అత్యంత సవాళ్లతో కూడుకున్న సమయాల్లో కూడా భారతదేశ కళాత్మక వారసత్వాన్ని కాపాడేందుకు, ఒడిషాలోని రఘురాజ్‌పూర్ గ్రామ నివాసితులు ఇ-కామర్స్‌ను స్వీకరించారు. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మందితో భారతదేశపు ప్రాచీన కళారూపాలను పంచుకున్నారు. వారంతా మహమ్మారి సమయాన్ని ఎదుర్కొని, చక్కని మనోబలంతో ఫ్లిప్‌కార్ట్‌ను ఉపయోగించడం ద్వారా వారి జీవనోపాధిని ఎలా నిలబెట్టుకున్నారో చూడండి.
ఒడిషాలోని పూరీ పుణ్యక్షేత్రానికి సమీపంలోని రఘురాజ్‌పూర్ గ్రామం పురాతన వారసత్వ కళారూపాలను సంరక్షిస్తూ, భారతదేశంలో ఉండే గొప్ప కళాకారులలో కొందరికి నిలయం. అక్కడ దాదాపు ప్రతి 120 గృహాలలో ఒక కళాకారుడు ఉన్నందున, వారు భారతదేశంలోని కొన్ని పురాతన కళారూపాలను పునరుజ్జీవింపజేయడం మరియు వాటిని ప్యాచుర్యంలోకి తీసుకురావడంలో ఆశ్చర్యం లేదు. తద్వారా అవి కాలగర్భంలో కలిసిపోకుండా ఉంటాయి.
ఒడిషాలో కాన్వాస్ ఆఫ్ ఛేంజ్‌ని చూడండి
ఈ మనోహరమైన గ్రామంలో చాలా కుటుంబాలు తమ పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగించేందుకు కలిసి ముందడుగు వేస్తాయి. అయితే కొందరు 12 సంవత్సరాల వయసులోనే కళాకృతులకు పునరుజ్జీవం పోసే పనిని మొదలుపెడతారు. ఎందుకంటే సాంప్రదాయక కళారూపాలు అనేవి వారి కుటుంబీకుల్లో ఆ స్థాయిలో కలిసిపోయి ఉంటాయి. పట్టచిత్రం నుంచి తాళపత్రం మొదలుకొని చెక్క బొమ్మలు, టస్సర్ పెయింటింగ్స్.. మొదలైనవాటిలో ఈ గ్రామస్థుల ప్రతిభను మనం విశ్వసించవచ్చు. ఈ విలువైన సంస్కృతి కాలపరీక్షని తట్టుకుని నిలబడుతుందని నిర్థరించేందుకు భారతదేశానికి చెందిన కొన్ని వారసత్వ నృత్యరూపాలను సైతం ఇక్కడ ఇళ్లలో అభ్యసిస్తూ ఉంటారు.
ఈ కళాకారుల్లో చాలామందికి వారి జీవనోపాధి పర్యాటకం పై ఆధారపడి ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి పర్యాటకం పై చూపిన ప్రభావం కారణంగా నిబంధనలతో అదంతా ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా నలువైపుల నుంచీ వచ్చిన పర్యాటకులతో కిటకిటలాడిన ఈ గ్రామం అందరూ సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతో చేసిన లాక్‌డౌన్ కారణంగా నిశ్శబ్దంగా ఉండిపోయింది. ప్రయాణాలు ఆగిపోవడంతో వారు కష్టపడి సృష్టించిన కళలు మరియు వారి ఆదాయ అమ్మకాలు కూడా బాగా తగ్గాయి.
ఈ కళాకారులకు తగిన సహాయం అందించడం ద్వారా వారికి ఉపశమనం కలిగించడానికి స్టేట్ ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ (SIDAC) మరియు ఫ్లిప్‌కార్ట్ సమర్థ్ సంయుక్తంగా వారిని ఈ-కామర్స్ విభాగంలోకి తీసుకువచ్చాయి. మిలియన్ల మందికి చేరుకునేందుకు అవసరమైన వేదికను మాత్రమే కాదు.. మహమ్మారిని ఎదుర్కొనే సుస్థిరమైన జీవనోపాధిని సైతం ఈ ప్రతిభావంతులకు అందించాయి.
ఫ్లిప్‌కార్ట్ మరియు పాన్ ఇండియా వినియోగదారులకు ఉన్న యాక్సెస్ సౌలభ్యంతో ఒడిషాకు చెందిన చేతివృత్తులవారు, చేనేత కార్మికులు మరియు హస్తకళాకారులు ఇప్పుడు వారి పనిని ప్రదర్శించేందుకు ఓ జాతీయ స్థాయి వేదికను కలిగి ఉన్నారు. చాలామందికి ఇవి చేరుకోవడంతోనే భారతదేశంలో ఈ కళాకృతుల ఉనికి చాటితే; ఇంకొంతమందిలో ఇది ఆశను ప్రేరేపించడం ద్వారా ఎలాంటి పరిమితులు లేకుండా వారు సృజనాత్మకంగా ఉండేందుకు అనుమతిస్తుంది.
అలాగే ఇది కూడా చూడండి; లాజిస్టిక్స్ అన్‌బాక్స్డ్; ఇన్‌సైడ్ ఇండియాస్ లార్జెస్ట్ వేర్‌హౌస్