అస్సాంలోని గౌహతిలో నబజ్యోతి లహ్కర్ ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో దేశవ్యాప్తంగా అద్భుతమైన సాంకేతిక ఆధారిత సేవల ప్రపంచానికి బాటలు పడ్డాయి. ఆ విధంగా తొలిసారి ఫ్లిప్‌కార్ట్ యాప్ వాడకం ప్రారంభించిన అతడు, అటుపైన విశ్వసనీయ ఖాతాదారుగా మారిపోయాడు. మరోవైపు అస్సాంలోని తమ చిన్న గ్రామం తులసిబారిలో కూడా ఫ్లిప్‌కార్ట్ కిరాణా సరుకుల చేరవేత గురించి ఇటీవల తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అంతేకాకుండా నబజ్యోతి తన ఉత్సాహాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్, తన గ్రామ ప్రజలకు రోజువారీ అవసరాల మెరుగైన సౌలభ్యం, ఎంపికను చేరువ చేసిందని ఆయన చెప్పాడు. ఫ్లిప్‌కార్ట్ సేవల గురించి తెలుసుకుని, సౌలభ్య అనుభవం పొందడంతోపాటు దాన్ని ఇతరులతో పంచుకున్న నబజ్యోతి కథనం ఇప్పుడు చదవండి.
2013లో నబజ్యోతి లహ్కర్తొలిసారిఫ్లిప్‌కార్ట్‌నుంచి కొనుగోలు ప్రారంభించాడు. అప్పట్లో అతడు అస్సాంలోని గౌహతిలో ఇంజనీరింగ్ చదువుతూండేవాడు. తమ స్వగ్రామం తులసిబారితో పోలిస్తే గౌహతిలో అవకాశాలు విభిన్నమని నబజ్యోతి గుర్తుచేసుకున్నాడు. నగర స్థాయిలో అప్పటికే డిజిటల్ విప్లవం ఊపందుకుంటున్నా అస్సాంలోని కామరూప్ జిల్లాలో ఓ చిన్న, మారుమూల గ్రామమైన తులసిబారిలో 2016 నాటికిగానీ చేరలేదు.
“నా ఇంజనీరింగ్ పూర్తయ్యాక మళ్లీ స్వగ్రామం వచ్చాను” అని నబజ్యోతి చెప్పాడు. “ఆ సమయానికి ఫ్లిప్‌కార్ట్ తన సేవలను మా గ్రామందాకా విస్తరించడం గమనించి, ఆనందాశ్చర్యాలకు గురయ్యాను” అన్నాడు.
“అప్పటినుంచీ మా ఇంటినుంచే అందరికీ కావాల్సిన వస్తువులను ఫ్లిప్‌కార్ట్ నుంచి కొంటున్నాను” అని తెలిపాడు.
ఈ నేపథ్యంలో 2022 జనవరిలో నబజ్యోతి తమకు అందివచ్చిన మరో సౌలభ్యం గురించి తెలుసుకున్నాడు. “మా గ్రామంలో ఫ్లిప్‌కార్ట గ్రోసరీ సేవలు అందడాన్ని నేను ఇటీవల గమనించాను. ఆ సేవలు పొందడంలో సౌలభ్యం తెలిశాక మా గ్రామీణ జీవితాలకు అదొక అదనపు ప్రయోజనం కావడం మరింత ఆనందం కలిగించింది” అని అతడు వివరించాడు. “సివిల్ సర్వీసెస్ కోసం ప్రయత్నిస్తున్న నాకు సమయం చాలా అమూల్యం. అందువల్ల ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ ద్వారా కేవలం 3-5 నిమిషాల వ్యవధిలోనే నా కొనుగోలు పూర్తిచేసేవాణ్ని. అటుపైన జరగాల్సిందంతా సజావుగా సాగిపోయేది” అన్నాడు.
భారతదేశంలోని అనేక గ్రామాల్లో తులసిబారి గ్రామవాసి నబజ్యోతి వంటి ఖాతాదారులకు ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ ఇ-కామర్స్ వేదిక ద్వారా అనుసంధాన సౌలభ్యమేగాక రకరకాల ఎంపికలకూ అవకాశం లభించిందన్న మాట. “అంతకుముందు సాధారణంగా ఒక ఉత్పత్తి విషయంలో మాకు 2 లేదా 3 ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉండేవి. అందువల్ల ఇష్టంలేకపోయినా వాటిలో ఏదో ఒకదానితో సంతృప్తి చెందక తప్పేది కాదు” అని ఆయన పేర్కొన్నారు.
ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ నేడు దేశవ్యాప్తంగా 1,800కుపైగా నగరాలు, 10,000కుపైగా పిన్ కోడ్ ఆధారిత ప్రాంతాలకు సేవలందిస్తోంది. గౌహతిలో తాజాగా ఏర్పాటు చేసిన గిడ్డంగి సదుపాయం ద్వారా గౌహతి అంతటా 800కుపైగా పిన్ కోడ్‌లతో పాటు అగర్తల, ఐజ్వాల్, డార్జిలింగ్, డిబ్రూగఢ్, ఇంఫాల్, కొహిమా, షిల్లాంగ్‌సహా ఇతర నగరాలు, పట్టణాల్లోని ఖాతాదారుల కిరాణా అవసరాలు కూడా తీర్చగలుగుతోంది. నాణ్యమైన ఆహారం, గృహోపకరణాలకు… ముఖ్యంగా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో డిమాండ్ పెరుగుతున్న కారణంగా- ప్రతి ఖాతాదారుకూ నాణ్యమైన కిరాణా ఉత్పత్తులను నిరంతరాయంగా, సరళంగా అందించేలా ఫ్లిప్‌కార్ట్ కిరాణా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది.
“మా వరకూ మాకు ఫ్లిప్‌కార్ట సేవలంటే నమ్మకమైన, అధిక నాణ్యతగల ఉత్పత్తులకు భరోసా. మంచి అన్నది ఎక్కడున్నా దాన్ని గుర్తించి, అభినందించాలన్నది నా అభిప్రాయం” అని నబజ్యోతిఒక ట్వీట్ ద్వారా స్పష్టం చేశాడు. అలాగే ఈ సేవలు తులసిబారిలో లభించడం గురించి, దానిపట్ల తన కుటుంబంలో సంతోషం గురించి కూడా అందులో వివరించాడు.
“మా గ్రామంలోని నా మిత్రులు, సన్నిహితులలో కొందరికి నేను ఫ్లిప్‌కార్ట్ వేదికను పరిచయం చేశాను. ఆ తర్వాత ఈ సేవల గురించి వారిలో కొందరు ట్వీట్ చేశారు” అని ఆయన చెప్పారు. దీనివల్ల ప్రయోజనాలేమిటో స్వయంగా తెలుసుకున్న నబజ్యోతి తల్లి కూడా తమ రోజువారీ అవసరాల కోసం ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీని ఎంచుకోమని తన కొడుకును కోరడం ద్వారా సంతృప్తికర ఖాతాదారుల సమూహంలో ఒకరయ్యారు.