యంత్రాలు మనం ఏదడిగితే అది మాత్రమే చేస్తాయి. కానీ, హస్తకళాకారులు అలా కాదు- ప్రతి నూలుపోగు, ప్రతి కుట్టు ప్రత్యేకంగా ఉండాలని పరితపిస్తారు.. అంటారు గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఫ్లిప్‌కార్ట్ విక్రేత విజయ్ భాయ్. ఆయన తన ఆఫీసు గదిలో కూర్చుని, వివిధ శ్రేణులలో సంక్లిష్ట ఎంబ్రాయిడరీ చీరల తయారీ ప్రక్రియ నుంచి సూరత్‌లోని ఒక దుకాణం నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా దేశవ్యాప్త ఆర్డర్ల రవాణాదాకా తన వ్యాపార ప్రస్థానం గురించి విశదీకరించారు. నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా ఈ ప్రక్రియలన్నీ సజావుగా సాగిపోతుంటాయి.
ఈ కథనంలో: స్థానిక హస్తకళాకారులు దేశవ్యాప్త విక్రయాలు చేసేలా సాయపడుతూ వారికి సాధికారత కల్పించడంలో గుజరాత్‌లోని సూరత్ నగరంలోగల ఫ్లిప్‌కార్ట్ విక్రేత విజయ్ భాయ్ కృషి గురించి చదవండి.
“నేను ఇల్లు కట్టుకోవాలి… కారు కొనుక్కోవాలి… అక్కడితో సరిపోదు- అందులో షికారు కూడా చేయాలి” అంటాడు గుజరాత్‌లోని సూరత్‌లోగల ఫ్లిప్‌కార్ట్ విక్రేతవిజయ్ భాయ్ . విజయ్ భాయ్ సూరత్‌లో తన తల్లిదండ్రులు, భార్య, మూడేళ్ల కుమారుడితో గుజరాత్‌లోని సూరత్‌లో నివసిస్తుంటారు. వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన ఆయన, వ్యాపారంపై మక్కువతోనే పెరిగిపెద్దయ్యాడు. అతని తండ్రి వజ్రాల వ్యాపారి కాగా, స్వయంగా ఏదైనా వ్యాపారం చేయాలని విజయ్ భాయ్ నిర్ణయించుకున్నాడు.
మిత్రులు కొందరు వస్త్ర వ్యాపారంలో ఉండటంతో వారితో చేయికలపాలని భావించాడు. అదే సమయంలో ఆయా ఉత్పత్తుల గురించి మరింత అవగాహన పెంచుకుని, వినూత్న ఉత్పత్తులతో తనదైన వ్యాపారం ప్రారంభించడంపై దృష్టి సారించాడు. ఆ విధంగా ఎంబ్రాయిడరీ పని నేర్చుకున్నాడు.. ఆపైన తన స్వంత బ్రాండ్ ప్రారంభించే ముందు విభిన్న డిజైన్లు, రంగుల నమూనాలతో అనేక ప్రయోగాలు కూడా చేశాడు.
ఇప్పుడు చీరల ఎంబ్రాయిడరీ పనికోసం రోజూ ఏడుగురు హస్తకళాకారులు విజయ్ భాయ్ సంస్థకు వస్తుంటారు. “ఇక్కడి వాతావరణం చాలా బాగుంటుంది.” అని ఆయన చెబుతారు. ఈ కళాకారులు ఒక దశాబ్దం నుంచీ తనతో కలసి పనిచేస్తున్నారని ఆయన కించిత్ గర్వంతో చెబుతూ- చిరునవ్వు చిందిస్తారు.
ఎంబ్రాయిడరీకి కావాల్సిన సరంజామా అంతా పని ప్రదేశంలో సిద్ధంగా ఉంటుంది. హస్త కళాకారులు గుండ్రంగా కూర్చుని కలసికట్టుగా ఒక చీరను సుందరంగా రూపొందిస్తారు. జాగ్రత్తగా ఎంచుకున్న డిజైన్లు, రంగులతో ముగ్గురు కళాకారులు ఒక చీరను పూర్తిచేస్తారు. మరింత సంక్లిష్ట డిజైనల్లతో భారీ స్థాయిలో అద్భుతంగా రూపొందించాలంటే ముగ్గురు కళాకారులు కనీసం 15 గంటలపాటు శ్రమించాల్సి ఉంటుంది.
