#భారత కళారూపాలు: వర్లీ నుంచి మహేశ్వరిదాకా ట్రైబ్స్ ఇండియా హస్తకళాకారుల వారసత్వ సంపన్న కళను చూడండి.

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | ગુજરાતી | मराठी

ఫ్లిప్‌కార్ట్ సమర్థ్-‘ట్రైఫెడ్‌’ భాగస్వామ్యం కింద దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి అనేకమంది గిరిజన, దేశీయ హస్తకళాకారులు, చేతివృత్తుల నిపుణులు ఈసారి ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ వేదికగా తాము తయారుచేసిన కళారూపాలను విక్రయిస్తున్నారు. వారి సుసంపన్న వారసత్వ #భారత కళారూపాల (#ArtFormsOfIndia) ఉత్పత్తుల గురించి తెలుసుకోండి. ఈ పండుగల సమయంలో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా వారికి తప్పక మద్దతివ్వండి.

flipkart samarth

సీదాసాదానే అయినా అర్థవంతం, మొరటే కానీ.. సుసంపన్నం- దేశీయ, గిరిజన కళారూపాలు శక్తిమంతమైన భారత కళావారసత్వంలో ముఖ్యమైన భాగం.

భారత గిరిజన సహకార విక్రయాభివృద్ధి సమాఖ్య (ట్రైఫెడ్‌), కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలో 1987లో ఏర్పాటైంది. దేశవ్యాప్తంగాగల గిరిజన కళా, చేతివృత్తుల, చేనేత ఉత్పత్తుల తయారీ, విక్రయాలను ప్రోత్సహించడం దీని బాధ్యత. దేశంలోని దాదాపు 3,50,000 మంది గిరిజన ప్రజల జీవితాలను ఈ సమాఖ్య ప్రభావితం చేస్తుంది. ఈ అత్యున్నత సంస్థ ‘ట్రైబ్స్‌ ఇండియా’ బ్రాండు కింద వివిధ శ్రేణుల విశిష్ట చేనేత, హస్తకళా ఉత్పత్తులను విక్రయిస్తుంది.

ట్రైబ్స్‌ ఇండియా 2020లోఫ్లిప్‌కార్ట్‌ సమర్థ్‌తోజోడీకట్టింది.ఇది గిరిజన సంప్రదాయక కళా, హస్తకళా ఉత్పత్తులను ఆన్‌లైన్‌ వేదికపైకి తెచ్చి, దేశవ్యాప్తంగా 35 కోట్ల వినియోగదారులతో కూడిన ఆధునిక మార్కెట్‌ను వారికి చేరువ చేసింది.

ఈసారిబిగ్‌ బిలియన్‌ డేస్‌లో భాగస్వాములైన హస్త కళాకారులు, చేనేతకారులు ‘భారత కళారూపాల’ ఇతివృత్తంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఉత్పత్తులను అందిస్తున్నారు.

అర్ధవంతమైన, వారసత్వ సంపదతో కూడిన వారి కళా నైపుణ్యం, భారత ఆత్మను పరిశీలించండి. అలాగే ఈ పండుగ సమయంలో నేరుగా ఫ్లిప్‌కార్ట్‌లో ఆ కళాకారులకు మద్దతివ్వండి.


వర్లి కళా ఉత్పత్తులు
గుజరాత్‌

tribal art

ర్లి అనేది గుజరాత్‌లోని డాంగ్‌ జిల్లా కళాకారుల నైపుణ్యాన్ని చాటే చిత్రలేఖన కళారూపం. రాష్ట్రంలోని దక్షిణ సరిహద్దు ప్రాంతంలో నివసించే వర్లీ సామాజిక వర్గం వారికి ఇది సంప్రదాయ కళ. అనేక భారతీయ కళారూపాల తరహాలోనే వర్లీకి కూడా ఆచారాలపరమైన ప్రాముఖ్యం ఉంది- ఈ మేరకు వారి కుటుంబాల్లో పెళ్లిళ్లు, పంట నూర్పిళ్ల సమయంలో వాటిని ప్రతిబింబిస్తూ వీరు తమ చిత్రలేఖన నైపుణ్యాన్ని చాటుకుంటారు. వీరి చిత్రాల్లో సాధారణంగా మూలాంశం మాతృదేవతను సూచించేదిగా ఉంటుంది. అలాగే చతురస్ర ఆకారాలతో సఫలత, సౌభాగ్యాలను ప్రస్ఫుటం చేస్తుంది. వృత్తం సూర్యచంద్రులను సూచిస్తే, త్రిభుజాలు మానవ రూపాలను ప్రతిబింబిస్తాయి. వారి కళానైపుణ్యం తరచూ ప్రకృతితో మానవాళి సామరస్యాన్ని చూపడానికి యత్నిస్తుంది.

