నా ఫ్లిప్‌కార్ట్ అకౌంట్ బ్లాక్ అయిందా? మరింత నేర్చుకోండి మరియు సహాయం పొందండి

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | ગુજરાતી | मराठी

మీ ఫ్లిప్‌కార్ట్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వలేకపోతున్నారా? వినియోగదారులకు ప్రాధాన్యాన్నిచ్చే వేదికగా ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదారులు షాపింగ్ చేసే సమయంలో వారి భద్రతకు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటుంది. మరి, ఫ్లిప్‌కార్ట్ అకౌంట్స్ ఎందుకు బ్లాక్ అవుతాయి? అలాగే ఈ సమస్యకు సహాయం పొందడం ఎలాగో తెలియాలంటే ఇది చదవండి.

Flipkart Account Blocked - Learn more and get help

ఫ్లిప్‌కార్ట్ అకౌంట్ బ్లాక్ అయిందా? కారణాలు తెలుసుకునేందుకు ఇది చదవండి.

రోజూ కొన్ని మిలియన్ల సంఖ్యలో వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులు/ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ యాప్ లేదా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవుతూ ఉంటారు. ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని ఫ్లిప్‌కార్ట్ మరింత సులభతరంగా, సౌకర్యవంతంగా, అందుబాటులో ఉండేలా చేయడం ద్వారా భారతీయులంతా ఆన్‌లైన్‌ షాపింగ్ చేయడం ద్వారా వారి కోరికలు తీర్చుకునేందుకు గల మార్గాన్ని సులభం చేసింది.

మొదటిసారి ఉపయోగించే వినియోగదారులు రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఫ్లిప్‌కార్ట్ అకౌంట్‌ క్రియేట్ చేసుకోవచ్చు. తద్వారా వారు ఎంచుకున్న భాషలోనే యాప్‌ని బ్రౌజ్ చేయచ్చు. సైన్ ఇన్ అవ్వడానికి పాస్వర్డ్‌తోపాటూ ధృవీకరించబడిన ఈమెయిల్ అడ్రస్ లేదా భారతీయ మొబైల్ ఫోన్ నెంబర్‌ను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్‌కు ఒక సెక్యూర్ వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) కూడా పంపవచ్చు. దానిని మీరు లాగిన్ క్రెడెన్షియల్‌గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో మీకు కలిగే బ్రౌజింగ్ అనుభవం అంతా చాలా సురక్షితమైంది అలాగే భద్రమైనది కూడా. అవి మాత్రమే కాదు.. వ్యాలెట్స్, పేమెంట్ ఇన్ఫర్మేషన్, అడ్రసెస్ మరియు ఆర్డర్ హిస్టరీ.. మొదలైనవి కూడా భద్రంగా ఉంటాయి.

వినియోగదారులకే మొదటి ప్రాధాన్యం అన్నది ఫ్లిప్‌కార్ట్ అనుసరించే మార్గం

ఫ్లిప్‌కార్ట్ మార్కెట్‌ప్లేస్ వినియోగదారులందరికీ ఎటువంటి అవాంతరాలు లేని అనుభవాన్ని అందించడానికి కట్టుబడి ఉంది. అలాగే ప్రతి వినియోగదారుని ఫిర్యాదుకు త్వరితగతిన పరిష్కారాన్ని అందించడానికి ప్రయత్నిస్తాము. వినియోగదారుల ఆందోళనలను అర్థం చేసుకునే అంకితమైన ఎగ్జిక్యూటివ్‌ల బృందం మా వద్ద ఉంది. స్థాపించబడిన ప్రక్రియలు మరియు సాంకేతిక వ్యవస్థల ద్వారా వారి సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తాం.