విజయ్ భాయ్ 10వ తరగతి మాత్రమే చదివినప్పటికీ తని పనిలో, జీవితంలో తనకేవి అవసరమో అవన్నీ నేర్చుకున్నారు. ఆ మేరకు తమ సంస్థ చీరల తయారీలో ఎలాంటి లోపాలకు తావులేని, సమగ్ర ప్రక్రియలను అనుసరిస్తారు. నమూనా గీసే, డిజైన్ రూపొందించే వ్యక్తులతో కలసి స్వయంగా పనిచేస్తారు. చివరగా చీరలపై ఆ డిజైన్లను కుట్టే హస్తకళాకారులకు పని అప్పగించే ముందు వివిధ రంగుల సమ్మేళనాన్ని పరిశీలిస్తారు.
“ఇంతకుముందు నేను స్థానిక మార్కెట్లో మాత్రమే విక్రయించేవాడిని” అంటారాయన. ఆ తర్వాత ఆన్‌లైన్ విక్రేతగాఫ్లిప్‌కార్ట్‌లో 2021లో చేరారు. ఫ్లిప్‌కార్ట్ సమర్థ్ కార్యక్రమం గురించి మిత్రుల సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలోని హస్తకళాకారులు, చేనేత కార్మికులు, చేతివృత్తుల వారికి సాధికారత కల్పన లక్ష్యంగా ఈ కార్యక్రమం 2019లో ప్రారంభమైంది. ఇందులో ప్రవేశం ద్వారా, దేశంలోని అణగారిన సమాజాల సభ్యులకు దేశవ్యాప్త మార్కెట్ అందుబాటులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఇ-కామర్స్ తనకు కొత్త అయినప్పటికీ, విక్రేతలకు ఫ్లిప్‌కార్ట్ తోడ్పాటుతో తొలినాళ్ల సందేహాలను అధిగమించి అందులో చేరారు. మొదట్లో రోజుకు 3 నుంచి 4 ఆర్డర్లు మాత్రమే వచ్చేవి కాగా- ఇవాళ నిత్యం 300 నుంచి 400 ఆర్డర్లపై చీరల రవాణా చేస్తుంటారు.
యంత్ర తయారీ, చేతితో ఎంబ్రాయిడరీ చేసిన చీరల మధ్య వ్యత్యాసం గురించి అడిగితే- యంత్రాలు మనం ఏదడిగితే అదే చేస్తాయి. కానీ, కళాకారులు ప్రతి నూలుపోగును, ప్రతి కుట్టును ప్రత్యేకంగా తీర్చిదిద్దడానికి పరితపిస్తూ తమ నైపుణ్యాన్ని జోడిస్తారని ఆయన చెప్పారు.
ఇప్పుడిక కుర్తీలు, వివిధ రకాల షర్టులు, టాప్‌ల విక్రయంలో ప్రవేశించాలని, సమీప భవిష్యత్తులో వాటన్నింటినీ ఫ్లిప్‌కార్ట్ జాబితాకు ఎక్కించాలని ఆయన లక్ష్యనిర్దేశం చేసుకున్నారు. అంతేగాకుండా వ్యక్తిగత లక్ష్యాల మేరకు ఇల్లు, కారు సమకూర్చుకోవాలని, అందులో ఆనందంగా షికారు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు.
“ఫ్లిప్‌కార్ట్‌లో నాణ్యతను ఖాతాదారులు అభినందిస్తున్నారు. కాబట్టి దేశంలో తయారయ్యే నాణ్యమైన ఉత్పత్తులు కొనడానికి ఈ సేల్ వారికి గొప్ప అవకాశం కల్పిస్తుంది” అని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ ‘క్రాఫ్టెడ్ బై భారత్’ సేల్‌కి చాలా రోజులు ముందునుంచే డిజైనింగ్, నాణ్యత తనిఖీ ప్రక్రియలను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.
దేశవ్యాప్తంగా చేతితో ప్రత్యేకంగా తయారుచేయబడిన ఉత్తుల కోసంఫ్లిప్‌కార్ట్ యాప్‌లో లాగిన్ కండి.