తయారీదారులను కలుసుకోండి

tribal art

ఫ్లిప్‌కార్ట్‌ వేదికపై కళాకారులను నేరుగా ప్రోత్సహించేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి.


మహేశ్వరి చీరలు
మధ్యప్రదేశ్‌

tribal art

ధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌ ప్రాంతంలో మహేశ్వరి చీరల తయారీ భావన 18వ శతాబ్దం నాటిదిగా పరిగణనలో ఉంది. తొలినాళ్లలో ఈ చీరలను స్వచ్ఛమైన పట్టుతో తయారుచేసేవారు. కానీ, కాలక్రమాన చీరల నేతలో పత్తి నూలు చేర్చబడింది. మహేశ్వరి చీరపై మూలాంశాలకు స్ఫూర్తినివ్వడంలో మధ్యప్రదేశ్‌లోని కోటల వైభవం, వాటి డిజైన్లు కీలక పాత్ర పోషిస్తాయి.

తయారీదారులను కలుసుకోండి

tribal art

ఈ చీరల తయారీ కళాకారులు దాని జన్మస్థలమైన మహేశ్వర్ ప్రాంతం నుంచి వచ్చినవారు. వారి స్వయం సహాయక బృందం పేరు ‘మా అహల్య సమూహ్.’ ఈ బృందం సభ్యులైన మహిళలందరూ ఈ ప్రాంత తెగలకు చెందినవారే. మహేశ్వరి చీరల తయారీలో వారి నైపుణ్యం అపారం. వారి ప్రధాన ఆదాయ వనరు ఇదే.

Click here to directly support these artisans on Flipkart.


బాఘ్‌ ప్రింట్లు
మధ్యప్రదేశ్‌

tribal art

బాఘ్‌ ప్రింట్‌ అన్నది సహజ రంగులతో మేళవించిన సంప్రదాయక హ్యాండ్ బ్లాక్ ప్రింట్. ఇది మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ధార్ జిల్లా బాఘ్‌ ప్రాంతంలో ప్రజలు అనుసరించే భారతీయ హస్తకళ. బాఘ్‌ నదీతీరానగల ఈ గ్రామం నుంచి వచ్చినందువల్ల ఈ కళకు అదే పేరు స్థిరపడింది. కూరగాయల నుంచి రూపొందించిన వర్ణాలతో తెలుపు నేపథ్యంగల వస్త్రంపై ఎరుపు-నలుపు రంగులతో ప్రతిరూపాలను పూల కూర్పులతో తీర్చిదిద్దే బాఘ్‌ ప్రింట్ ఒక ప్రసిద్ధ వస్త్రముద్రణ ఉత్పత్తి.

తయారీదారులను కలుసుకోండి

tribal art

మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లా బాఘ్‌కు చెందిన వేలాది కళాకారులుకోవిడ్‌-19 దిగ్బంధం వల్ల తీవ్రంగా దెబ్బతిన్నారు. మహమ్మారి సమయంలో వారి సంప్రదాయ వస్త్రాలకు డిమాండ్‌, విక్రయాలు దారుణంగా పడిపోయాయి. ఈ బ్లాక్‌ ప్రింట్‌ కళారూపాల తయారీ కోసం పరిసర గ్రామాల నుంచి బాఘ్‌ గ్రామానికి కళాకారులు వస్తుంటారు. అయితే, మహమ్మారి కారణంగా అగర్‌, ఉదయ్‌పుర, మహాకాల్‌ పురా, ఘట్‌బోరి, బాకీ, కడ్వాల్‌, పిప్రి, రాయ్‌సింగ్‌ పురా సహా 25-30 గ్రామాలవారు జీవనోపాధి కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాలలో బాఘ్‌ ప్రింట్ వస్త్రాల తయారీలోగల గిరిజన తెగలు, వారి కుటుంబాలు తమ జీవనోపాధి కోసం ఈ హస్తకళా ఉత్పత్తుల అమ్మకంపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌ వేదికపై కళాకారులను నేరుగా ప్రోత్సహించేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

Enjoy shopping on Flipkart