మా వినియోగదారులు తమ సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చేందుకు ఇచ్చే ప్రతి ఫిర్యాదును మేము బాగా పరిశీలించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటాం. కొనుగోలుకు సంబంధించిన నిబంధనల మేరకు అది ‘రిఫండ్ లేదా ఎక్స్ఛేంజ్’ కూడా కావచ్చు. వస్తువుల నాణ్యత లేదా పొరపాటుగా డెలివరీ చేయబడిన అంశాల గురించి ఫిర్యాదు ఉన్న సందర్భాల్లో, మేము ఏది ఏదైనా తప్పు చేసిన పక్షంపై కూడా చర్య తీసుకుంటాము.

స్టాక్ అయిపోయే ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉంటుంది కాబట్టి విక్రేతలు క్యాన్సిల్ చేసిన కారణంగా వినియోగదారులు నిరాశ చెందవచ్చని మేము ఎప్పుడూ గుర్తుంచుకుంటాం.

చాలా అరుదైన సందర్భాల్లో వినియోగదారుల అత్యధిక అభిరుచులను రక్షించి, భద్రత కల్పించేందుకు కొన్ని అకౌంట్స్ బ్లాక్ చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ అకౌంట్స్ ఎందుకు బ్లాక్ అవుతాయి?

ఫ్లిప్‌కార్ట్ యొక్క కస్టమర్ పాలసీకి అనుగుణంగా మా సాంకేతికత ఆధారిత ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ వినియోగదారులందరికీ ఎల్లవేళలా సురక్షితంగా ఉండేలా ఎక్కడికక్కడ మల్టిపుల్ చెకింగ్స్ మాత్రమే కాదు.. బ్యాలన్స్‌లను సైతం ఉంచాం.
మీ అకౌంట్‌ని మోసగాడు వినియోగించినా లేక భద్రమైన షాపింగ్ ప్రాక్టీసెస్ కాకుండా అనుమానాస్పదంగా ఏదైనా యాక్టివిటీ మీ అకౌంట్‌లో గుర్తించినా మీ అకౌంట్ పాస్వర్డ్ రీసెట్ చేయడం జరుగుతుంది. తద్వారా అనధికారమైన యాక్సెస్‌ని మనం అరికట్టవచ్చు. ఇలాంటి కేసుల్లో మా సపోర్ట్ టీంని మీరు సహాయం కోసం సంప్రదించవచ్చు. వారు మీ క్రెడెన్షియల్స్ నిర్ధరించుకున్న తర్వాత అకౌంట్ యాక్సెస్‌ని రీస్టోర్ చేస్తారు.

మీ ఫ్లిప్‌కార్ట్ అకౌంట్ బ్లాక్ అయిందని మీరు భావిస్తే, ఇలా జరగడానికి గల కారణాలను, మీరు ఏమి చేయగలరో మరియు మీ ఫ్లిప్‌కార్ట్ ఖాతాకు ఎలాంటి అవాంతరాలు లేని యాక్సెస్‌ను ఎలా తిరిగి పొందవచ్చో పరిశీలించండి.

సహాయం! నా ఫ్లిప్‌కార్ట్ అకౌంట్ బ్లాక్ అయిందని నేను అనుకుంటున్నాను.

రిలాక్స్! అనుమానాస్పద దుర్వినియోగం లేదా అధిక మొత్తంలో దుర్వినియోగాలకు వ్యతిరేకంగా మరియు ప్లాట్‌ఫారమ్‌లో షాపింగ్ చేసే వినియోగదారులందరి ప్రయోజనాలను రక్షించడానికి మీ Flipkart ఖాతా చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే బ్లాక్ చేయడం జరుగుతుంది.
ఖాతా బ్లాక్ చేయడానికి గల కొన్ని కారణాలు క్రింద ఉన్నాయి:

    • రిటర్న్ రిక్వెస్ట్స్ అసాధారణంగా అధిక సంఖ్యలో రైజ్ చేయడం. .నిజమైన వినియోగదారులను అలాగే మార్కెట్ ప్లేస్ విక్రేతలను సంరక్షించుకునే క్రమంలో అసాధారణంగా అధిక సంఖ్యలో రిటర్న్ రిక్వెస్ట్‌లను అకారణంగా రైజ్ చేయడం వల్ల వీరు ప్రభావితం కాకుండా ఫ్లిప్‌కార్ట్ తీసుకున్న భద్రతా చర్యల్లో ఇదొకటి.
      • అసాధారణ పేమెంట్ యాక్టివిటీ – తప్పు చిరునామా లేదా అందుబాటులో లేని చిరునామాకు మళ్లీ మళ్లీ డెలివరీ ఆర్డర్స్ పెట్టడం ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ని దుర్వినియోగం చేయడం, మల్టిపుల్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయడం, మళ్లీ మళ్లీ కార్డ్ నంబర్ లేదా సీవీవీ సంఖ్య తప్పుగా ఎంటర్ చేయడం.. మొదలైనవన్నీ మోసపూరిత చర్యలుగానే భావించడం జరుగుతుంది. ఫలితంగా మీ ఫ్లిప్‌కార్ట్ అకౌంట్ భద్రత నిమిత్తం యాక్సెస్‌ని నిలిపివేయడం జరుగుతుంది..

ఒకే వస్తువు లేదా ఒకే తరహా వస్తు ఉత్పత్తులను

      • అధిక మొత్తంలో కొనుగోళ్లు చేయడం – అధిక ధరలు ఉన్న ఉత్పత్తులను ఒకే సెషన్‌లో ఎక్కువగా కొనుగోలు చేయడం లేదా ఒకే ఆర్డర్‌లో అధిక ధర గల ఉత్పత్తులు కొనుగోలు చేసినా విక్రేతలు నిరుత్సాహానికి గురి కాకుండా జాగ్రత్తపడేందుకు కూడా ఆ అకౌంట్‌ని బ్లాక్ చేయచ్చు..
      • సరికాని ఓటీపీలను ఎక్కువసార్లు ఎంటర్ చేసినా అకౌంట్ 24 గంటల పాటు తాత్కాలికంగా బ్లాక్ చేయడం జరుగుతుంది. తద్వారా మీ ఫ్లిప్‌కార్ట్ అకౌంట్‌కు ఎలాంటి రాజీ లేకుండా భద్రత కల్పించే అవకాశం ఉంటుంది.

మోసపూరిత చర్యలకు ఎక్కువగా అవకాశం ఇచ్చేవి నిద్రావస్థలో ఉన్న అకౌంట్స్ (అంటే 6 నుంచి 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం నుంచి లాగిన్ కానివి). దీర్ఘకాలం పాటు అకౌంట్ ఉపయోగించకుండా ఉంచేసి, ఇప్పుడు దానిని ఉపయోగించేందుకు మీరు చూస్తున్నారా? ఒకవేళ మీ లాగిన్ ప్రయత్నం విజయవంతం కాకపోతే మా హెల్ప్ సెంటర్ సహాయం పొందేందుకు మమ్మల్ని ఆశ్రయించండి.

ఎటువంటి అవాంతరాలు లేని షాపింగ్ అనుభవం పొందడం కోసం ఈ స్టెప్స్‌ని అనుసరించండి.

