిటెక్నిక్ మెకానికల్ కోర్సు చేశాను. కొల్లంలో ఓ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేసి, మంచి ఉద్యోగావకాశాల కోసం రెండేళ్లు కువైట్ వెళ్లాను. దురదృష్టవశాత్తు, మహమ్మారి సమయంలో నేను నా ఉద్యోగాన్ని కోల్పోయాను. ఈ కారణంగానే ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది.

లాక్డౌన్ సమయంలో, నేను సోషల్ మీడియాలో ఫ్లిప్‌కార్ట్ విష్‌మాస్టర్ కోసం జాబ్ పోస్ట్ చేయడం చూశాను మరియు నా సోదరుడు కూడా పని కోసం చూస్తున్నాడు. అలా ఇద్దరం కలిసే ఈ ఉద్యోగం అప్లై చేసి, సంపాదించాం.
One In A Billion

దాదాపు 2.5 సంవత్సరాలుగా నేను ఫ్లిప్‌కార్ట్‌లో విష్ మాస్టర్‌గా పని చేస్తునాను.

నేను మొదట్లో కొల్లంలో ఉన్న ప్రధాన హబ్‌లో పని చేసేవాడిని. తర్వాత పారుపల్లి హబ్‌కు వచ్చాను. ఇక్కడ చాలా సానుకూల మరియు స్నేహపూర్వకమైన వాతావరణం ఉంది. మిగతా విష్‌మాస్టర్స్ మరియు టీం సభ్యులతో నాకు చాలా మంచి స్నేహబంధాలు ఏర్పడ్డాయి.

ప్రతీ వారం, పని పూర్తయిన తర్వాత ఏదో ఒక రోజు మేమంతా కలిసి ఫుట్‌బాల్ లేదా క్రికెట్ ఆడతాం. బంధాన్ని బలపరుచుకోవడానికి అది ఒక సరదా అయిన మార్గం. మేమంతా కలిసి మధ్యాహ్నం భోజనం చేసేందుకు కూడా బయటకు వెళ్తూ ఉంటాం.

ముఖ్యంగా Big Billion Days (BBD) విక్రయాల సమయంలో మేమంతా కలిసి ఒక బృందంగా బాగా పని చేస్తాము. మేము డెలివరీ ప్రాంతాల ఆధారంగా మమ్మల్ని సమూహాలుగా విభజించుకుంటాము మరియు ప్రతి సమూహానికి ఒక కెప్టెన్‌ని నియమిస్తాము. ప్రతి సమూహం మాకు మరియు ప్యాకేజీల కోసం భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యధిక డెలివరీలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటాం. గత 2 సంవత్సరాలుగా నా జట్టు వరుసగా విజయం సాధించింది. ఈ కార్యకలాపం ప్రతి ఒక్కరి మనోధైర్యాన్ని పెంచుతుంది. సురక్షితమైన మరియు సకాలంలో డెలివరీలను నిర్ధారిస్తుంది. అదే సమయంలో బిజీగా ఉన్న సమయంలో సరదాగానూ ఉంటుంది!

మేము పనిని ఆహ్లాదకరమైన, కలుపుగోలు వాతావరణం కలిగిన ఇన్ఫర్మేటివ్ స్పేస్‌గా మార్చడానికి మా సృజనాత్మక ఆలోచనలను కూడా పంచుకుంటాము. ఉదాహరణకు, విష్‌మాస్టర్‌లందరికీ భద్రతా చర్యలను పటిష్టం చేయడానికి మేము గత సంవత్సరం BBD కంటే ముందు హెల్మెట్ భద్రతపై వీడియో చేసాము. ఇది భారీ విజయం సాధించింది.

నా సెలవు రోజుల్లో నా కుటుంబంతోనే నేను నాణ్యమైన సమయం గడుపుతాను. నా తల్లిదండ్రులు మరియు భార్యతో కలిసి దేవాలయాలను సందర్శిస్తుంటాం. వీలైనప్పుడు మా తల్లిదండ్రులు ఉండే ప్రదేశానికి కూడా వెళ్లి వస్తుంటాం.

నేను జీవితంలో సాధారణంగా వచ్చే చిన్న చిన్న ఆనందాల కోసం జీవిస్తున్నాను – అది నా సన్నిహితులతో రోజువారీ జ్ఞాపకాలను సృష్టించుకోవడం లేదా మంచి భోజనాన్ని ఆస్వాదించడం.. మొదలైనవి.


ఇది కూడా చదవండి: జైపూర్‌లో ఒక వ్యాపారవేత్త ఫ్లిప్‌కార్ట్ సమర్థ్ ద్వారా తన కుటుంబ బిజినెస్ నిర్మించుకున్నారు

Enjoy shopping on Flipkart