      • మీ స్మార్ట్ ఫోన్‌/డివైస్‌లో గూగుల్ ప్లే స్టోర్ ( ఆండ్రాయిడ్ )లేదా యాపిల్ యాప్ స్టోర్ (నుంచి iOS)లేటెస్ట్ సెక్యూర్డ్ వెర్షన్ ఫ్లిప్‌కార్ట్ యాప్‌ని అప్డేట్ చేయండి.
      • అలాగే మీ డివైస్ ఛార్జ్ చేసి ఉండడమే కాకుండా స్థిరమైన, సురిక్షితమైన 4G or WiFi నెట్వర్క్ కలిగి ఉండేలా చూసుకోండి.
      • అవసరం లేని యాప్స్‌ని షట్‌డౌన్ చేసేయండి. అవి మీ డివైస్ పెర్ఫార్మెన్స్‌ని మరింత నెమ్మదించేలా చేస్తాయి.
      • ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో మీ పేమెంట్ పద్ధతులను అప్డేట్ చేసుకోండి. మీ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ వివరాలను సరైన CVV మరియు ఎక్స్‌పైరీ తేదీలతో అప్డేట్ చేశారో లేదో చెక్ చేసుకోండి. అలాగే మీ ఆన్‌లైన్ వ్యాలెట్స్ మరియు UPI యాప్స్ పరస్పరం కనెక్ట్ అయ్యి ఉన్నాయో లేదో, వాటిలో టాప్స్ అయ్యాయో లేదో కూడా సరి చూసుకోండి. ఒకవేళ మీరు డెబిట్ కార్డ్స్ ద్వారా పే చేయాలని ఎంచుకుంటే మీ బ్యాంక్ అకౌంట్‌లో తగినంత మొత్తంలో సొమ్ము అందుబాటులో ఉండేలా జాగ్రత్తపడండి.
      • మీ పేరు, చిరునామా.. పిన్ కోడ్స్ వంటి వివరాల్లో ఎలాంటి
      • అక్షర దోషాలు లేకుండా సరిచూసుకోండి. భారతదేశంలో అన్ని పిన్ కోడ్స్‌కు ఫ్లిప్‌కార్ట్ డెలివరీ సేవలు అందుబాటులో ఉన్నాయని గమనించండి. ఏది ఏమైనప్పటికీ; విక్రేతల పాలసీలు మరియు వారికి అనువర్తించే ప్రాంతీయ చట్టాలకు అనుగుణంగా కొన్ని ఉత్పత్తులు అన్ని పిన్‌కోడ్స్‌కీ డెలివర్ చేసే సౌలభ్యం లేదు.
      • పాస్వర్డ్ OTP వంటి మీ లాగిన్ యాక్సెస్ క్రెడెన్షియల్స్‌ను ఎవరితోనూ పంచుకోకండి. ఇవి మీ ఫ్లిప్‌కార్ట్ అకౌంట్ అనధికారిక యాక్సెస్‌కు దారి తీయవచ్చు. .

ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవడం ద్వారా మీ ఫ్లిప్‌కార్ట్ అకౌంట్‌ని ఎలాంటి అవాంతరాలు లేకుండా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే భద్రంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా షాపింగ్ చేసుకోవచ్చు.

సురక్షితమైన షాపింగ్ మీతోనే ప్రారంభం అవుతుంది

ఫ్లిప్‌కార్ట్ స్టోరీస్ వెబ్‌సైట్ మరియు మా సోషల్ మీడియా ఛానల్స్‌లో ద్వారా తెలియజేసేందుకు #FightFraudWithFlipkartహ్యాష్‌ట్యాగ్‌తో ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదాలకు సురక్షితమైన షాపింగ్ ప్రాక్టీస్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. ఈ కంటెంట్‌ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు సహచరులతోనూ పంచుకోవచ్చు.
దీంతోపాటూ మోసగాళ్లు అనుసరించే పద్ధతులు మరియు వారి చర్యలను ఎప్పటికప్పుడు లా ఎన్‌ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు నివేదిక అందిస్తుంది. ఫలితంగా వినియోగదారులు సురక్షితమైన, భద్రమైన మరియు పూర్తి నమ్మకంతో కూడిన షాపింగ్ అనుభవాన్ని పొందగలరు.


#SafeCommerce నిపుణులు కావాలని అనుకుంటున్నారా? అలాగే ఉత్తేజకరమైన క్విజ్‌లు మరియు కంటెస్ట్‌లలో పాల్గొనడం ద్వారా సురక్షితమైన షాపింగ్ పై మీకు ఉన్న అవగాహనను పరీక్షించుకునేందుకు ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లలో ఫ్లిప్‌కార్ట్‌స్టోరీస్‌ని ఫాలో అవ్వండి. #FightFraudWithFlipkart హ్యాష్‌ట్యాగ్ కోసం చూడండి.

Enjoy shopping on Flipkart